Tuesday, 27 March 2012

తెలుగు సీరియల్స్ బాబోయి, తెగ పిలుస్తున్నాయి...... !


గడియారం కొట్టే ఆరున్నర..
'కలవారి కొడళ్ళో'చ్చి comeon అంటారు...

ఏడవుతూనె 'చిన్నకొడలు' ఏడుపు ని చూస్తూ...

ఏడున్నరకి 'పసుపు-కుంకుమ' పరిస్థితి ని పరీక్షిస్తూ...

ఎనిమిది కి 'ముద్దుబిడ్డ' జ్వాలగ్ని లొ కాలుతూ.. 
ఎనిమిదిన్నరకి 'భార్యమణి' ని భరిస్తూ..

తొమ్మిదవుతూనే 'కన్యాదానం' కలవరపరుస్తూ..
తొమ్మిదిన్నరకి 'దేవత' దయ్యం లా మారుతుంటే..

ఏమీ చేయలేక ,

పది కి 'మమతలకొవెల' లొ బంధీనవుతూ..
పదిన్నరకి 'శ్రీ' వలలో చిక్కుకుపొతే ,అమ్మ వచ్చి, సీతా... ఈరొజు కి చదువు లెదా అంటే..

గడియారం చూసి పదకొండు అనుకుంటూ ఉండగా..


'నేనే సత్యభామ'నంటూ  విచ్చెసింది ఆమని..
బదులు గా సమధానం  చెప్పను ఏమని???--మీ సీత....

.


Friday, 23 March 2012

ఉగాది శూభాకంక్షలు...

మామిడి తొరణాలతొ ముచ్చట గొలిపే ఉగాది...  
మేళవింపచెయాలి మన మనసులని మంచి గా...    

ఫంచాంగాల తో ప్రణవనాదం పలికే  ఉగాది... 
ఫ్రయాణం చెయించాలి జీవిత పడవని  పరిమళం గా ... 

తెలుగు వారికే ప్రత్యెకమయిన  ఉగాది...
తెరిపించాలి తేనెతెలుగు కు తలుపులు తేలిక గా... 

వసంత ఋతువుకు వందనం తెలిపే ఉగాది...
వెన్నంటే ఉండాలి వేకువను వెలిగించే నిజమిత్రుని గా..


ఉదయించిన సుర్యుడి తొ వచ్చె ఉగాది ..
ఉయలలూగించలి చిన్ని ఊహలను ఊరడింపుగా..


మామికొమ్మ  పై కొకిల తో కుహూ కుహూ మనిపించే ఉగాది.... 
కూర్చాలి కొత్తపెళ్ళి కూతుర్ల కలల సౌధాన్ని మధురకావ్యం గా... 

షడ్రుచులతో మనల్ని చెరాలని వచ్చిన ఈ ఉగాది...
అవ్వాలి మనలొని అరిషడ్వర్గాలని తెగనరికే నందనఖడ్గం గా... 

ఆ "ఖర" ను సాగనంపుతూ వచ్చిన ఈ ఉగాది..
కావాలి మన జీవితాలలో నూతనా"నంద"యుగానికిఆది...
ఆరోగ్యమయిన ఆకారమై వెలగాలి మన కలల రూపం గా
ఆనందాల అందమయివెలగాలి జీవితం రంగురంగుల ముగ్గులా  !!!!!!

 అందరికీ నందననామ ఉగాది శుభాకాంక్షలు..!!!

--మీ సీత.... Thursday, 15 March 2012

ఓ నేస్తం ఇదే నా గమ్యం.....

అలసిన క్షణంలో తోడూ కై వెతుకులాట ...
బాధ గా ఉన్నప్పుడు ఓదార్పు కై వెతుకులాట...
ఆనందం గా ఉన్నప్పుడు స్నేహితుల  కై  వెతుకులాట...
పండుగ వస్తే సరదా  కై  వెతుకులాట ...
ఒంటరి గా ఉన్నప్పుడు తోడు  కై  వెతుకులాట ...

జీవితం లో అన్నిటికై వెతుకులాట..ఓ నేస్తం ....
 నా అలసిన క్షణానికి నీ చిరునవ్వే గమ్యం ..
నా బాధ లో నీవిచ్చే స్పూర్తే నా గమ్యం..
నా ఆనందం లో నీ సాన్నిహిత్యమే నా గమ్యం ..
నా పండుగలో నీ సరదాలే నా గమ్యం ...
నా ఒంటరితనం లో నీ తోడే నా గమ్యం ....

చెప్పాలి అంటే ...
నీ స్నేహమే  నా గమ్యం ....!!--మీ సీత.. 

Thursday, 8 March 2012

మిత్రులందరికీ హొలి శుభాకాoక్షలు ...


హొలి శుభాకాoక్షలు ...
శాంతి మర్గన్ని "తెలుపు"తూ నిలవాలి...
అన్యయాన్ని "నలుపు"తూ గెలవాలి...
పవిత్రమయిన "పసుపు" లా ప్రేమపూయాలి...
స్నేహానందం  అనే జ్యొతి మనలో "ఎర్ర గా వెలిగాలి ...
జీవితం అనే ప్రయాణం "నీలి"నింగి దాకా ఎదగాలి ...
చిగురాకు పై చిలకమెచ్చిన  రవి"చంద్రిక" లా చిద్విల్లాలి...
బ్రతికినంత కాలం "పచ్చ" గా నవ్వుతూ ఉండాలి...

సంబరాల సప్త వర్ణాల ఈ "హొలి"...
నింపాలి  మీ ఆశలపొదరిల్లును పై  "రంగేళి".. 

అని మనస్ఫూర్తి గా 
ఆశిస్తూ,
  ఆకంక్షిస్తూ 
        అభిలాషిస్తూ 

-- మీ సీత...
Monday, 5 March 2012

గురువారం మార్చ్ 1 సాయంత్రం 5:40.... వెళ్ళా నే సాయి బాబా గుడికి ... చూస్తూనే నడిచి వచ్చి...(ఇంకా పాడింది చాలు గాని ఆపి చదవండి..)


గురువారం మార్చ్ 1 సాయంత్రం 5:40....
వెళ్ళా నే సాయి బాబా గుడికి ...
చూస్తూనే నడిచి వచ్చి...(ఇంకా పాడింది చాలు గాని ఆపి చదవండి..)అమాయకం  గా కుర్చుంది ఆ చిన్నారి..
అన్నీ వింత గా చూస్తొంది ఆ పొన్నారి..

రమ్మంటే రానంది ముద్దు గా...
ఎమంటే ఊ.హూ అంది గమ్ముగా...
ఎట్టకేలకు దగ్గరికు తీస్తే   ప్రేమగా..
కబుర్లు కురిపించింది నాపై  నిండుగా...

చిట్టి చిలకమ్మ చెప్తావా అంటే చిన్న గా..
నాకొచ్చు లే,నీకొస్తె చెప్పమంది చురుగ్గా..
సరే అని నే చిట్టి చిలకమ్మ చెప్పగా..
భలే భలే అని చప్పట్లు కొట్టె అల్లరి గా..

ఆటలు ఆడుకున్నాం..
పాటలు పాడుకున్నాం...
కబుర్లు చెప్పుకున్నాం....
ఆనందం పంచుకున్నం.....!!!

ఎంతయినా..

భలే భలే పాపయి...
బంగారు బుజ్జాయి..
అల్లరి చేసే అమ్మాయి... 
పాటలు పాడే పువ్వాయి...
అన్నీ ఉన్న గడుగ్గాయి...!!!

అందుకే, 
   నే అక్కడున్న సాయి బాబా ను   కొరాను చెరి
   ఆటాల పాటల ఈ చిన్నారి...
   ప్రేమపు మాటల ఈ పొన్నరి...
   పొయాలి తన అమ్మ-నాన్న ల ఆశలకు ఊపిరి..!!! అని.

-- మీ సీత  .....

Saturday, 3 March 2012

అందమయిన ప్రపంచం .....

అందమయిన ప్రపంచం ......

తెలియలేరు ఈ అందం ఇన్నిరోజులు....
రుచిచూడలేరు తెలిస్తే ఇక "పై" రోజులు....

మనుష్యులు రకరకాలు ...
అందరికి ఉన్నాయి మేకప్పులు..
మేకప్పుకు వేయబడిన సామాగ్రీలు 
ఈర్ష్య ,ద్వేష ,అసూయ స్వార్ధాలు..
కుళ్ళు,కుతంత్రాలు వీటికి సహకారులు..
అన్ని ఒకటేలా ఉండే రకరకాలు..

స్నేహానికి వీళ్ళు వేస్తారు మంటలు..
అనురగాలకీ అందిస్తారు అపనిందలు..
ప్రెమకీ ద్వేషాన్ని నేర్పించగల సమర్ధులు..

నీవే నా ప్రాణం అంటారు మెల్లిగా..
నీతోనే ఉంటామంటారు హాయిగా..

హాయిగా ఆనందన్నిస్తామంటారు 
ఇంకోళ్ళ  సంతోషం తుంచుతూ...
జీవితాన్ని వెలిగిస్తామంటారు 
ఇంకోళ్ళ ని చీకటికి దరికి చేస్తూ..

వదలలేము వాటిని..
బ్రతకలేము వాటితో..

కాలేము వాటికి అన్యం..
పోయలేము వాటికి అర్ఘ్యం..
వాటితో అయిపోయే మన జీవితాలు సూన్యం...!!

ఏమంటారు  .?
4m సీత ...
 

Thursday, 1 March 2012

ఒక మిత్రుడు......

చీకటి లో వెలుగు లా ...
వర్షం లో గొడుగులా..
మౌనం లో భాష లా...
చలిలో వెచ్చదనం లా ..
బాధ లో ఓదార్పు లా...
కష్ట్తం లో చేయూత లా ..
సుఖం లో సంతోషం  లా..
నీ వెంట ఒక మిత్రుడు ఉంటే...
జయాలే తప్ప అపజయాలుండవు....!!!
                                                                                                                                           .
 
                                                                                    .

--మీ సీత...