Thursday 31 May 2012

సాయి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు......


హాయ్ ఫ్రెండ్,
సాయి గారు  పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీకొక చిన్న సర్ప్రైస్ ...

మీ టెక్నాలజీ తో అందరినీ అలరిస్తూ
మీ స్నేహపు మాటలతో అందరినీ  ఆకర్షిస్తూ
మీ కవితలతో కొత్తగా అందరినీ  కట్టడి చేస్తూ
మీ మనోభావాలతో  అందరినీ ఆలోచింపచేస్తూ 
మీ ఆదరింపుతో అందరినీ  ఆకట్టుకుంటూ 
మీ మంచితనం తో మంచి మాటలని అందరితో   పంచుకుంటూ 
మీరు  జీవితం లో ఉన్నతం గా  ఎదగాలని మేమిలా  కోరుకుంటూ........!!!

"నా మనసు" చెప్పిందంటూ అందరి మనసులని కట్టిపడేసే మీకు ఇటువంటి 
ఆనందకరమయిన  పుట్టిన రోజులెన్నో ఇంకెన్నో రావాలాని మనస్పూర్తి గా కోరుకుంటూ...
"మీ మనసు"కు ఎటువంటి బాధ లూ  కలుగకుండా ఉండాలని కోరుకుంటూ ....

మీకిష్టమైన వన్నీ మీ వద్దకు చేరి మీరు సంతోషం గా ఉండాలని కోరుకుంటూ....
దెనికీ భయపడకుండా నమ్మకం తో ముందుకు  సాగమని మనవి చేసుకుంటూ....
ఇక ఈ పుట్టినరోజు నుండి మీకన్నీ శుభాలే జరగాలని అభిలాషిస్తూ...

A VERY VERY HAPPY BIRTHDAY TO YOU FRIEND.....



hi friend 
how are you .?
మీకొక చిన్న సర్ప్రైస్ ...i hope u like it.
-- seetha..

పోస్ట్ చదివిన బ్లాగర్ లూ.......ఎందుకు ఆలస్యం ఇక్కడ మన ఫ్రెండ్ కి విషెస్ చెప్పెయ్యండి...!! 

- సీత.....

Monday 28 May 2012

నీవే నేనవుతా....

నా ఊహల భావాని వి నీవయితే
నీ ఊహలఊయల లో బంధీ ని నేనవుతా

నా అందెల ని సవ్వడి చేసే అల్లరివి నీవయితే
నీ అల్లరి లో అలుపెరగని అలనే నేనవుతా 

నా మదిని మురిపించే వేణు గానమే నీవయితే
నీ మది పై చేరి మరిపించే  మల్లే ని నెనవుతా

నా కోపం  లో కసి గా కవ్వించే యుద్దానివి నీవయితే
నీ చే ఓటమి పాలై నీ గెలుపు గర్వాన్నే నేనవుతా

నా బాధలో ఓదార్పు నిచే అమ్మ వు నీవయితే
నీ ఒడి లో ఒదిగే పసిపాప నేనవుతా

నా గుండె గుడికి దీపానివి నీవయితే
నీ గుసగుసల గానం లో గోప్యాన్ని నేనవుతా

నా కన్నీటి ని కట్టడి చేసే  వారధి నీవయితే
నీ కై కదలాడే స్నేహాన్ని నేనవుతా

నా చెక్కిలి లో చేరే చిరునవ్వు నీవయితే
నీ చనువు లో నీ చేలి నే నేనవుతా

నా కనులని కలతపరచే కల వి నీవయితే
నీ కనులలో కదలని కవిత ని నేనవుతా

నా పాదాల పై పండిన పారాణి నీవయితే
నీ పెదవుల పిలుపుల కి పులకరింత నేనవుతా

నా నోసట కుంకుమ ప్రతీకవే నీవయితే
నీ పాదాల పై నా చే చేరే పుష్పాన్నే నేనవుతా...

నా నగుమొము ను వెలిగించే రాముడు వి నీవయితే
నీ నీడ నై నీ వెంటే నడిచే  సీత నే నేనవుతా...

నా ఈ ప్రేమ 'పలుకుల'కి పేరే నీవయితే
నీ ప్రేమ నే కోరే "ప్రశ్న" ని నేనవుతా

నా నుండీ దూరమయ్యే "విరహాని" వి నీవయితే
నీ విరహాన్నే వరించే 'వనిత' నే  నేనవుతా..............!!

నీవే నేనవుతా....

సీత..

Friday 25 May 2012

ఓ మానసనివాస.....


మనసే నీది నా మానసనివాస
నా మనసంత నీవెగా ఓ 'మాధవా..'..!!!

కలనయినా ఎంచను వేరొక ధ్యాస
'కేశవా' నీవేగా నా ప్రతి ఆశ.!!!

రంగురంగుల లొకము రమ్మని పిలిచినా
'రంగ'రంగ నీ నామమే నాకు లొకము..!!!

పరిమళ పుష్పాలెల్ల ఆకర్షించినా 
'పుండరీక' నా నామమే నాకు పరిమళము..!!!

స్వప్నమున పిలిచి కనిపించకున్నా
సీతా స్మరణ లొ సదాఉండిపొయావయ్యా..!! 



-- సీత..

Thursday 24 May 2012

ఆ దారి కి 'గమ్యం' నీవెనా ?????


కలం కదులుతోంది వెగంగా...
కాలం పరిగెడుతోంది త్వరగా..
గాలి వీస్తోంది చల్లగా..
జాబిలి వస్తొంది తెల్లగా..

మెఘం ముసురుతోంది ముద్దుగా..
చినుకు తాకింది మెత్తగా..
స్వరం వొణికింది గమ్మత్తుగా..

చందమామ పొయె చుస్తుండగా 
సుర్యకిరణం తగిలె వెచ్చగా....

మనసు కదిలె వింతగా
చూపె ఒక దిక్కుగా
ఆ దిక్కు నడిపె ఒక దారిగా

ఆ దారి కి 'గమ్యం' నీవెనా  ?????


 'నీవయిన  నా'  గమ్యాన్నిచేరి  చెప్పాలని చిన్నిఅశ  


""రెయి పొయి పగలు వచ్చె ,
 నీ ఆలొచన కదలక పొయే..""

-- సీత 



Friday 18 May 2012

సంగీత రూపిణి సాహిత్య ధారిణి ..! అమ్మ గురించి నా పాట


అందరినీ కరుణ తో కాపాడే మన అమ్మ..!
నీ బొమ్మ వేయలేకపొయినా
నిన్నిలా మెరిపించగలిగాను అమ్మ..!

ఎందెందు  వెతికేది అమ్మా నిన్ను 
సంగీత రూపిణి  సాహిత్య ధారిణి ..!


'శ్రుతు'లే శయనమాయె నీ 'నయనముల'లో
'స్వరము'లే నర్తించే నీ 'తిలకము'లో
'రాగము'లే కదలాడె నీ 'దరహాసము'లో
'కీర్తన'లనే  కొనియాడె నీ 'రూపము'లో....!

'తాళము'లె తాండవమాడె నీ 'కర్ణము'లలో
'సాహిత్య'మె సువర్ణమాయె నీ 'కంఠము'లో 
'వేదము'లె వెలసె నీ 'వాక్కు'లలో
'కళ'లే కీర్తింపబడె నీ 'హృదయము'లో ..!

సప్తవర్ణాలు కలిసి వెసె నీకు 'పద్మాసనము' 
సప్తవర్ణాలు విరిగి ఎగసే నీ 'కురుల'లై
'సప్తస్వరాలే 'మ్రోగె నీ  వీణ లో అమ్మ,
'సప్తసముద్రాలె' పొంగే  'సీతాహ్రుద్యానందం'  లో...!

అమ్మ,
నీ నిలయమయిన ఇన్ని కంటిని
నీ రూపమును కనలేకపోతిని ...!

 మా అమ్మ కోసం నా ఈ చిన్ని పాట/కవిత.
అమ్మ కే అంకితం ...!

--సీత


Tuesday 15 May 2012

"సీతారాధ"న......





 చిన్నప్పటి నుండి నన్ను వదలని నా కృష్ణుడు...
భలే ఉన్నాడు కదూ...!!
కృష్ణ... 
నా ద లయలో చప్పుడు వయ్యావు  ...
నా  దమాటు అల్లరి వయ్యావు ..

 నా నిదురలో కల వయ్యావు ...
 నా మెలకువ  ఊహ వయ్యావు ...

 నా కనులలో వెలుగు వయ్యావు  ...
 నా పెదవుల పై చిరునవ్వు వయ్యావు ...

 నా మౌనానికి మాట వయ్యావు ...
 నా మనసుకి ఆనందం వయ్యావు ...

 నా అడుగుల గమ్యం వయ్యావు...
 నా ఉనికి శబ్దాని వయ్యావు...

నా పాట కి శ్రుతి వయ్యావు...
 నా రాగానికి లయ వయ్యావు...

ఓ కృష్ణ... 
మరి,
 ఈ "సీతారాధ"నకి రూపానివెప్పుడవుతావు...???
నీ కంటి పాపలో నన్నెప్పుడు నాకు చూపుతావు???

--సీత 

Friday 11 May 2012

ప్రేమ కై ఆశ తో....


ప్రేమ కై ఆశ తో....
"ఒక్కటి" గా విహరిస్తూ ఆలయానికోచ్చిందో  చిలుక... 
"రెండై "జతగా ప్రపంచాన్ని చూడాలని ఆశ తో.....

"మూడు" పూల తో ముచ్చట గా మహేశ్వరుణ్ణి   పూజించింది
'నాలుగు" కాలాలు నవ్వుతూ జతగా ఎగరాలనే   ఆశ తో....

"పంచ"మి నాట పార్వతి  ని  ప్రేమ గా అడిగింది 
"షడ్జ"మ కోకిల లా  తన జీవితానల్లె  రాగాలనాలపించాలనే ఆశ తో....

"సప్త"వర్ణాల హరివిల్లు ఆకాశం లో విస్తరించిన వేళ
"అష్ట"మి నాడు ఆశ గా ఆరభి రాగం తననల్లుతోన్న వేళ
తన "తొమ్మిది" రోజుల ఎదురు చూపుకు తెరపడి తన " ప్రేమ " తనని చేరిన  వేళ....

"పది"కాలాల ప్రేమానందమయిన  జీవితాన్ని ప్రేరేపిస్తూ....
"పదకొండు" మార్లు ఉమా-మహేశ్వరులకి ధన్యవాదాలు చెప్పి
"పన్నెండు"చెట్లు దాటి "పదమూడో " చెట్టు చేరి ఊసులాడుకుంటున్నాయి..........!!!!

చూడండి మరి...
--మీ  సీత 


Tuesday 8 May 2012

అమ్మ ........


ముత్యంమంత   స్వచ్చమయిన మనసు ....
మల్లెపువ్వంత మధురమయిన నవ్వు....

నీటి చుక్కంత నిర్మలమయిన రూపం...
సముద్రమంత కడలిని దాచే చిన్న గుండె..

అలలై ఎగసే మన బాధలని ఆపాలనే ఆరాటం...
అనంతమయిన విశ్వాన్ని అరచేతిలో చూపే ఆనందం..

కనుపాప తో ధైర్యం చెప్పే కావ్యత్వం...
కనుచూపు తో శాసించే కోమలత్వం.....!!!

సరి రాలేరు ఎవరూ ఈ రూపానికి ..
సరి తూగాలేరు ఎవరూ ఈ మనసుకి....

అదే అమ్మ మనసు...
 
చల్లని సముద్రం ..
వెచ్చగా తగిలే గాలి ...
మెల్ల గా వచ్చి పలకరించి వెళ్ళే అలల సవ్వడి ...
మనసుకి ఎంత హాయి గా ఉంటాయో...

నేను ఎక్కడున్నా ,నీవు ఎక్కడున్నా                                                                                                               
అమ్మ !!నిన్ను తలచుకున్న క్షణం లో ,                             
 నీ వడిలో ఉన్నంత హాయిగా ఉంటుందమ్మా ...!!     

అమ్మ మనసు,అమ్మ వడి ఈ రెండిటికి ఎవీ సాటి రావు....!!

కోరుకోదు ఏమీ ప్రేమ తప్ప...
అడగదు మీ ఆప్యాయత తప్ప...

కష్ట పెట్టద్దు,బాధ పెట్టద్దు ఆ మనసుని...
నిస్వార్ధమయిన ప్రేమ ఒక్కటే అమ్మ ప్రేమ...!!!

--మీ సీత