Friday, 29 June 2012

ఎందుకంటే ఇది ....


చిగురిస్తున్న చెట్టు కి ఆకులు  
మూగబోయిన గొంతు కి మాట 
ఎదురుచూసిన కలకు నిజం 


అల్లాడిన భూమి కి చందమామ 
మారుతున్న ఆకాశానికి హరివిల్లు   
అలసిన దేహానికి చల్లని గాలి
ఉద్వేగమయిన మనసుకు సంగీతం 
అందమయిన చోటుకి పూలరెపరెపలు
అడవికి గలగలమనే జలపాతం 
ఒంటరి మనిషి కి కోరుకున్న తోడు
భావుకత ఉండే కవికి కళావస్తువు
తపించే  హృదయానికి ప్రేమానురాగాలు 
ఎంత అందాన్ని ,ఆనందాన్ని తెస్తాయో  ,
ఎంత  సాంత్వననీ  ,స్వచ్చతనీ ఇస్తాయో 


ఓ నేస్తం, 
నాకు నీ సంతోషం,చిరునవ్వు కూడా అంతే !!

ఎందుకంటే ,
స్నేహమంట ....!


ప్రపంచం లో అతి విలువయినదీ ,నిస్వార్ధమయినదీ స్నేహమే
ఒక అవసరం కోసం చేయని పని ఒకటి ఉందీ అంటే అది స్నేహమే 
ఎంత దూరాన్నయినా దగ్గర చేసి సేద తేర్చెదీ ఒక్క స్నేహమే 
ఎంత దూరం అయినా ప్రయాణం చేయించగలిగెదీ ఒక్క స్నేహమే 
ప్రతి బంధానికీ ముఖ్యమయిన బీజమై ఆనందాన్నిచ్చేదీ స్నేహమే 
ప్రతి బంధం లో ఒదిగిపోయి  పూచే పుష్పమూ  ఒక్క  స్నేహమే 

ఎందుకంటే ఇది స్నేహమంట ....!--సీత 

Tuesday, 26 June 2012

ఈ పువ్వు....


Inline image 1
పువ్వు మధ్యలో గమనించండి ..


ఈ పువ్వు నా తీగలో నుండి ఎంత అందం గా ఉందో...
                                                          -- అని ఓ తల్లితీగ

ఈ పువ్వు ని  శ్రీమతి కిచ్చి సంతోషపరుద్దాం.. 
                                                          --అని ఓ భర్త

ఈ పువ్వు  రంగు లో ని చీర ఈ సారి  కొనాలి...
                                                             --అని ఓ స్త్రీ 

ఈ పువ్వు  ను లాగి బుట్టలో వేసి అమ్మేద్దాం..
                                                            --అని ఓ బేసారి

ఈ పువ్వు  లో ఏముందో కోసి పరీక్షించాలి...
                                                              --అని ఓ శాస్త్రవేత్త

ఈ పువ్వు ని స్పృసించిన  మృదుమధురము ..
                                                                 --అని ఓ కవి

ఈ పువ్వు తో ప్రేయసిని పడేద్దాం.....
                                                                --అని ఓ ప్రేమికిడు


ఈ పువ్వు లో నా  నవ్వెందుకు చూసుకోరో ..?
                                                                  --అని భగవంతుడు    

my small painting 
  

 సీత ...

Saturday, 23 June 2012

నేనిలా సాగిపోనా......


...కోయిలమ్మ పాటలోని స్వరాన్ని  నేనందుకోనా......
...కూనలమ్మ పదాలలోని కూర్పుని   నేనల్లనా....

...గలగలా మంటూ సాగే నీటిలో తిరిగి  తేలిపోనా...
...గవ్వలల్లె  గుసగుసలకి  గమ్ముగా మురిసిపోనా...

...నెమలి  నాట్యం లో  నవరసాలని నేనోలకపోయనా....
 ...నిశీధిని చీల్చే  నవ యువమల్లికనై నడకలద్దనా....

...చెట్లు చేసే చిరుగాలి సవ్వడులతో చల్లగా సాగిపోనా...
...చిట్టిచిట్టి మాటలు చెప్పే రామచిలక పలుకునయిపోనా...

...ఊయలూగి  కవ్వించే పత్రంలో పచ్చదనమై పరవశించనా...
...ఉదయించే సూర్యుడి కిరణం లో వెచ్చగా ఒదిగిపోనా..

...సప్తవర్ణాల హరివిల్లు లో ఏదోక వర్ణం లో వెలగనా...
...సప్తసముద్రాల అలలో ఆనందం గా అలసిపోనా....

...ప్రేమని రాయబారమంపే పువ్వులోనవ్వునై పుష్పించనా...
...ప్రశాంతత పూయించే ఆలయగంట లో గడచిపోనా...

...అవనికి చల్లదనాన్నిచ్చే మేఘంలో చినుకునై జారనా...
...అల్లరి చేసి నిశ్శబ్దాన్ని చీల్చే మెరుపునై ఆకాశాన్నల్లనా..

...భూమాత బిడ్డనై తల్లి భారాన్ని నే కొంచం మోయనా...
...బంధినయి  నేనిలా ప్రకృతి తో పులకరిస్తూ పోనా....

..సీత..


Thursday, 21 June 2012

అది పగలయినా.......

కనులు మూసి అలసిన వేళ
మనసు రెక్కలు ఆగిన వేళ
మాటలలో మౌనం దూరిన వేళ
చెవులు నీ పిలుపుకు చేరువ్వలేని వేళ
ఏకాంతంలో ఏకాకినై ఎదురుచుసిన వేళ నీ కోసం నా కనులు వెతికిన వేళ..
నా కనులకు నీవు అందని వేళ ...
అది పగలయినా , 
                    నాకు చీకటే ఓ ప్రియ....!!

మీ సీత .....

Tuesday, 19 June 2012

నీ మురళీ రవళి....


నాకిష్టమయిన కృష్ణుడు..
తెల్లని మల్లెలు అల్లిన గానం 
మెల్లగా పలికెను మోహన  రాగం
చల్లని చూపుల ఓ నల్లని స్వామీ 
జల్లించా నిన్ను  విరజాజులతో.....!!

నీ గాన సుధలకు వేణువుల పొదలు
 చైతన్యమై మా చే  పలికించే నీ కృతులు...
నీ  ముద్దుమాటలకు మురిసిన మా మోములు
మహదానందమై మరిపించే ఈ లోకములను....!! 


జలకాలాడే గోపికలు , 
నీకై వేచే నీ స్నేహితులు,
నిన్నే స్మరించే హృదయాలు..
విన్నవిన్చుచున్నారు ఓ మానసచోరా

 "మురళీ రవళి ని ఆపకు.....
      నీ  రాగాసరోవరము లో 
      మమ్ము ఇలాగే నిలిచిపోనివ్వవా ......"

కృష్ణా.......

       నీ మురళీ గానము చే మాయ  చేసి 
        మమ్ము మహిమ లతో  కాపాడెదవు....
.


మీ   సీత.....