అమ్మ ప్రేమలో ని ఆప్యాయతని పంచిస్తుంది
నాన్న స్ఫూర్తి లో ని నమ్మకాన్ని నిలబెడుతుంది
నిజమయిన ఆస్తి ని సంపాదించి పెడుతుంది
అర్భుతమయిన ఆనందాలతో అల్లుకుపోతుంది
మరచిపోలేని మనసులనేన్నో దగ్గర చేస్తుంది
మరపుకేరాని మమతలనేన్నో అందిస్తుంది
కలతలనన్నీ కమ్మని కబుర్లతో మరిపిస్తుంది
కష్టాలన్నీ పంచుకొని ప్రేమ గా మురిపిస్తుంది
బాధల్లో ఓదార్పై బంధాన్నింకా బంధిస్తుంది
నవ్వులో నేస్తమై నడచి నిత్యం ఉంటుంది
ఆనందాలన్నీటినీ ఆరోగ్యం గా ఆస్వాదింపచేస్తుంది
అనవసరబాధలన్నిటి పై ఆనందాని చల్లేస్తుంది
గెలుపు బాట లో నడిచే ఆనందం అవుతుంది
ఓటమి పాలయినపుడు నిట్టూర్పు నిచ్చి గెలిపిస్తుంది
మంచి తో మనలోని మమతా జ్యోతి ని వెలిగిస్తుంది
చెడుని నాశనం చేసి చీడపురుగుని దూరం చేస్తుంది
ప్రశాంతం గా దగ్గరయ్యి ప్రేమదీపాన్ని వెలిగిస్తుంది
పవిత్రబంధం లా జీవితాంతం ప్రయాణం చేయిస్తుంది
జీవితం అనే వనం లో ఉదయించే ఒక పుష్పం
జన్మ జన్మలయినా దీనికోసం జన్మించాలని ఆశ రేపే ఒక అనుభవం ...........!!
అదే స్నేహం
కష్టమయినా సుఖమయినా నీ తోనే నేననే ఒక భావం
నీ కన్నీరు నాది --నా చిరునవ్వు నీదని చెప్పే ఒక బంధం
-- మీ సీత.....