ముందు గా ఈ పోస్ట్ చదవడానికి వచ్చిన వారందరికీ ఒక చిన్న మనవి ..
నేను నా ఊహలని ఇలా కృష్ణుడి పలికినట్టుగా ,నా అనుభవాలు,నా ఊహలు, నా కవితలతో పాటు చెబ్దాం అని ప్రయత్నం. ఇలా రాయచ్చో లేదో నాకు తెలీదు ...కాని రాసేసా...!!
| ఆ'రాధ'నై కృష్ణుణ్ణి అడుగుతున్నా....!! |
సీత :: కృష్ణ , నాదొక పెద్ద సందేహం తీర్చవూ??
ఎచట లేనంటావ్???
కృష్ణ :: తప్పకుండా అడుగు మరి ...!!
సీత:: నీ స్థానం ఎచట కృష్ణ...??
కృష్ణ ::
అంటే ..??
సీత ::
"గోపాలుడి గా గోవుల వద్దనా?
బాలుడి వై యశోద ఒడి లోనా?
ప్రేమించే రాధ హృదయం లోనా?
పరిపాలించే అష్ట భార్యల ఆనందం లోనా?
గోపికలతో బృందావనం లో నా?
స్నేహాన్ని కోరే మిత్రుల సన్నిహిత్యం లోనా?
నెమలి నాట్యాన్నానందించడం లో నా?
వేణువు వదిలే మధురమయిన శ్వాస లోనా?
ప్రేమగా నిన్నల్లె మల్లెల మాలల లోనా?
కాళింది తలపై నటియించిన బాలతెజస్సులోనా?
భక్తి గా భజించే హృదయాల లో నా?
నిన్ను కీర్తనలతో కట్టేసే మనసులలోనా?
ఇన్ని స్థలాలా నీకు కృష్ణా......
ఎచట ఉంటానంటావ్ శాశ్వతం గా.....??..."
కృష్ణ :: అయ్యో ...
...మరలా నన్నే అడుగుతున్నావా?
సీత :: అదేమిటి కృష్ణా?
కృష్ణ:: సరే
నువ్వే అడిగావు కదా అన్ని చోట్ల అని...మరి నీకు నేను ప్రశ్న గానే సమాధానం ఇస్తాను ..!!
సీత :: కృష్ణ...అర్ధమయింది నీ తత్త్వం
"నిన్ను తలచే ప్రతి చోటా నువ్వుంటావ్ శాశ్వతంగా ......!!"
కృష్ణ:: అంతే గా మరి...!!

కృష్ణా అని ఆర్తి గా పిలిస్తే పలికే నా దైవం.కృష్ణా అని మనసారా తలిస్తే చాలు అన్నీ సమస్యలూ టక్కున మాయమయిపోతాయి...
తనని స్మరించే అన్నింటిలో తానుంటాడు.......!!
ఇంకా ప్రేమ,సమస్యలు, జీవితం ఇంకా వీటి గురించి కృష్ణుడు ఏం చెప్తారో తరువాత వాటిల్లో ....!!
కృష్ణాష్టమి కోసం అని ఇవి ఎప్పటినుండో తాయారు చేసిఉంచుకున్నాను.
ఇప్పుడు ఇలా మీతో ఒక్కోటి పంచుకుంటున్నాను :)

.jpg)

.jpg)