కనురెప్పల మాటున వేచిన కన్నులు నన్నడిగే
పెదవుల పలుకుల వెనుక ఆగిన పదములు నన్నడిగే
చెక్కిలి సొట్టల చాటున కదిలిన చిరునవ్వు నన్నడిగే
నిదురకన్నుల నాపిన వెకువ వెలుగు నన్నడిగే
ఎదురుచూపుల అలసిన కొమల కన్నులు నన్నడిగే
అల్లరి ఆశలు రెపిన అలౌకిక ఆరాటం నన్నడిగే
యదలయ లొతులొ రేగిన మనసులొ మాట నన్నడిగే
"నా కన్నుల చాటు దాగాల్సిన
నా యద లొతు లో చేరాల్సిన
నా గుండెలయ వై దూరాల్సిన
నా ఆశల ఊపిరి వై సాగాల్సిన .....
నా ఆశల రూపామా ,
"ఎప్పుడు కనిపిస్తావు?
నా స్వప్నాలకి నిజానివి ఎప్పుడు అవుతావు?"
--
సీత