కలవరిస్తుంటే కలలోనేనా కలిసేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ ఇలలో నిజమయి నవ్వించచ్చుగా...!
ప్రేరేపించే రాగాల లో నేనా దాగేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ అనురాగమై అల్లుకోవచ్చుగా...!
చుట్టుముట్టే ఆలోచనల లో నేనా అల్లేది ఎప్పుడూ ?
అప్పుడప్పుడూ చెంత చేరి చేయూతనివ్వచ్చుగా...!
పిలవాలనిపించే పేరులో నేనా పలికేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ 'ప్రియా' అంటూ పలకరింపువవ్వచ్చుగా ...!
భారమయిన బంధీవై గుండె లోనేనా కొలువయ్యేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ సంకెళ్ళు తెంచుకొని బంధాన్నల్లచ్చుగా ...!
తపనపడే ఆరాటం లో నేనా తొంగిచూసేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ నిను చూసుకునే భాగ్యం ప్రసాదించవచ్చుగా...!
కనులుమూస్తే రెప్పలుతాకే తడిలోనేనా ఆగేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ కన్నీళ్లు తుడిచి కంటిపాప లో కదిలిపోవచ్చుగా...!
ఎల్లప్పుడూ..... మనసుకోరే రూపం లా రావచ్చుగా ...!
--
సీత
Out of syllabus Seetammaa!!
ReplyDeleteNo comment :))
haha...
Deletemarks granted for u.
thanks for the (no)comment;)
:))
antha aarthiga adigaka , raakem chesthaadandi,ee paatiki vachi undaale, thalupulu these unchaara,
ReplyDeletechakkani kavitha, keep writing.
భాస్కర్ గారు,
Deleteఇంకా రాలేదండీ...చూస్తున్నాను మరి ;)
ధన్యవాదాలు అండీ :)
అర్ధం కాలా :)
ReplyDeleteశర్మ గారు,
Deleteశ్రీ గారి కామెంట్ చూడండి.అర్ధమవుతుందేమో!
మీరు రావడం ఆనందం అండి..ధన్యవాదాలు ..!
బాగుందండీ
ReplyDeleteచిన్ని గారు
Deleteధన్యవాదాలండీ.:)
ఎప్పుడూ అలా ప్రేమగా కలిసే వుండాలని....హృద్యంగా వుంది సీత గారూ..
ReplyDeleteవర్మ గారు,
Deleteచాలా రోజులకి వచ్చారు..!
ధన్యవాదాలండీ..:)
nice seeta......
ReplyDeletethank you sruti..:)
Deleteకలలో నిజరూపం....
ReplyDeleteఇలలో ఊహారూపం...
ఇదే కదా సమస్యంతా??:-))
ఏమంటారు సీత గారూ!
చక్కని భావ సుమాల కలబోత...
@శ్రీ
శ్రీ గారు ,
Deleteఇంకేమంటాను ?మీరు చెప్పాక....
అవునంటాను. ;)
ధన్యవాదాలండీ :)
సీత గారూ, ఎదురు పడితే , కలలు ఇక ఉండవు. అంటే కలలు కనాల్సిన అవసరం ఉండదూ అని అర్ధం. బాగుంది చక్కటి భావన.
ReplyDeleteఫాతిమా గారూ,
Deleteబాగా చెప్పారు.వచ్చి ఆ కలలు కనే పనేదొ తగ్గించచ్చు గా
....!!
బోలెడు ధన్యవదాలండీ:)
చాలా బాగుంది సీత గారు.....
ReplyDeleteదూరంగా ఉంటే ప్రేమ ఇంకాస్త ఎక్కువవుతుంది అని ఇన్నాళ్లూ వేచున్నారేమోనండీ....
ఇంత ఆర్తిగా పిలిచాక ఇక రాకుండా ఉండరు.. భాస్కర్ గారు చెప్పినట్టు వచ్చే ఉండచ్చు... తలుపు చూసి చూడండి ఒకసారి...
pic కూడా భలే ఉంది అండీ. సూపర్...
చెప్పడం మరిచాను అండీ... అప్పుడప్పుడూ కాదు ఎప్పుడూనే....
Deleteసాయి గారు,
Deleteఅంతేనంటారా అయితే??
సరే అయితే...
ధన్యవాదాలండీ:)
చాలా చాలా బాగుంది సీత గారూ!
ReplyDeleteమదికి చక్కగా భాష్యం ఇస్తున్నారు కవితల్లో...
ప్రతి లైనూ ఎంతో బాగా రాశారు మనసుకి హత్తుకునేలా.
అభినందనలు!
పండు గారు,
Deleteచాలా ధన్యవాదాలండీ..:)
సీతగారు, మీ కవిత చాలా బాగుందండి.
ReplyDeleteనిత్య గారు
Deleteమీకు ధన్యవాదాలండీ
సీత గారు..
ReplyDeleteఅదిరిందండోయ్ :) :)
మీ ప్రేమ అంతా కలిపి పిలిస్తే ఎందుకు రారు?
వస్తాడు లెండి మీ మనసుకోరే రూపం లోనే ఆ రాముడు...
(ఆయన కుడా తపిస్తూ ఉండిఉంటాడు పాపం ;))
just expecting smile:)
123 గారు ,
Deleteఒహో..! అలా అంటారా సరే..!!
ధన్యవాదాలండీ......:))
అప్పుడప్పుడూ........ అప్పుడప్పుడూ......
ReplyDeleteఇలాగ......... ఇలాగ........పాట గుర్తొచ్చింది.
చాలా బాగుంది సీత గారు.:)
త్వరలోనే వస్తారని ఆసిస్తున్నా,;)
అజ్ఞాత 1 గారు,
Deleteహాయి గా పాట పాడేసుకోండీ అయితే
ధన్యవాదాలండీ:)
what a feeling sita...very nice :)
ReplyDeleteఅజ్ఞాత 2 గారు,
Deleteధన్యవాదాలండీ:)
chaala chaala baagundi seeta gaaru.
ReplyDeletealage prema ga dooram lonu kaliseundipovadam ..
chaala bagundi music + pic kudaa..
loved dis <3 <3 appudappudu...
thanks mahesh garu
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteతొలి వలపు కలువ - హృదయపు
ReplyDeleteకొలనున కవితలను పూచి - కోరిక లలలై
పిలువగ - ప్రియ గానము విని
వలపుల నెలరేడు వచ్చి వ్రాలడ యెదుటన్ .
----- సుజన-సృజన
వెంకట రాజ రావు గారు,
Deleteమీకు చాలా ధన్యవాదాలండీ మరోసారి మీ పద్యకుసుమాల తో కోరినందుకు:)
మీ ఉహా లోకాన్ని కవితలో బాగా వర్ణించారు.మంచి కవిత్వం.
ReplyDeleteధన్యవాదాలండీ రవిశేఖర్ గారూ...!!
Delete