'పవన'మై చల్లగా నీవు నలుగురికి సేద తీరుస్తానంటే
నీ కోసం,పుష్పం గా మారి పరిమళాన్నందిస్తూపోతా...!!
'ఆకాశ'మై సూర్యచంద్రతారలని మోస్తూ నీవలసిపోతుంటే
నీ కోసం,సేద తీర్చడానికి నిన్నుకప్పే మేఘాన్నయిపోతా..!!
'నేల'ని కాపాడుతూ చెట్టు గా నీడనిస్తూ నేనుండిపోతానంటే
నీకోసం , నిను వీడక ఆ చెట్టు కి ఆకునై కదిలిపోతా..!!
సముద్రమై 'నీటి'నందిస్తూ అందరికీ ఆధారంగా వ్యాపిస్తానంటే
నీ కోసం, నిన్నలరిస్తూ ఆనందం తో అలనై ఎగసిపోతా ...!!
'నిప్పు'నై దహించుకుపోతూ నలుగురికి వెచ్చదనమిస్తానంటే
నీ కోసం,ననుకాల్చే వెచ్చదనమివ్వమని కట్టెలుగా మారిపోతా..!!
'పంచభూతాల'లో ఏకమై నేను పరులకుపయోగపడతానంటే
నీకోసం,నీ 'ఆరోప్రాణ'మై నీతోనే నీలో ఇలాగే ఏకమయిపోతా..!!
--
సీత
సీతగారు.. మీ ఫీలింగ్ చాలా చాలా బాగుంది అండీ..
ReplyDeleteనాకు చాలా బాగా నచ్చింది ఈ కవిత... keep writing...
Super..
ఇంకా ఆ pic కూడా మీ కవితకు తగ్గట్టుగా వెదికి పెట్టారు. చాలా బాగుంది..
Deleteసాయి గారు,
Deleteమీకంతలా నచ్చింది అంటే భలే ఆనందం గా ఉందండీ.....
thanks a lot
"ఇంత మంచి కవిత వ్రాసి సీత అలిసిపోతే...
ReplyDeleteమేమంతా మంచి వ్యాఖ్యనిచ్చి సంతోషింపజేసేస్తాం...:-)"
చాలా చక్కని భావాల సమాగమం...
ఎంచుకున్న చిత్రం కూడా బాగుంది...
@శ్రీ
మీరంతా ఇలా సంతోషపరిస్తే
Deleteమరిన్ని కవితలు పొంగుకొస్తాయ్...శ్రీ గారు....:))
ధన్యవాదాలండీ :)
wonderful poetry of love
ReplyDeletesuper <3 <3.keep it up.
thank you.:)
Deletesimply superb sitha garu, ilanti manchi kavithalu mee nunchi maranni raavalani, waiting to read,
ReplyDeletethank you, keep writing.
భాస్కర్ గారు,
Deleteప్రయత్నిస్తానండీ...:)
ధన్యవాదాలు :)
చాలా చాలా బాగుంది సీతమ్మా..!!
ReplyDelete--
Photon
పిచ్చ పిచ్చగా నచ్చేసింది :)
Deleteచాలా బాగా రాసారు.!!
ఫోటాన్
Deleteచాలా చాలా ధన్యవాదాలు మీకు...
Anonymous
ధన్యవాదాలు:)
nice. chaala bagundi.....
ReplyDeletesruti garu.......
Deletethank you :)
పంచభూతాలతో కలిసి పరులకోసం 'సీత పలికిన' ప్రేమకావ్యం
ReplyDeleteమధురం,హృద్యంతం,అమోఘం..!!
బోమ్మ కుడా చాలా బాగుందండోయ్ :))
అజ్ఞాత గారన్నట్టు
పిచ్చ పిచ్చ గా నచ్చేసింది :)
123 గారు,
Deleteధన్యవాదాలండీ....:)
మీ పేరు మాత్రం చెప్పలేదు ఈ సారి కూడా...??
చాలా బాగా రాసారండి.
ReplyDeleteఆనందం గారు
Deleteభలే ఆనందం అండీ...
ధన్యవాదాలు :)
సీతగారు, మీ కవిత ఎప్పాటి లాగే చాలా బాగుంది
ReplyDeleteనిత్య గారు..
Deleteధన్యవాదాలండీ :)
సీత గారు చాల అద్భుతంగా ఉండండి మీ కవిత ఇంకా మీ picture కూడా .
ReplyDeleteరమేష్ గారు...
Deleteచాలా సంతోషం అండీ..ధన్యవాదాలు :)
Wonderful సీత గారూ!
ReplyDeleteచాలా బాగా పలికించారు ప్రేమ భావాలని...అతి సున్నితంగా...
Congratulations!
పండు గారు...
Deleteమరి ప్రేమ సున్నితమయినదే కదండీ...;)
thanks a lot :)
సీత గారూ, మీ కవిత మంచి భావంతో బాగుంది. నాది ఓ చిన్న రిక్వెస్ట్ అన్యదా బావించ వద్దు, కేవలం ప్రేమ కవితలే కాక సామాజికమైన విషయాల మీద రాయండి. మీరు బాగా రాయగలరు. ఎందుకంటే భావుకత ఉంది.
ReplyDeleteప్రేమ మీదే రాయాలని కాదు ఫాతిమా గారు...
Deleteకాకపోతే నిజమయిన బంధాలు,విలువలు తగ్గిపోతున్నాయని అనిపించి ఇలా రాస్తున్నను అంతే...
ఈ సారి తప్పకుండా ప్రయత్నిస్తాను అండి...:)
ధన్యవాదాలు :)
Seetaa dear ,meelo unna bhaava prakatana samaajaaniki panikivaste baaguntundani o aalochana maatrame. thank you
Deleteఅద్భుతంగా రాసారు ! గ్రేట్ లైన్స్
ReplyDeleteపరుచూరి వంశీకృష్ణ గారు
Deleteస్వాగతం అండీ ..!!
చాలా ధన్యవాదాలు మీకు :)
ఎన్ని పద్యాల నిన్ బొగిడేను సీత !
ReplyDeleteసీత కవితలు ' సుర సరసీరుహాలు '
పంచభూత మమేకతా భావ మనిన
మనిషి పరిపూర్ణతను దెల్పు మదిని దెలుపు .
-----సుజన-సృజన
మీ ప్రశంసకి బోలెడు ఆనందం రాజారావు గారు...
Deleteహృదయపూర్వక ధన్యవాదాలు అండీ.!!
--సీత...
Nice song apt for this post!
ReplyDeletehttp://www.divshare.com/download/12023222-b82
Loved a lot this post, The above song is dedicated to this post, by mistake i have posted on 'నీటి' లా 'మనసు', of course it suits for that post too.
Thanks for the nice post, keep writing.
ohh..
ReplyDeletethanks a lot anonymous..:)
felt very happy...
అదిరింది, చింపేశారు :)
ReplyDeleteఅబ్బో అజ్ఞాత గారూ....
Deleteభలే ఆనందం అండోయ్..!!
ధన్యవాదాలు అండీ...
మీ పేరు తెలుసుకోవచ్చా?
నాపేరు SriRam
ReplyDeleteటపాలు రాయను. పనిలేక బ్లాగులో వ్యాఖ్యలు రాస్తూంటాను :) :)
నా పేరు SriRam.
ReplyDeleteనేను టపాలు రాయను. పని లేక బ్లాగులో వ్యాఖ్యలు మాత్రం రాస్తాను.
SriRam
నా పేరు SriRam.
ReplyDeleteనేను టపాలు రాయను. పని లేక బ్లాగులో వ్యాఖ్యలు మాత్రం రాస్తాను :):) మీరు రాసింది చాలా బాగుంది.
SriRam
నా పేరు SriRam.
ReplyDeleteనేను టపాలు రాయను. పని లేక బ్లాగులో వ్యాఖ్యలు మాత్రం రాస్తాను :) :) మీరు రాసింది చాలా బాగా ఉన్నాది.
SriRam
శ్రీరాం గారూ...
Deleteబ్లాగ్ లు రాయడం కన్నా...కామెంట్లు రాయడమే పెద్దపని.
స్వాగతం అండీ 'సీత పలుకులకీ:)
బోలేడు ధన్యవాదాలు శ్రీరాం గారూ..!!:)