Saturday 16 June 2012

ఒంటరి జీవితం......


the most horrible thing in the world is loneliness
-- seetha

ఆలోచనలు రావా నాకు?
కదలని జీవితమాయే 
తప్పకుండా వస్తాయి వద్దని వాదించినా 

అయితే ఏమిటా ఆలోచనలు ??
ఎంతని ఆలోచించగలను  విడువకుండా ??
రూపమివ్వగలనా   వాటికి ??

శూన్యామావరించదా  నిరాశ తో నన్ను ??
విరక్తి ఎత్తి పోడవదా ఏకాకి అయినందుకు ??
 ప్రశ్నించేదా  ఈ జీవితం ఎందుకని ??

దైవాన్ని నిలదీయగాలనా దిక్కు లేని దాని గా చేసినందుకు??
ఆలోచించడం మానివేయగాలనా  నిష్ప్రయోజనమని??
సుఖాన్ని కనీసం  కోరగలనా  మరో జన్మలో అయినా ??

దగ్గరకు పిలిచే వారున్నారా  కథలు చెప్పమని ??
నవ్వించేవారున్నారా  సంతోషం గా ఉంచాలని ??
స్నేహితులున్నారా  గతాన్ని నెమరు వేసుకోవడానికి ??

అబ్బా..."horrible"  అనిపిస్తుందీ జీవితం 
పోషకాహారం లేక బ్రతకగలమేమో 
ఒంటరి జీవితం దుర్భరం కాదా.........??????

--సీత .....

37 comments:

  1. సీతగారు మీరు చెప్పింది నిజమేనండీ.. ఒంటరి జీవితం దుర్భరమైనదే....
    ఆ ప్రశ్నలకు సమాధానం నాకు తెలీదు.. కానీ మీకు ఓ స్నేహితునిగా ఎల్లప్పుడూ ఉండడానికి నేనున్నానని మాత్రం చెప్పగలను....

    ReplyDelete
    Replies
    1. సాయి గారు,
      మీకు ప్రత్యేకమయిన ధన్యవాదాలండి...!!!
      నేను ఒంటరి నెలా అవుతాను అండీ .....అయినా ఆ ప్రశ్న లకి సమాధానాలు ఉండవ్ .
      ఒంటరి తనమంతా ప్రశ్నలే ....
      చాలా బాగా చెప్పారు...మీ స్నేహ హస్తం ఎప్పటికీ వదలను ....చాలా సంతోషం ..
      ధన్యవాదాలు సాయి గారు :) :) :)

      Delete
  2. chaalaa baagundi
    పోషకాహారం లేక బ్రతకగలమేమో!
    నిజమేనేమో!! ఒంటరి తనం . అంతకన్నా ఎక్కువ లోపమే!!

    ReplyDelete
    Replies
    1. వనజ గారు ,
      అది చాల పెద్ద లోపం.మీకు నచ్చినందుకు సంతోషం అండీ.ధన్యవాదాలు...

      Delete
  3. naakaithe chaalaa saarlu vantarithanam manchi nestham la untundandi.
    chaala points ni thisukunnatlunnaru,
    bhaagha raasaarandi, keep writing.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు,
      ఏకాంతం నేస్తం అలాగే శత్రువు కూడా....!!!థాంక్ యూ...

      Delete
  4. The Most Horrible Thing in The World is Loneliness.

    నిజమే నండి,

    ReplyDelete
    Replies
    1. హర్ష గారు,
      ధన్యవాదాలు...!!

      Delete
  5. ఒంటరి జీవితం ఎంత దుర్లభవమో చక్కగా చెప్పారండి

    ReplyDelete
    Replies
    1. సృజన గారు,
      నా బ్లాగ్ కి స్వాగతం అండీ....!!
      మీకు ధన్యవాదాలు....

      Delete
  6. ఒంటరితనం ఒక శాపం...
    శాపగ్రస్తులకి మాత్రమె తెలుస్తుంది ఆ నిజం...
    ...కవిత, చిత్రం రెండూ బాగున్నాయి సీత గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు,
      ధన్యవాదాలు అండీ.....!!! :)

      Delete
  7. ఒంటరితనమంత దుర్భరం మనిషికి మరోటి ఉండదు.చుట్టూ మనుషులున్నా మనసులు దూరంగా ఒంటరిగా బ్రతుకున్న ఈ కెరీరిజపు రోజులలో ఒంటరితనం పెరిగిపోతున్నది.

    మనిషి మృగం లా మారుతున్నాడు.ఈ జీవితాలలో మార్పు రావాలి.

    అందుకే ఓ సినీకవి అన్నారు.... " మనసున మనసై .......... బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ అదే సౌఖ్యమూ....." అని.

    అలాగే " మళ్లున్నా మాన్యాలునా పంచుకునే మనిషుండాలి " అని కూడా.....

    మంచి పోస్టులు రాస్తున్న సీత గారికి అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. పల్లా కొండలరావు గారు,
      మీరు చెప్పింది నిజమే.
      మనసున మనసై బతుకున బతుకై ఒకరుండాలి తప్పకుండా...
      మీ అభినందన కు ఆనందం తో కూడిన ధన్యవాదాలు మీకు...!!

      Delete
  8. వెంట 'కృష్ణు'డుండ నొంటరి యెట్లయ్యె
    సీత ? తెలుసు మాకు చెప్ప నేల ?
    బ్రతుకు బాట నిండ బంగారుతో పండి
    అలరు గాత! 'సీత' అనుదినమ్ము .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారు,
      ఈ సీత ఎప్పటికి ఒంటరి కాదని బాగా చెప్పారు......
      నాకు చాలా ఆనందం గా ఉండండీ....!!
      ధన్యవాదాలు...

      -- సీత.....

      Delete
  9. అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నవాళ్ళుకూడా ఉన్నారుకదండీ!

    ReplyDelete
    Replies
    1. అనికేత్ గారు....
      స్వాగతం..!!
      అలాంటి వారయినా ,ఎవరూ లేని వారయినా ఒంటరి తనం ఒక శాపం .
      మీ స్పందన కు ధన్యవాదాలండి ......!!

      Delete
  10. vantarithanam entha baadaakarmo chakkaga varninchaaaru baagundi seethagaaru,

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారూ,
      ధన్యవాదాలండి.....!!! :)

      Delete
  11. కవిత దానికి తగ్గ చిత్రం చాలా బాగున్నాయండి.

    అందరి మధ్య ఉన్నా కూడా జీవితంలో ఎన్నోసార్లు ఒంటరితనం అనిపిస్తుంది.
    కొన్నిసార్లు ఏకాంతం కావాలనిపిస్తుంది....కొన్నిసార్లు అదే ఏకాంతం భయపెడుతుంది.

    ReplyDelete
    Replies
    1. ఆనందం గారు,
      మీకు నా ధన్యవాదాలు ఆనందం గారు ...

      బాగా చెప్పారు,ఏకాంతం భయంకరమే కొన్ని సార్లు......!!

      Delete
  12. Replies
    1. sivaprasad garu,
      welcome ....:)
      thank you so much.....

      Delete
  13. సీతగారూ!బాగుంది.

    ఒంటరి తనమే
    మన ఒంటికి అరి (శత్రువు)
    సరి తోడు లేకుంటే
    గోవిందో హరి
    అయినా భయమేల..
    మనసున తలిస్తే వెన్నుని
    వెన్నంటి ఉంటాడుగా
    వెన్నంటి మనసున్న
    అరి హరుడు హరి.

    ReplyDelete
    Replies
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ
      స్వాగతం అండి...!!
      బాగా చెప్పారు......
      ధన్యవాదాలు మీకు .....!!

      -- సీత.....

      Delete
  14. మంచి స్నేహితుడు,మంచి పుస్తకం ,మన మనసు మనకు మంచి నేస్తాలు.ఒంటరితనం లోనుండి ఏకాంతం లోకి రండి.చాలా అద్భుతం గా వుంటుంది.

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారు, నేనెప్పటికీ ఒంటరిని కాను.ఆ బాధననుభవించి దాన్ని చూపాలనుకున్నానంతే..!!ధన్యవాదాలండీ.....!

      Delete
  15. సీత గారు అలవోకగా సాగే మీ భావాలు చాల అందంగా ఉన్నాయి. నా కవితల పై మీ స్పందనకు కృతజ్ఞతలు.

    ReplyDelete
    Replies
    1. రమేష్ గారు,
      స్వాగతం...!!
      మీకు నా ధన్యవాదాలు...!:)

      Delete
  16. సీత గారు,
    ఒంటరి తనం లోని బాధని చక్క గా ఆవిష్కరించారు.....చాలా బాగుంది .
    ఎన్నో ఒంటరి హ్రుదయాల బాధని ప్రశ్న లతో బాగా చెప్పారు...
    నిజంగానే ఒంటరి గా ఉన్నప్పుడు ఇన్ని బాధలు,ప్రశ్నలూ చుట్టుముడతాయి అన్నది నిజం.వాస్తవానికి దగ్గరగా ,హ్రుద్యం గా చక్క గా పలికారు సీత గారు.

    ReplyDelete
    Replies
    1. మహేష్ గారు,
      చాలా రోజులకి ఇటోచ్చినట్టున్నారు.?!
      మీకు నచ్చినందుకు సంతోషం ధన్యవాదాలు మీకు...!:)

      Delete
  17. సీత గారు,
    చాలా బాగా చెప్పారు.ఒంటరి తనం అనుభవించడం కంటే కష్టం లేదేమో .....
    అసలు ఇంత అలవోక గా,అందం గా ఎలా రాయగాలుగుతారండి మీరు ?

    ReplyDelete
    Replies
    1. నిత్య గారూ,
      ధన్యవాదాలు.
      నాదేముంది..అంతా కృష్ణుడి దయ..:)

      Delete
  18. AnonymousJune 18, 2012

    ofcourse loneliness is a pain .sometimes it works as a medicine too.
    u r presentation is very nice seetha .good poetry :). nice one ...

    ReplyDelete
    Replies
    1. thanks anonymous jii..........!!:):)

      Delete