Tuesday 8 May 2012

అమ్మ ........


ముత్యంమంత   స్వచ్చమయిన మనసు ....
మల్లెపువ్వంత మధురమయిన నవ్వు....

నీటి చుక్కంత నిర్మలమయిన రూపం...
సముద్రమంత కడలిని దాచే చిన్న గుండె..

అలలై ఎగసే మన బాధలని ఆపాలనే ఆరాటం...
అనంతమయిన విశ్వాన్ని అరచేతిలో చూపే ఆనందం..

కనుపాప తో ధైర్యం చెప్పే కావ్యత్వం...
కనుచూపు తో శాసించే కోమలత్వం.....!!!

సరి రాలేరు ఎవరూ ఈ రూపానికి ..
సరి తూగాలేరు ఎవరూ ఈ మనసుకి....

అదే అమ్మ మనసు...
 
చల్లని సముద్రం ..
వెచ్చగా తగిలే గాలి ...
మెల్ల గా వచ్చి పలకరించి వెళ్ళే అలల సవ్వడి ...
మనసుకి ఎంత హాయి గా ఉంటాయో...

నేను ఎక్కడున్నా ,నీవు ఎక్కడున్నా                                                                                                               
అమ్మ !!నిన్ను తలచుకున్న క్షణం లో ,                             
 నీ వడిలో ఉన్నంత హాయిగా ఉంటుందమ్మా ...!!     

అమ్మ మనసు,అమ్మ వడి ఈ రెండిటికి ఎవీ సాటి రావు....!!

కోరుకోదు ఏమీ ప్రేమ తప్ప...
అడగదు మీ ఆప్యాయత తప్ప...

కష్ట పెట్టద్దు,బాధ పెట్టద్దు ఆ మనసుని...
నిస్వార్ధమయిన ప్రేమ ఒక్కటే అమ్మ ప్రేమ...!!!

--మీ సీత




22 comments:

  1. అమ్మ మనసుని ఎంత చక్కగా వివరించారండి... మీకు హాట్సాఫ్.....సీతగారు.....

    అమ్మ మనసు, అమ్మ వడి ఈ రెండిటికి ఎవీ సాటి రావు.. సూపర్.........

    ReplyDelete
  2. mee kavitha choosaka eppodo 92 lo nenu rasina kavitha gurthochindi,
    na bloglo post chsthaanu, veelaithe chadavandi,

    ReplyDelete
    Replies
    1. tree గారు...
      చాలా సంతొషం గా ఉంది.ధన్యవాదాలు.

      తప్పకుండా చదువుతాను అండీ....కానీ నాకు ఎక్కడ చదవాలో అర్ధం కాలేదు అండీ.కొంచం చూపించగలరు...

      Delete
  3. Replies
    1. vinod gaaru..
      happy mothers day.
      thank u very much for visiting

      Delete
  4. చక్కటి కవిత ...చాలా బాగుందండి.

    ReplyDelete
  5. " అమ్మ మనసు,అమ్మ వడి ఈ రెండిటికి ఎవీ సాటి రావు....!!"
    సూపర్బ్ .... ఈ పదాలు.
    అమ్మను గురించి ఎంత వ్రాసినా కమ్మదనమే. కమనీయమే.
    సీత గారూ .... అభినందనలు.

    ReplyDelete
  6. పెదవే పలికే మాటల్లోన తియ్యని మాటే అమ్మ!.....అమ్మ గురించి కమ్మని కవిత వ్రాసినందుకు అభినందనలు సీత గారు!

    ReplyDelete
  7. సీత గారూ,
    అమ్మ ప్రేమ లోని మాధుర్యాన్ని సృష్టిలో ఎన్ని హాయిని గొలిపే వాటితో పోల్చినా సరిపోదనిపిస్తుంది, అదే సృష్టి రహస్యమేమో బహుశా!
    ఎప్పటిలానే మీ కవితలో ప్రేమ, ఇందులో అమ్మ ప్రేమా అన్ని పద కూర్పుల్లోనూ నిండుకుంది. హాయిగా అనిపించింది.
    చాలా బాగుంది!

    ReplyDelete
  8. సీత గారూ, అమ్మలోని కమ్మదనాన్ని చక్కగా ఆవిష్కరించారు. Happy Mothers Day to you.

    ReplyDelete
  9. @భరద్వాజ్ గారు,
    @పల్లా కొండలరావు గారు,
    @చిన్ని ఆశ గారు....
    మరొ మారు సంతొష పరిచారు..చాలా చాలా ధన్యవాదాలు.....!!
    అమ్మంటేనే ఒక అపురూపం మరి.

    ReplyDelete
  10. @వసంతం గారు,
    @Meraj Fathima ,
    @ఆనందం గారు ....
    మీరు రావాడం చాలా ఆనందదాయకం అండీ...
    మీ వ్యాఖ్యలు ఇంకా ఆనందదాయకం అండీ...
    చాలా చాలా ధన్యవాదాలు మీకు.

    ReplyDelete
  11. చాల బాగుంది సీత గారు,
    Happy Mothers Day to you

    ReplyDelete
  12. chaala bagundi seetha garu.

    " అమ్మ మనసు,అమ్మ వడి ఈ రెండిటికి ఎవీ సాటి రావు....!!" ee rendu concepts to manasuni ekkado takaru. prema ga amma prema nu chuparu seetha garu chala bagundi

    ReplyDelete
  13. @vinay gaaru,
    thank you very much.happy mothers day .

    @mahesh gaaru
    thank u very much.

    ReplyDelete
  14. అమ్మ గురించి ఎందరు చెప్పినా
    ఇంకా వినాలనే ఉంటుంది.
    అమ్మ ప్రేమ అలాంటిది.
    చాలా బాగుంది సీత గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీ గారు....

      Delete
  15. అమ్మ గురించి అందమైన కవితలో అద్భుతంగా కూర్చారు.అమ్మ ప్రేమ గుర్తుంటే ...అనే కవిత,మరియు అమ్మకి పాదాభివందనం నా బ్లాగులో చూడగలరు.

    ReplyDelete
  16. సీత గారు

    అమ్మ అందమైన రూపం

    అమ్మ అద్భుతమైన జ్ఞాపకం

    అమ్మ ఒక అందమైన లోకం

    ఆ అమ్మకు అభివందనం

    మీ కవితకు అభినందనం

    ReplyDelete
  17. సీత గారూ చిక్కనైన భావనతో అమ్మ ప్రేమను పలికించారు...కంగ్రాట్స్..

    ReplyDelete
  18. @రవిశేఖర్ గారు,
    చాలా ధన్యవాదాలు..!

    @బాలకృష్ణా రెడ్డి గారు,
    మీరు చెప్పింది ఇంకా బాగుంది.చాలా ఆనందం గా ఉంది.బొలెడు ధన్యవాదాలు.

    @వర్మ గారు
    థాంక్యూ వెరీ మచ్..!

    --సీత

    ReplyDelete
  19. అన్వేష్May 31, 2012

    andamaina kavita aanandam ga undi chaduvutunte chala baundi seeta gaaruu.baala krishnareddy gari comment kuda chala baundi.

    ReplyDelete