పసికందు గా బోసినవ్వులతో నీ ఒడి లో ఊయలలూగుతుంది
నీ గుండెల పై తన పాదాలు తో తంతూ ఆనందాన్నిస్తుంది
బుడిబుడి పాదాలతో తప్పటడుగులేస్తూ నిన్ను మురిపిస్తుంది
తోబుట్టువయి నీ తోడు గా చిన్న-చిన్న గొడవలతో సరదాన్నిస్తుంది
నేస్తమయి ఆడీ-పాడీ నిన్ను నడిపించే ఒక ఆహ్లాదమవుతుంది
ప్రియురాలయి నిత్యం నిన్ను ప్రోత్సహిస్తూ నిన్నల్లే ప్రేమవుతుంది
భార్య గా నీ ఇంట్లో మమతానురాగాలనే దివ్యదీపాన్ని వెలిగిస్తుంది
అనునిత్యం నీ గురించే ఆలోచిస్తూ నీ సగమై సాగి స్పూర్తినిస్తుంది
నీ బంధువులతో ఒదిగి అందరినీ కలుపుకుంటూ నీవే తానవుతుంది
నీ ప్రతిరూపాన్ని తను మోస్తూ భారం అంతామింగి తను మురిసిపోతుంది
అమ్మై నీ పాప ని నీకు చూపి నీ కళ్ళల్లో వెలుగు చూసి అంతా మర్చిపోతుంది
ఆలనా-పాలన లో మునిగి అమ్మై తాను మురిసిపోతూ నిన్ను మరిపిస్తుంది
చదువుల తల్లై బుజ్జాయి కి ఓ -నా-మా లు నేర్పుతూ నీ ప్రశంసవుతుంది
నీ కలలకో రూపాన్నిస్తూ నీ జీవితాన్ని అందం గా దిద్దే ఒక నాయికవుతుంది
బాధ్యతలన్నింటిలో నీ తోడూ-నీడయి ధైర్యాన్నికోల్పోనీక నీ గెలుపవుతుంది
ఇన్నేళ్ళు అలసిపోయారంటూ ఇక సేద తీరమంటూ నీకు ప్రశాంతతనిస్తుంది
నీ కళ్ళల్లోకి చూస్తూ మరలా నీ ఒడి లో నే ఒదిగిపోయి కనుమూస్తానంటుంది ..."మగువ మనసు".....
అన్ని పాత్రలు ఎవరయినా పోషించగలరా ??
ఎవరెంత సాధించినా ఏదో ఒక రూపం లో దానికి పరోక్షంగా కారణం ఒక మహిళే...
అందుకే "మగువ -మకుటం లేని మహారాణి."
కాదనగలరా?
--
మగువ..మకుటం లేని మహారాణి... అస్సలు కాదనలేం...
ReplyDeleteచాలా చాలా చాలా బాగా రాసారు.. సీత గారు.. keep writing...
సాయి గారూ,
Deleteమీకు బోలెడు ధన్యవాదాలు అండీ..:)
సీత గారూ, నిస్సందేహంగా మగువ మాత్రమె అన్ని పాత్రలు అంత భాద్యతగా నేరవేర్చగలదు. ఎంత బాగా రాసారో చాలా చక్కగా రాసారు, ఆడవారమైనందుకు గర్వపడాలి మనం.
ReplyDeleteఫాతిమా గారు,
Deleteబాగా చెప్పారు.ధన్యవాదాలండీ!
maaku boledu dhanyavaadaalu levaa ??
Deleteఫాతిమా గారు
Deleteమీకెందుకు లేవు ?
భలే వారే మీరు ....
ఈ పోస్ట్ లో మనలో మనకెందుకని చెప్పలేదండీ....
లేకపోతే మీకు చెప్పకుండానా??
:))
thappandi meeru cheppaka thapetatlu ledu,
ReplyDeletemeeru maharanule andi, nice one, keep writing.
భాస్కర్ గారు,
Deleteహహ .....ధన్యవాదాలండీ!
బాగుందండీ .నిజమేకదా !
ReplyDeleteచిన్ని గారు....
Deleteధన్యవాదాలు అండీ!చాలా రోజులకి మరలా వచ్చారు...
సీత గారూ!
ReplyDeleteమహా రాణుల మాట కాదనగలమా????? :-))
చాలా బాగుంది జీవన యానంలో
ఆడువారి పాత్ర చిత్రీకరణ....
@శ్రీ
శ్రీ గారు,
Deleteధన్యవాదాలండీ.....:))
నైస్, సూపర్.. సీతమ్మా... :)
ReplyDelete>>అన్ని పాత్రలు ఎవరైనా పోషించగాలరా??<<
లేదండీ.. అన్ని పాత్రలూ ఎవరూ పోషించలేరు., అన్ని పాత్రలు ఎవరూ కడగలేరు :))
అందుకే మీరన్నట్టు మగువ-మకుటం లేని మహారానే :)
హర్ష గారు,
Deleteభలే చలోక్తి విసిరారు గా.....అమ్మో.!!;)
ధన్యవాదాలండీ :)
చిత్తం మహాప్రభో...అలవాట్లో పొరబాటు ;)
ReplyDeleteచిత్తం మహారాణి గారూ...
ఇక ఎవరైనా కాదనగలరా?
చక్కగా పలికారు మీదైన శైలి లో.
అభినందనలు!
పండు గారు-చిట్టి గారు,
Deleteబోలెడు ధన్యవాదాలు మీకు :)
ఎలా కాదనగలం !?
ReplyDeleteఅందుకే తల్లిని మించిన దైవం లేదన్నారు. తల్లి కాగలిగింది మగువ మాత్రమే. తల్లి పాత్ర మాత్రమే గాక ప్రస్తుత వ్యవస్థలో మీరు చెప్పిన ప్రత్యేకతలను ఓర్పుగా నిర్వహిస్తున్న మహిళలు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుతూ ..... మగువ పాత్రను మంచిగా చెప్పిన సీతకు అభినందనలు.
పల్లాకొండల రావు గారు ,
Deleteబాగా చెప్పారు.ధన్యవాదాలండీ...:)
కార్యేషు దాసి కరణేషు మంత్రి
ReplyDeleteభోజ్యేషు మాత శయనేషు రంభ
very very nice lines prince gaaru...
Deletethank you so much
సీతగారు మగువ మనసు ఏంటొ చాలా బాగా వివరించారు. మీ కవిత చాలా చాలా బాగుంది. నిజం గా మహిళ మకుటంలేని మహరాని.
ReplyDeleteనిత్య గారు....
Deleteచాలా సంతోషం అండీ...మీకు ధన్యవాదాలు
అంత గొప్పదయిన స్త్రీ శిశువును అంతం చేస్తున్నారు బాబోయ్! వద్దుని ఎలుగెత్తి చెప్పండీ!!!
ReplyDeleteశర్మ గారు
Deleteస్వాగతం అండీ
చెప్తున్నామండీ....కాని అరాచకాలు జరుగుతునే ఉన్నాయి...
అవి తగ్గాలి.
మీకు ధన్యవాదాలండీ
చాలా బాగుందండి.
ReplyDeleteశ్రుతి గారు,
Deleteధన్యవాదాలండీ
thankyou so much...:)
ReplyDelete