Tuesday, 17 July 2012

'నీటి' లా 'మనసు'....

తరంగమై ఆలపించగలదు అనంత సంగీతాన్ని
తరంగిణియై అభినయించగలదు నాట్యాన్ని

ఎగరగలదు గాలిలో ఆవిరియై 
చల్లార్చగలదు అవనిని తుషారమై 

వెలిగించగలదు దీపాన్ని మిణుగురుదేహంలో 
ఆర్పగలదు మన దేహదీపాన్ని క్షణికంలో 

దూరగలదు రాళ్ళసందులో
దాటిపోగలదు శిఖరాలను
పెరగగలదు సముద్రమంత
కాగలదు సూదిమొనంత  

పంచభూతాలలో ద్రవం
మన పాలిటి కనకం

స్వల్పంగా అరచేతి లో ఇముడుతుందని చిన్నచూపేలా..?!?!
'ఆడదాని మనసు'లా ఎగసే 'నీటి' గొప్ప తనాన్ని మరిస్తే ఎలా..??!

--సీత ....


46 comments:

 1. చాలా చక్కగా ఉంది సీత గారు...
  ఆడవారి మనసును నీటితో చక్కగా వర్ణించారు...సూపర్..

  ReplyDelete
  Replies
  1. సాయి గారు...
   చాలా ధన్యవాదాలండీ....:)

   Delete
 2. నీటిని గురించి భలే చక్కగా చెప్పారండి, ఏదో కొత్త ప్రయోగంలా వుంది, మనసు గురించేమో అనుకున్నా మొదట.
  save water, save world.
  keep writing.

  ReplyDelete
  Replies
  1. భాస్కర్ గారూ,
   గమనించండి....అది మనసు గురించి కూడా అండీ....
   కొత్త ప్రయోగమే ...!!
   ధన్యవాదాలండీ:)

   Delete
 3. AnonymousJuly 17, 2012

  నాకెందుకో కడలి బ్లాగ్ సుభ,జలతారువెన్నెల,రసజ్ఞ గార్లు,
  ప్లస్ ఈ సీతపలికే గార్ల బ్లాగులన్నీ ఒకేలా అనిపిస్తాయి!
  ఇవన్నీ ఒక్కరే నిర్వహిస్తున్నారా ఏమిటి ఇలా మారు పేర్లతో ??
  అన్న సందేహం కూడా కలుగుతున్నది..

  ReplyDelete
  Replies
  1. అజ్ఞాత గారూ..
   అదేమీ లేదండీ..!!ఎవరి ఆలోచనలు వారివి ...కానీ మీకలా అనిపించడానికి కారణం నా ఉద్దేస్యం లో ఏమైయ్యుండచ్చంటే అందరం ఆడవాళ్ళం కదా మా మనసులు ఒకేలా ఆలోచించి ఉండచ్చు ఏమో..

   Delete
 4. AnonymousJuly 17, 2012

  చాలా బాగుంది సీతమ్మా!

  ReplyDelete
  Replies
  1. హర్ష గారూ
   ధన్యవాదాలండీ :)

   Delete
 5. నీటి గొప్పదనాన్ని చాలా చక్కగా చెప్పారు సీత గారూ...

  ReplyDelete
  Replies
  1. జ్యోతిర్మయి గారూ...
   ధన్యవాదాలండీ :)

   Delete
 6. Replies
  1. krsna gaaru...
   very very thank you :)
   welcome to my blog...

   Delete
 7. నీటిని , మనసును , పోల్చుతూ చక్కగా రాసారండి.

  ReplyDelete
  Replies
  1. ఆనందం గారు..
   ఆనందమండీ ..!!
   మీకు ధన్యవాదాలు :)

   Delete
 8. నీటి గొప్పదనాన్ని చాలా చక్కగా చెప్పారు సీత...

  ReplyDelete
  Replies
  1. శృతి
   చాలా ధన్యవాదాలు మీకు :)

   Delete
 9. బిందువు...బిందువు కలిస్తేనే కదా..
  సింధువు అయ్యేది...

  "ఆర్పివేయగలదు అవనిని తుషారమై."
  ఈ వాక్యం అర్థం కాలేదు సీత గారూ!
  అవని అంటే...భూమి కదా!
  వివరించగలరు..

  మగువ మనసు, నీరు రెండూ అమూల్యాలే...
  చాలా బాగుంది...
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారు ,

   దానికి అర్దం ఏమిటంటే

   తుషారము అంటే చల్లని,మంచు అల అనమాట
   అవని అంటే భూమాత కదా..
   అంటే వేడి కి అల్లాడిపోయిన భూమిని చల్లదనం తో చల్లార్చగలదు అనే దానిని నేనలా ఆర్పివేయగలదు అన్నాను...
   అంతే ..!

   చాలా ధన్యవాదాలండీ :)

   Delete
  2. నాకు మీరు ఏమి వ్రాయాలనుకున్నారో కవిత చదువుతుంటే అర్థమౌతోందండి...
   కానీ అర్పివేయటం...చల్లార్చడం వేరే అర్థాలు వస్తాయి...
   అందుకే అడిగాను...మీరు పొరపాటున
   చల్లర్చగలదు...శాంతింప చేయ గలదు...
   ఇలాంటి పదాలకి బదులుగా అర్పి వేయగలదు వాడారని...:-)
   @శ్రీ

   Delete
  3. శ్రీ గారూ...
   నేను ఏ ఉద్దేశ్యం లో అలా అన్నాను అంటే ,
   ఎండ తో వేడి కి మండిపడుతున్న భూమి ని చల్లని మంచు లా ఆర్పగలదు అని నా అంతరార్ధం అండీ.అందుకని ఆర్పివేయగలదు అని రాశాను అండీ :-)
   మీకు చాలా ధన్యవాదాలండీ :)
   ఆలస్యానికి మన్నించగలరు.

   Delete
 10. సీత గారూ, కవిత బాగుంది చక్కని వర్ణన, అవని స్తానంలో "అనలము" అన్న బాగుండేదేమో, బాష కన్నా బావం బాగుంది. హ్రిదయానికి హత్తుకునేలా.

  ReplyDelete
  Replies
  1. ఫాతిమా గారూ,
   చాలా ధన్యవాదాలండీ :)
   అనలము అనే ఆలోచన నాకు రాలేదండీ...
   ఎందుకో వర్షం కోసం ఎదురుచూపులో కడా అలా అనిపించింది...!!
   :)

   Delete
 11. great mam :)

  ReplyDelete
 12. చాలా బాగా వ్రాశారు. లోతైన భావం..చక్కని భావప్రకటన
  మీ బ్లాగ్ డిజైన్ చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. vanaja gaaruu...
   chaalaa santOsham amDI.
   bOlEDu dhanyavaadaalu meeku :)

   Delete
 13. 'ఆడువారి మనసు'కీ 'నీరు'కీ అద్భుతమయినపోలిక ...చాలా గొప్ప ఆలోచన.
  సీత గారు అభినందనలు.
  మరోసారి సీతగారు చక్కగా పలికారు..

  ReplyDelete
  Replies
  1. 123 గారూ ,
   ధన్యవాదాలు మీకు :)

   Delete
 14. మంచి పోలిక .కవితా గమనం బాగుంది.

  ReplyDelete
  Replies
  1. రవిశేఖర్ గారూ
   ధన్యవాదాలండీ :)

   Delete
 15. పంచభూతాలలో ఒకటైన నీటిని చక్కగా వర్ణించారు.
  చివర్న ఆడ పిల్ల మనసుని నీటి బిందువుతో పోల్చి చెప్పిన తీరు బాగా నచ్చింది.

  ReplyDelete
  Replies
  1. చిన్నీఅశ గారూ
   ధన్యవాదాలండీ :) :)

   Delete
 16. AnonymousJuly 19, 2012

  Nice song apt for this post!
  http://www.divshare.com/download/12023222-b82

  ReplyDelete
 17. సీత గారు, మీ కవిత చాలాబాగుంది. చివర్లొ ఆడడవారి మనుసుని నీటి తొ చాలాబాగా పొల్చారు.

  ReplyDelete
  Replies
  1. నిత్య గారూ
   చాలా ధన్యవాదాలండీ :)

   Delete
 18. బాగుంది ప్రవాహం లా !

  ReplyDelete
  Replies
  1. కొండలరావు గారు..
   సంతోషం అండీ.:)
   ధన్యవాదాలు మీకు :)

   Delete
 19. parledu kaani inka improve avvali .doubts emanna unte nanne adagande naku anni telusu.lol(no pun intended)

  ReplyDelete
  Replies
  1. thanooj garu,
   welcome to my blog :)
   thank you ...
   mimmalne adugutaa eesaari ....;)

   Delete
 20. Vry nice mam :) grt comparision

  ReplyDelete
  Replies
  1. sai garu,
   thanku very much :)

   Delete
 21. Sita garu...chala bavundandi me kavitha...:)

  ReplyDelete
  Replies
  1. valli garu
   welcome to my blog
   thanik you so much :)

   Delete
 22. భాష కన్నా భావం బాగుంది.కాని ఒకరు సూచించినట్లు,'తుషారం అవనిని ఆర్పగలదు 'అన్న వాక్యంలో అన్వయం కుదరదు.మార్చి రాస్తే బాగుంటుంది.

  ReplyDelete
  Replies
  1. కమనీయం గారూ
   స్వాగతం అండీ :)

   శ్రీ గారు,మీరు చెప్పినట్టు మార్చాను అండీ:)
   ధన్యవాదాలు.

   Delete