Tuesday 5 June 2012

స్నేహం --స్నేహ బంధం


అమ్మ ప్రేమలో ని ఆప్యాయతని పంచిస్తుంది
నాన్న స్ఫూర్తి లో ని నమ్మకాన్ని నిలబెడుతుంది 


నిజమయిన  ఆస్తి ని సంపాదించి పెడుతుంది
అర్భుతమయిన  ఆనందాలతో అల్లుకుపోతుంది

మరచిపోలేని మనసులనేన్నో దగ్గర చేస్తుంది
మరపుకేరాని మమతలనేన్నో అందిస్తుంది

కలతలనన్నీ  కమ్మని కబుర్లతో మరిపిస్తుంది
కష్టాలన్నీ పంచుకొని ప్రేమ గా మురిపిస్తుంది

బాధల్లో ఓదార్పై  బంధాన్నింకా బంధిస్తుంది
నవ్వులో  నేస్తమై నడచి నిత్యం ఉంటుంది 

ఆనందాలన్నీటినీ ఆరోగ్యం గా  ఆస్వాదింపచేస్తుంది 
అనవసరబాధలన్నిటి పై ఆనందాని చల్లేస్తుంది

గెలుపు బాట లో  నడిచే ఆనందం అవుతుంది
ఓటమి పాలయినపుడు నిట్టూర్పు నిచ్చి గెలిపిస్తుంది    

మంచి తో మనలోని మమతా జ్యోతి ని  వెలిగిస్తుంది
చెడుని నాశనం చేసి చీడపురుగుని దూరం చేస్తుంది

ప్రశాంతం గా దగ్గరయ్యి ప్రేమదీపాన్ని వెలిగిస్తుంది
పవిత్రబంధం లా జీవితాంతం ప్రయాణం చేయిస్తుంది 

జీవితం  అనే వనం లో ఉదయించే  ఒక పుష్పం 
జన్మ జన్మలయినా దీనికోసం జన్మించాలని ఆశ రేపే ఒక అనుభవం ...........!!

అదే   స్నేహం 

కష్టమయినా సుఖమయినా నీ తోనే నేననే ఒక భావం
నీ కన్నీరు నాది --నా చిరునవ్వు నీదని చెప్పే ఒక బంధం
అదే          స్నేహ బంధం 



-- మీ సీత.....

25 comments:

  1. >>>ఆనందాలన్నిటిని ఆరోగ్యం గా ఆస్వాదిమ్పజేస్తుంది
    అనవసర బాధలన్నిటిపైనా ఆనందాన్ని చల్లేస్తుంది,<<<

    చాలా బాగుందండి. :)

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం అండీ......ధన్యవాదాలు.... :) :)

      Delete
  2. సాయిJune 05, 2012

    చాలా బాగుంది...... అందరూ అలా మంచి స్నేహితులలానే ఉంటే ఎంత బాగుంటుందో కదా ?
    కానీ ఉండరు... ఎవ్వరి స్వార్దం వారిది.....

    ఇవన్నీ రాసుకోవడానికే... రియల్ గా పనికి రావు..............

    అలాంటి నిజమైన స్నేహితులు దొరకడం కష్టం. ఉండడం అదృష్టం...

    ReplyDelete
    Replies
    1. సాయి గారు మీరు చెప్పింది నిజమే .....మంచి స్నేహితులు కరువవుతున్నారు.....స్వార్ధం ఎప్పుడయితే వస్తుందో ఇక స్నేహం ఉండదు అనేది నిజం.ఎక్కడొ ఉంటారు అలాంటీ అద్రుష్టవంతులు.ధన్యవాదాలండీ....
      :)

      Delete
  3. మంచి స్నేహితులు వివాహం చేసుకుంటే మంచి జీవితం గడుపుతారట .కానీ ప్రేమికుల విషయంలో దానికి అంత గ్యారంటీ లేదట.మీ కవిత ప్రేమలోంచి స్నేహం లోకి స్నేహం నుండి ప్రేమలోకి ప్రవహిస్తుంది.
    అలా వుంటే జీవితం ధన్యం.good poetry.

    ReplyDelete
    Replies
    1. :)
      మంచి స్నేహితులు.... ఆ తరువాత ప్రేమ.. ఆ తరువాత...
      :) ఒకరికి ఒకరు తెలియని... అపరిచితుల్లా.. జీవించాల్సి వస్తుంది.. రవిశేఖర్ గారు...
      ప్రేమకే.. జీవితానికే గ్యారంటీ లేదు... ఆ జీవితంలో ఒక భాగమైన.. ప్రేమకి.. ఇంకెక్కడి గ్యారంటీ అండీ...

      సీతగారు... మీ కవిత బాగుందండీ...

      Delete
    2. రవిశేఖర్ గారు,
      బాగా చెప్పారు.చాలా సంతోషం .ధన్యవాదాలు.
      మానస గారు,
      ధన్యవాదాలు. మీరు చెప్పింది కుడా నిజమే కానీ అది ఆ మనుష్యుల మీద,వారి మనసుల మీద ఆధార పడి ఉంటుంది కదండీ.....!!కానీ ఇప్పుడందరూ మీరు చెప్పినట్టే ఉంటున్నారు అన్నది వాస్తవం .
      :) :)

      Delete
  4. snehithulu lene aanandaalanu vethukovadam kashtame mari.

    ReplyDelete
    Replies
    1. అవును నిజం అండీ....అందుకే ఒక సామెత కుడా ఉంది ఇంగ్లీష్ లో
      the person who has no friends has nothing eventhough he is a millionare అని. నిజమయిన ఆస్తి స్నేహితులే కదండీ...భాస్కర్ గారూ..ధన్యవాదాలు :)

      Delete
  5. స్నేహం గురించి చాలా బాగా రాసారు. సూపర్ సీత గారు...మీ ఒక్కో పోస్టు ఒక్కో ముత్యంలా ఉంటుంది...... గ్రేట్ ....

    ReplyDelete
    Replies
    1. భరద్వాజ్ గారు ,
      ధన్యవాదాలు .చాలా సంతోషం.మరీ ఎక్కువ గా పొగిడేసారు.నాదేమి ఉంది!చాలా సంతోషం :) :)

      Delete
  6. నిజమే అన్నీ చెప్పారు
    నేటి యువతరానికి స్నేహం పెంపొందించుకొనే వ్యవధి వున్నదా అని నా అనుమానం
    ఆనాటి స్నేహ గీతాలు నేడు వినిపించవు
    అందుకే కొందరు సాధ్యమేనా అన్నారు కదా ఇక్కడే ..
    ఏది ఏమైనా మంచి మనసైన కవితని అందించినందుకు అభినందనలు సీత గారూ

    ReplyDelete
    Replies
    1. బాలకృష్ణ రెడ్డి గారు,
      మీరు వ్యక్త పరచిన అనుమానం నిజమే ....ఇప్పట్లో మాత్రం స్నేహానికున్న విలువలు తగ్గిపొయాయి అన్నది నిజం.స్నేహం అవసరం గా మారిపోయింది ఎందుకో...అందుకే పూర్వ కాలం స్నేహాలకీ ఇప్పటికీ అంత వ్యత్యాసం వచ్చిందని నా అభిప్రాయం.కానీ ఇప్పట్లో కుడా ఉన్నారు కానీ చాలా తక్కువ అనేది వాస్తవం.
      చాలా ఆనందం గా ఉంది మీ స్పందనకు.ధన్యవాదాలు అండీ.....!

      Delete
  7. సీతగారూ , మీ కామెంట్ కోసం ఎదురు చూసాను. సరే ఏమిచేద్దాం ఈసారికిలా కానీ అనుకున్నాను

    ReplyDelete
    Replies
    1. సీత గారూ , ఏదో విశేషత ఉంది మీ కవితల్లో , నాకు మల్లె హ...,హ,,,హా '

      Delete
    2. AnonymousJune 07, 2012

      Compare her poetry to pearls, diamonds, your comment will be appreciated.

      To get attention, one need to praise the blogger like indra, chadra, it is normal in these blogs

      Delete
    3. అవునా ఎదురు చూసారా...ఆలస్యం అయ్యింది ఎంతయినా బిజి బిజీ జీవితం కదండీ....!!!!

      నిజమే అంటారా ఫాతిమా గారూ....మీలో ఉన్న విశేషత నా కవితల్లో ఉందంటారా.....ఏమో....
      కానీ చాలా సంతోషం అండీ..ధన్యవాదాలు మీకు.....

      Delete
    4. anonymous gaaru,
      thanks for commenting and welcome to my blog....!!
      ofcourse this may be right but there is no need of praising the author without liking the article..
      thank you.....

      Delete
  8. ఊహలలో బతు కీడ్చుచు,
    మోహావేశముల దేలి, బుధ్ధి మలినమై ,
    రాహువు మింగిన యువతకు
    స్నేహామృత విలువ దెలిసి జీవించుటయా !?
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. వెంకటరాజారావు గారూ....
      మీరు చెప్పింది అక్షరాలా నిజం సార్.ఊహలలో ,ముసుగేసుకొని బ్రతుకుతున్నారు....కానీ ఏ మూలో నూటికో,కోటి కో ఎవరో ఉంటారండీ....అలాంటి వారు ధన్యులు.
      మీరు చాలా బాగా చెప్పారు అండీ...
      చాలా సంతోషం .ధన్యవాదాలు...

      --సీత

      Delete
  9. స్నేహ బంధము ఎంత మధురమూ!
    చాలా బాగుంది సీతగారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ
      చాలా ధన్యవాదాలు అండీ.....!!!

      Delete
  10. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా! పాట గుర్తుకొస్తుంది.

    వ్యవస్థను బట్టే మనిషి ఆలోచనలుంటాయి.

    పాత కాలం లో విలువలకై పరితపిస్తున్న సీత గారి లాంటివాళ్లు ఇప్పుడూ ఉండడం మంచిదే.

    ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అన్నట్లు ప్రయత్నం చేస్తూ పోవాల్సిందే తప్ప నిరాశ పడకూడదని నా అభిప్రాయం.

    అలాంటి ప్రయత్నానికి ఇలాంటి బ్లాగులు - పోస్టులు అవి రాస్తున్నవారు దోహదపడుతుంటారనడం లో సందేహం లేదు.

    ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న సీత గారికి అభినందనలు.

    మీ పోస్టులు బాగుంటున్నాయి. తీరిక చూసుకుని మిగతా పోస్టులు కూడా చదువుతాను.

    ReplyDelete
    Replies
    1. పల్లా కొండల రావు గారు.........
      ఇటువంటి బ్లాగ్ లు తోడ్పడతాయన్నది నిజం.....
      చాలా సంతోషం అండీ , మీరు రావడం ,మీరు వ్యాఖ్యానించడం ...!!

      -- సీత.....

      Delete