తెల్లారుతూనే కుహూ కుహూ అనే పక్షుల రావాలతో
తొలిమంచు కరిగిందీ , గుడ్ మార్నింగ్ అని లేపెసావు.......
ప్రశాంతం గా తోలిపొద్దు చిన్నగా వీచే గాలులతో
మేడ పై నడుద్దామంటూ పరుగులు పెట్టించావు....
మెల్లగా వచ్చే ఆకాశసూర్యుడి పలకరింపులతో
మేళవింపు గా కాఫీ తో మాటలలో ముంచెత్తావు...
డైనింగ్ టేబుల్ దగ్గర నేనోచ్చేసరికి బ్రేక్ ఫాస్ట్ తో
వద్దన్నా నాకిష్టమయిన దోశ తో దర్శనమిచ్చావు...
వంటింట్లో వెచ్చగా వెలిగిన పొయ్యి మంటలతో
వెంటనే పని కానివ్వమంటూ సహాయం చేసావు....
మధ్యాహ్నం ఒంటి గంట కి అల్లరి చేసి ఆకలితో
నా చేత ముద్దలు తినే చిన్న పాపాయి వయ్యావు...
అలసిపోయి వచ్చి నడుంవాల్చితే పేపర్ లో కబుర్లతో
కమ్మనయిన మాటలు చెప్పి నవ్వించే నేస్తాని వయ్యావు.....
సాయంత్రం నాలుగింటికల్లా చేతిలో రెండు టీ కప్పులతో
లేస్తున్న నా కనులకి హాయ్ అంటూ పలకరింపువయ్యావు........
ఆరవుతూనే అటూ-ఇటూ తిరిగి చేతిలో బైక్ కీస్ తో
అలా-ఇలా తిరిగొద్దామంటూ నాతో కదిలిన ఆనందమయ్యావు .......
సరే ఇక ఇంటికి పోదాం అని అంటే సినిమా టికెట్ లతో
సరదాగా సెకండ్ షో చూద్దాం అంటూ ఐస్ క్రీం తో ఐస్ చేసావు....
అలుపెరిగి కనులు మూత బడుతుంటే కమ్మని మాటతో
గుడ్ నైట్ అంటూ నవ్వి భరోసా గా నా చేతి లో చేతి వయ్యావు......
మరలా ఎవరో లేపుతున్నట్టు ఉంటే, లేచి చూస్తె కనులతో
నా కనులకందని రూపాని వై నా కల వయ్యావు....
అలా లేచి కదిలి నడుస్తూ ఉంటే రకరకాల ఆలోచనలతో
నన్ను నాకే అర్ధం కానీక ఒక ఆశ్చర్యానివయ్యావు......!!!
--
సీత
eenati kalale repati nijaalu,
ReplyDeletedhyryam ga kalalu kanandi, venaka memunnamu, chadivi comment pettadaniki,
nice, bhgundandi, mee kala.
avunu haaram lo mee blog kanipisthunnatlu ledhe?
bhaskar gaaru,
Deletemeranta unnaranaa dhairyam tone kadaa kalalu kanestunnaanu..;)
thank you.neniivaale register chesanu haaram lo
chinna quid fro co andi, koodalilo ela cheralo cheppandi, please.
Deleteకూడలి లో పైన కుడిచేతి వైపు కొత్త బ్లాగు చేర్చండి అని ఉంది కదా దానిని చూడండి
Deleteముందు గా మీరు బ్లాగ్ యూజ్ చేస్తున్న ID
నుండి support@koodali.org కి mail పంపండి ....మీరు అందులో మీ పేరు,బ్లాగ్ పేరూ, URL పంపాలి
మీకు మెయిల్ వస్తుంది ...ఒక 4 రోజులు పట్టవచ్చు .
- సీత.....
thanks sitha garu, mee salaha tho malika lo add indi.
Deletekoodali koncham time paduthundemo,
intha kalam blog lo mail untundani idea ledu naku,
thank you, keep writing.
ok bhaskar garu.....thank you.
Deleteసీతగారు బాగుంది అండీ మీ కల.... అది తప్పక నెరవేరుతుంది......
ReplyDeleteమంచి కవిత బాగుంది...
సాయి గారు,
Deleteచాలా ధన్యవాదాలండీ ....!!
కోరుకున్నందుకూ,నచ్చినందుకూ.....!
క్యా బాత్ హై...:-))..
ReplyDeleteకవిత బాగుందండీ సీతగారూ!
తెలుగింటి ఆడపిల్ల కమ్మని కల...
really nice....
@శ్రీ
శ్రీ గారూ
Deleteచాలా సంతోషం అండీ.....ధన్యవాదాలు :))
సీతమ్మా.. ఏమిటో అదంతా , పోనీ మీకే సొంతమైతే ఎంతో బాగుంటుండీ అనుకుంటా , అందమైన కల అధ్బుతమైన వర్ణన,
ReplyDeleteఫాతిమా గారూ
Deleteనిజమయితే తప్పక చెప్తా లెండీ.!!;)
సొ హాపీ అండీ......ధన్యవాదాలు
ఫణి గారు.
ReplyDeleteస్వాగతం అండీ.....
మీ నవ్వుతో నే నచ్చిందన్నారు...చాలా సంతోషం.ధన్యవాదాలు......!
baagundi seetha gaaru mee kavita.
ReplyDeletejalataaru vennela gaaru,
Deletewelcome andii.....!!
thank you so much.......!!!:)
వలపు కలల తూనీగ రెక్కలు ధరించి
ReplyDeleteయెగిరి యూహా ప్రపంచాల కేగి యేగి
తిరిగి తిరిగి యలసట నిద్రించు యువతి!
నట్టడవి చెట్టు కొమ్మెట్లు నచ్చె నమ్మ ?
----- సుజన-సృజన
వెంకట రాజారావు .లాక్కుకుల గారూ,
Deleteనా కవితనంతా మూడు వాక్యాలలో భలే చెప్పేశారు....చాలా సంతోషం అండీ .ధన్యవాదాలు......!!!
- సీత.....
కనులు తెరవగనే వెలుగుల నుంచీ
ReplyDeleteకనులు మూసిన చీకటి కలల దాకా
ఊహల్లో ఉంటూ అర్ధంకాని ఆశ్చర్యం
తోడుగ ఉండే ప్రియ నేస్తం....
కవితలో రోజులోని అన్ని సమయాల్లోని భావాలూ చక్కగా పలికించారు.
పండు గారు......
Deleteప్రియ నేస్తం అంటే అంతే కదండీ .....ఊహల్లోనూ తోడుండాల్సిందే .......
మీకు దన్యవాదాలండీ .......!!!
ఓ సీత,
ReplyDeleteనిజాన్ని కలలో చుసి అలసి,సొలసి...
మరలా ఆ కలకై అందం గా నిదురిస్తున్నావా ??
కనులు తెరిచి చూసేసరికి కలనిజమవ్వాలని ఆశ నింపుకున్నావా??
చాలా బగుంది మీ వర్ణణ ఇంకా కల.
అజ్ఞాత గారు.......
Deleteబాగా అడుగుతూనే చెప్పారు.....!!
సంతోషం .దన్యవాదాలండీ .....
seeta gaaru,
ReplyDeletechaalaa baagumdi mee kala...eppati laage chaala chakka gaa raasaaru .
.mee 'priyanEstaanni' twaralO kalusukOvaalani memanta aasistunnam.
anvesh garu,
Deletemany thanks to you...
భలే మంచి రోజు !
ReplyDeleteపసందైన రోజు !!
సీతమ్మ ఆశలన్ని కలగా మారిన రోజు !
ఒక రోజు ఇలా గడిస్తే ఎంత హాయిగా ఉంటుందో !!
జనమంతా - జగమంతా ఇలా ఉండే మరో ప్రపంచం కోసం అందరం కలలు కందాం!
మీ కల బాగుంది సీత గారూ !
పల్లా కొండల రావు గారు........
Deleteకలలు కనాలి+నేరవేర్చుకోవాలి ......
అదే ఆనందం కదండీ.......!!
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండీ...!!
-- సీత.....