Saturday 14 January 2012

నిజం అని ఒప్పుకోగల ధైర్యం , అబద్దం అని తప్పించుకో గల నేర్పు మనకి ఉందంటారా???

ముందు ఈ కిందది చదవండి ......
"త్యాగరాజ పంచరత్నాల లో మన జీవితం"

జగదానందకారక -జయజానకి ప్రాణనాయక ....
 ఇందులోనే సృస్తి గురించి మొత్తం రచించారట త్యాగరాజుల వారు........
మొదటి ల లో నే మనకి రామాయణం అంతా ఉంది .....
మనకి చివరికి శాస్వతం గానిలిచి పోయేది ఆనందంమత్రమే... ఆ ఆనందం రామనామ కీర్తనల తో నే వస్తుంది. రామ విరహం ఆనందమే అలాగే  రామ సన్నిధి ఆనందమే ........!!
మంగళకరమైన శ్రీ సీత దేవి ప్రాణ నాయక ....ఆమె ప్రాణానికి నాయకుడు  ఆయన .ఇక్కడ ప్రాణం అంటే జీవుడు కాదు ...మనస్సు ..ఆమె మనస్సు కు అధినాయకుదివయ్య అని కీర్తించారు  ...ఇంకో దగ్గర మంగళము జానకి మానసనివాసునకు అని కుడా కీర్తించారు ...ఒక్క వాక్యం  లో నే ఇంత భావం ఉంటె ఇంకా ఆయన కృతులు ఒక్కొక్కటి విన్నా చాలు అసలు అవి రాగాలు తెలియక పోయినా  చదివినా చాలునట .........

మనకి ఇవేమీ అర్ధం కావు ఎందుకంటారా?
మనం సినిమా లు వాటి పాటలంటూ పాడుకుంటూ ఉంటాం .....ఎంత సాహిత్యాన్ని ఎంత దాన్ని చేసాం అది నిజంగా మన దౌర్భాగ్యమే అనుకోవాలి .......కాదంటారా?
కాదనే మన మనసుల్ని mould చేసేసాం లెండి..... 

ఇంకా రెండవది----> దుడుకుగల -నన్నే దొర ..
ఇందులో  దుడుకు తనం తో ఉన్న నన్ను ఎలా నువ్వు నీ దరికి చేర్చుకున్తావు రామయ్య నేనెంతటి పాపం చేసానో తెలుసా ? అని  అడుగుతాడు ......ఖచ్చితం గా ఇది అందరికి వర్తిస్తుంది
ఈ పాట లో ఒక వాక్యం ఉంటుంది  ..
చిరుతప్రాయము న నాదే భజన మ్రుతరస విహీన కృతర్కుడనైన ...........
అక్షారాల నిజం కాని ఒప్పుకోం !!!! ఎందుకంటే మనం ఎప్పుడో మూర్ఖుల మయిపోయాం .....
ఒక్క వాక్యమే  అది ..అలాంటి మాణిక్యాలు ఆ కీర్తన లో ఎన్ని ఉన్నాయో ...!!
తన మదిని భువివి సౌఖ్యపు జీవనమే యనుచు - సదా దినములు గడిపెడు ------మనం స్వార్ధం తో నిండి పోయాం అనడానికి ఇంతకన్నా గొప్ప వాక్యాన్ని  ఏది చూపించగలరా?

ఇవి చుడండి ...
--దృష్టికి సారంబగు లలన సదనార్భ సేనామిత ధనాదులను, దేవదేవ ! నెరనమ్మితినిగాకను పదాబ్జ భజనంబు మరచిన
--చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ జేయక దుర్మదాంధ జనుల గోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాసలను రోయలేక సతత మపరాధియై చపల చిత్తు డైన 

ఎంతని విలువ కట్టగలం ఆ వాక్యాలకి అమ్మో ........మన జీవితం సరిపోతుందా  ??

అంత గొప్పవాటిని వదిలేసి పిచ్చి పిచ్చి వాటికి వెళ్తున్నాం....!!!!

కాదంటారా..???కాదనే ధైర్యం లేదు, అవునని ఒప్పుకునే స్థితి లో నూ మనం లేము  లెండి .....!!!!

మూడవ మాణిక్యము -- సాధించనే ఓ మనసా ...

ఏం సాధించిందో  తెలుసా మన మనసు 
 "బోధించిన సన్మార్గ వచనముల
బొంకుజేసి తాబట్టిన పట్టు " మనం పెద్దలు మాట వినం అని ఒప్పుకోం కాని నిజం అది ...........

ఎంత గొప్ప గా చెప్పాడో చూసారా ఈయన ......ఆహా !!! అనిపిస్తుంది కదా.......!
మనం యుక్త వయసు లో  ఉన్నప్పుడు ఏది లెక్క చేయము మన పట్టే మనకి కావాలి .......!!!!!!

ఇంకా ఈ కీర్తన లో ఆణిముత్యాలు లాంటి వాక్యాలు ఉన్నాయో చూద్దామా  ...!!
హరే! రామచంద్ర రఘుకులేశ మృదుసుభాష
శేషశయన పరనారీ సోదరాజ విరాజ తురగ రాజ
రాజనుత నిరామయాప ఘన సరసీరుహదశాక్ష
యనుచు వేడుకొన్నను తా బ్రోవకను......
చూసారా ఎంత అమోఘం గా ఉందొ చూసారా?

ఇంత అమోఘమైన వాటిని విస్మరించిన మనం ఎంత దౌర్భాగ్యం అనుభవిస్తున్నాం .....!!!!!
ఇంకా  దౌర్భాగ్యం కన్నా వేరే మాట దొరకలేదు అనడానికి నాకు ......!! అంతే......
ఇంక నాలుగవ రత్నాని కొస్తే అది కనకన రుచి రా..........
కనకన రుచి రా.........చూసే కొద్ది రుచి రా ఓ రామ....!!!!
నిన్ను చూసే కొద్ది ఎంత రుచి రా ఓ రామ.......అని త్యారాజుల వారు కీర్తిస్తున్నారు .....!!

అది అక్షరాల నిజం ...చెడు ని చూసే మన కళ్ళ  కి ఇది అర్ధం కాదు .....!!! ఏముంది అనుకుంటాం ...అదే నిజమైన ఆరాధనా తో ఆ స్వామి ని చూస్తే మనమే అనుభవిస్తాం ...ఆ అనుభవం ముందు ఏది సరిపోదు అది కేవలం మనసు తో నే అనుభావిన్చాగాలుగుతాం !!!!!! 
కనకన రుచిరా కనకవసన! నిన్ను
దినదినమును మనసున చదువున నిన్ను.....
అంటారు త్యాగరాజుల వారు ...
ఓ రామ ....నిన్ను చూసే కొద్ది మనసుకి నీవు దగ్గరిపోతున్నావు.....అంటున్నారాయన ..!!!
అది నిజం మనకి ఈ ప్రపంచం లో ఎవ్వరు ఉన్న లేకపోయినా ఎవరితో  సంబంధం ఉన్నాలేకపోయినా 
నీతో సంబంధం కావాలి ....అప్పుడే జీవితానికొక అర్ధం ..!! ఆ అర్ధమే పరమార్ధం ..!! ఒక వాక్యం లో ఎంత అర్ధముందో చూసారా...!! ఆహా .......అనిపిన్చట్లెదూ.......!!!!
వీటి గురించి తెలుసుకున్తున్నప్పుడు నేను ఇల్లాగే అనుకునే దాన్ని ....
ఇలా తెలుసు కుంటూ పొతే ఎన్నెన్నో అర్భుతాలు ,అనుభవాలు ఉంటాయి.......మనం వాటిని దరికి చేర్చుకోలెం అదేమిటో .......!!!!
ఈ కీర్తన లో నే ఒకటి  ఉంది ........

సాపత్నీ మాతయౌ సురుచివే
కర్ణశూల మైనమాట వీనుల
చురుక్కున తాళక శ్రీహరిని
ధ్యానించి సుఖింపగలేదా యటు ..

ఇందులో  రెండు అర్ధాలు ఉన్నాయ్ ,.....
ఒకటి చూద్దాం.. సపత్ని మాతయౌ అని ఇక్కడ సీత దేవి ని కీర్తించారు ......
అంత గొప్ప తల్లి కి కర్ణశూల మైనమాట అనగా అడవులుకు  పంపినపుడు తన పతి దేవుడు ,తన మానస నివాసుడగు శ్రీరాముడు ఆమె ని పరిత్యగించినట్టు విన్న ఆమె ఎంత నరకం అనుభావిన్చిందో ...
కాని ఆమే మనసున నిన్ను తలచి మనసులోనే నీతో కలిసి ఉండలేదా , మనస్సు పొందే సుఖం ముందు ఈ భోగా లన్ని ఎందుకయ్యా...ఆమెని నీవు భౌతికం గా నే దూరం చేసుకున్నావు మనసు తో కాదు ........

అది  ఆ రకం గా శ్రీరాముడికి మనం దగ్గరవ్వాలనే తత్త్వం ఇక్కడ చెప్పబడింది ....!!!!
ఈ కీర్తన చదివి అర్ధం చేసుకుంటేనే మనం ఒక అనుభూతిని పొందగలం ...!!!

ఇక ఐదవది అందరికి సుముఖమయినది ...!!
ఎందఱో మహానుభావులు ...అందరికి వందనములు 

ఎందఱో  మహానుభావులు ......వారంతా ఎవరు ?
అసలు ....రాజులా ? పండితులా? సకల కళా వల్లభులా ? సకల విద్యావంతులా ???

వీరెవరు కాదట..
అసలిన మహానుభావులందరూ ఎవరంటే ...
శ్రీరాముని పదాలు శరణనే వారట 
ఆయన ఈ విధం గా అంటారు .....
మానస వనచరవర సంచారము సలిపి
మూర్తి బాగుగ బొడగనెడు వా రెం...

సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము జేయు వా రెం...

పతితపావనుఁడగు పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజమా
ర్గముతోను బాడుచును సల్లాపముతో
స్వరలయాది రాగముల దెలియు వా రెం...

హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్తకోటు లిలలో
తెలివితోఁ జెలిమితో గరుణ గల్గి
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా రెం...దారో మహానుభావులు ..



ఎంత గొప్పగా చెప్పారు కదా............!!!!!! 
ఇలాంటి మహత్తరమయినవి ఆయన కలం నుండి జాలువారినవి  ఎన్నెన్నో ....
ఉన్నాయి ....
వీటన్నిటి ని విస్మరించి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోలేక  తప్పటడుగులు వేస్తున్నారు ఈతరం యువత ...
ఇపుడే ఇలా ఉంటె ఇక పోను పోను ఎలా  ఉంటుందనే విషయం తలచుకుంటేనే ఈ ప్రపంచం లో బతకడం నరకం 
అయి పోతుందేమో అనిపిస్తోంది నాకు .....

నా అంతరార్ధం ఏంటంటే పిచ్చి పిచ్చి ఆలోచనలకి మనం బానిస అవ్వకుండా ఉండాలి అంటే ....మన ఆలోచనలు మన పరిధి లో ఉండాలి ..అలా సాధించాలంటే   మంచి ని వెతుక్కుంటూ మనం  వెళ్ళాలి ...చెడు దానంతట అదే మనల్ని  వెతుకుతుంటుంది .............జీవితం అన్నాక మంచి చెడు లు సమ్మేళనం ...చెడుకి పోయి అసహ్యమయిన స్థితి ని తెచ్చుకోకుండా ....ఆత్మానందాన్ని అందరు పోన్దినప్పుడే ఈ జీవితానికొక అర్ధం పరమార్ధం ఏర్పడతాయి ...!!!!
అలాగే నేను ఇవే చూడమని అనట్లేదు ...ఉదాహరణకి ఇలా చెప్పను అంతే ...మంచి గా ఉంటూ ,మంచిగా పనులు చేసుకుంటూ పోతున్న ఒక మనిషి ఒక సముద్రం లాంటి వారు ....సముద్రం లో ఎన్ని నీటిచుక్కలు కల్తివి పడినా   సముద్రం రంగు మారదు గా ........!!
<మంచి  అంటే  దేవుడికి  సంబంధించినది కనుక  అలా అన్నాను అంతే..ఎవ్వరిని ఉద్దేస్యించినది కాదు  >
అందుకే మనం వెలుగుతూ అందరి మనసులలోనూ ఆనంద జ్యోతుల్ని వెలిగిద్దాం .....!!
అందరం సృష్టి  లో ఉంటూ దుడుకుతనాన్ని తగ్గించుకొని మనకోసం కాకుండా పక్క వాళ్ళ కోసం ఏదయినా సాధించి జీవితం చూస్తూ చూస్తూ ఉండగా మాదుర్యమయి మహానుభావులవ్వాలని మనస్పూర్తి గా ఆకాంక్షిస్తూ .......

--  సీత...










4 comments:

  1. అబ్బా.. ఎంత చక్కగా రాసారు.....

    నిజమే ఇవన్నీ ఒప్పుకోవడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు.....!!
      మంచిని ఆదరించే వాళ్ళే కరువైపోయారు .

      Delete
  2. chaalaa baagaa vraasaaru.
    mee blog lo naaku nachina post idi (nenu choosinanta varaku)

    ReplyDelete
    Replies
    1. thank you very much jahnavi gaaru...........
      idi naa modati post.
      nijam gaa sangeetam lo ne antaa undi ani cheppadaniki intaku minchina udaharana ledu

      Delete