Tuesday, 17 January 2012

అవసరాలు చాలిద్దాం ...ప్రేమ ను సాగిద్దాం ..ఆనందం తో జీవిద్దాం .....

మనిషి కి మనిషి కి  మధ్య ఉన్నది  ప్రేమ లేక అవసరమా  ??

ఈ రోజుల్లో మనుష్యుల మధ్య ఉన్నది ప్రేమ కాదు అవసరం  అనే  అనిపిస్తోంది ......
ఎందుకిలా జరుగుతోంది మన పాత కలం ఎలా ఉండేదో తెలుసా...??

ఏదయినా ఒక చిన్న ఫంక్షన్ లాంటిది జరిగింది అనుకుందాం .....ఆందరూ వచ్చే వాళ్ళు పాటలు పాడే వారు, ఆటలు ఆడుకునే వారు ఎంత సరదాగా ఉండేదో అని  అమ్మమ్మ లు , బామ్మా లు చెప్తుంటే  అబ్బా !! అనిపిస్తుంది  నాకు .
ఇప్పట్లో అయితే ఏమి లేవు ...!!

అప్పుడెప్పుడో మా అమ్మమ్మ చెప్పింది  నన్ను నిద్రపుచ్చుతూ ...

సీత , మా చిన్నప్పుడేలా ఉండేదో తెలుసా ...!!!ఏదయినా చిన్న సందర్భం లేదా పండుగ అయినా చాలు మేము (అంటే అమ్మమ్మ,ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు అనమాట ) అంతా కలిసి వెళ్ళేవాళ్ళం ఎంత సరదాగా గడిపే వాళ్ళమో ...
మా మధ్య అసలు ఏ  కల్మషాలు ఉండేవి కావు .....!! పెద్ద చిన్న అందరం కలిసి భజనలు చేసేవాళ్ళం , ఏదయినా తెచ్చుకుంటే అందరం సమానం గా పంచుకునే వాళ్ళం... పండుగ వస్తే చాలు గోరింటాకులు, తలస్నానాలు  పక్కింట్లో ఉండే పిన్ని పెట్టే బొబ్బట్లు ,ఎదిరింట్లో ఉండే అత్తా పెట్టే  అరిశలు  ఆరగించడానికి ఎలా తొందర తొందర గా ఉండేదో తెలుసా ....!!!!! అక్కచెల్లెళ్ళు కొట్లాటలు , అలకలు, నసలు తీర్చడానికి తాతలు దిగోచ్చేవారు  .... ఇక అన్నలు అయితే చెల్లల్లకే సపోర్ట్ చేసేవారు.ఎంత బాగా చూసుకునే వాళ్ళో . అన్న ని అటు ఉంచితే  వదిన లయితే కన్నా తెల్లుల లాగే ఆదరించేవారు .ఇక అబ్బాయి లయితే రోడ్ లంతా వారివే అన్నట్టు పరిగెత్తే వాళ్ళు ఇంట్లో భజనలు పూజలు అన్నిటి సహాయం చేసే వారు . అంటా ఎంత చెక్క గా ఉండేదో అసలు  అయితే అందరు కలిసి ఉండేవాళ్ళు. ఒకరికేవరికయినా పెళ్లి ఐపోయింది , అప్పగింతలప్పుడు అయతే   అవతల భార్హ్త ని , అత్తమమాలని కుడా ఎదిపించేసేవారే ........

అలా ఉండేవి మా రోజుల్లో ప్రేమలు అని ప్రేమ గా తల నుమిరంది .

ఆ స్పర్స నాకిప్పటికీ  జ్ఞాపకమే ....ఒక  జాలి మీకివేమి తెలీవు అని చెప్పలేక అలా  నేనిరినట్టుంది అనిపించింది .

అప్పుడు సీత మనసు ఇలా ఆలోచించింది .....

అవును నిజమే కదా మేమేం అనుభవించాం బిజీ బిజీ స్కూల్ లు, తీరిక లేని కాలేజీ లు  తప్ప అనుకోని ఇంకా ఆలోచించింది .చిన్నప్పుడు ఎప్పుడో 5 సంవత్సరాలు అంతే ఆడింది   .ఆ తరువాత వీపు కి ఇంత పెద్ద మోతలు తప్పితే ఒక ఆటా, ఒక పాటా....!!అనుకుంటూ  ఉండగా ఒక స్నేహితురాలు ఎదురయ్యింది బాగున్నావా అంటూ .......
హాహా .....ఎన్ని రోజులిందే ఇలా కలుసుకొని ఊరి కోచ్చానని  ఇప్పటికి అయిదు సార్లు చెప్పి పంపాను .౩ సార్లు వచ్చి వెళ్లాను . రావచ్చు గా అని అడిగాను .సరే లేవే అంటూ మాటల లోకేల్లిపోయాం . ఆప్పుడర్ధమయ్యింది దాని మనసు అది నన్ను ఒకటి అడగడానికి వచ్చిందని , నిజం గా చూదదానికోచ్చిందేమో అని సంబర  పడిపోయాను . అంతకు ముందు మా ఇంట్లో వాళ్ళ లా సీత అని ప్రేమ గా పిలిచేది ఇప్పుడా పేరు కుడా కాదు .ఎంత సంవత్సరం తరువాత కలిస్తే మాత్రం పేరు కుడా  మర్చిపోయి ఇలా వెరే పేరు అంటోంది నాకిష్తం లేనిది . తను నన్ను ఏదో అడగాలనుకుంది ,అడిగింది, తీసుకుంది ,
వేల్లిపాయింది .సరే ,౩ రోజు లాగి నేను ఊరికేల్తున్నానని వాళ్ళింటికి చెప్పదానికేల్లా .వచ్చింది ,వస్తాను అని చెప్పా .
అవసరం ఉంటె నే వస్తా లే నువ్ ఊరికే అలా చెప్పి పంపీకు .ఇంకా వెళ్ళు అన్నట్టు గా చూసింది . నాకు కల్లల్లోనుంచి ON SPOT నీళ్ళు వచ్చేసాయి . ఎలా ఉండే వాళ్ళం అసలెలా అయిపోయాం అనుకోని వెళ్ళాను ఇంటికి  .

మళ్ళి అమ్మమ్మ చెపిన ఆలోచనలు ...........ఏంటబ్బా..!!! అప్పట్లో అలా ఎలా ఉండేవాల్లో అనిపించింది ...!!కాని , ఇప్పట్లో పెద్ద చిన్న తేడాలు లేవు ,పెద్ద వాళ్ళు ఉన్నా వాళ్లతో కలసే ఉదారత  వాళ్ళకి లేదు .అందరు పెద్దవాళ్ళే నా వయసు వల్లెవ్వరూ లేరు అని నసుక్కుంటూ  మనమే ముసలి తనం ప్రదర్సిస్తుంటాం ..!! ఏం వాళ్ళతో మేము కలవలేమా ..?? హాయి గా ఉండలేమా ..?
ఉండగలం ,ఉండగలిగే వాళ్ళం కాని ఇప్పుడున్న పరిస్థుతులలో  కాదు .....మనందరికీ ఎంజాయ్మెంట్ కావాలి .ఇప్పుడు ఎదిరింటి పిన్ని లేదు, పక్కింటి అత్తా లేదు ..... అంతా పాష్...ఆంటీ ,అంకుల్ అంటూ తెగ తిరిగేస్తుంటాం ...సొంత వాళ్ళని కుడా మరీ దారుణం గా ...!! అదే అవసరం వచ్చిందా పిన్ని ని అమ్మ నయినా చేయగలం ..!! మనం అంత సమర్దులమే కదా అనిపించింది ..!! ఇప్పుడు అందరికి స్వార్ధాలు అయిపోయాయి ..

మొన్న మా బంధువుల ఆంటీ ఒక ఆమె ఉంది ....ఒక  ఫంక్షన్ అయితే అది చూసుకొని వాళ్ళింటికి వెళ్లాం ...!! మా పిన్ని ,ఎందుకు రాలేదు అని అడిగింది ..?
ఆమె సమాధానం ఏమిటో తెలుసా ??

"మా బాబు కి halfyearly exams . నేను చదివించుకోవాలి . "
నేనయితే అబ్బో ఆనుకున్నా....!!!
ఎందుకంటారా?
వాళ్ళబ్బాయి చదివేది U.K.G కనుక .....!!!..
ఏం చేస్తాం మనిషి కి మనిషి కి సంబంధం తెగిపోతుందనడానికి  ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏది ఉండదు ..!!!
relations maintain చెయ్యాలి ...నా ఉద్దేశ్యం  లో  కోట్లు సంపాదించినా ,వాడికి ఆప్యాయం గా మాట్లాడే భార్య లేకపోతె వాదంత దరిద్రుడు ఈ ప్రపంచం లో ఉండదు.అదే relation కి  అర్ధం అనుకుంటూ ... 
ఆట ల్లేవు ,పాట ల్లేవు     పక్కింటి అబ్బాయి చూడు ఎలా చదివేస్తున్నాడో ...నీకు rank వెనక్కి వెళ్ళిపోతుంది అని పిన్ని చెల్లెల్ని తిట్టే తిట్లు వింటూ ....ఎమవుతుంది ఒక వేళ తగ్గాయి అనుకో ??వచ్చినా ఒరిగేదేమీ లేదు .ఏదో పోటి అంతే.....కదా అనుకున్డ్ని సీత మనసు.

ఇక పండుగలు ,పబ్బాలకి కలిస్తే కదా.......అసలు ఎవరికేవరో ముఖాలు తెలుసు అంతే ..!!అవసరం వస్తే బంధాలు గుర్తు వస్తాయి. నాకు ఫ్రెండ్స్ చాల మండే ఉన్నారు .కాని ఏ అవసరం లేకుండా ఆప్యాయం గా పలకరించే వాళ్ళు ముగ్గురు ఉన్నారు.అవసరమొస్తే డార్లింగ్ అన్న పదాలు వస్తాయ,మామూలుగా కనీసం మాట్లాడను కుడా మాట్లాడారు పక్కన ఉన్నా...అలాంటి వాళ్ళు కుడా ఉన్నారు ....!!
వాళ్ళ గురించేందుకు కాని, ఇప్పట్లో  అన్ని రెడీమేడ్ ఏ ........ఆప్యాయత ని కుడా అద్దె కిస్తాం అని బోర్డు పెడితే బాగుండు ..అవసరమయినంత సేపు ఒలకపోసి ఆపెయ్యచ్చు ..!!ఈ సెల్ ఫోన్ లోచ్చాక మరీనూ...

ఇప్పుడు పెళ్లి అయితే  అమ్మాయి పుట్టింటి గోల వదిలింది ఇంక, అత్తారింటి ని మెల్లి గా వదిలించుకుంటే హాయి !!
అనుకుంటుంది కొత్త కోడలు .....!!!! కాదని ఎవ్వరు చెప్పలేరు ....!! కాని సమర్దిన్చుకోగలం .!
"కలిసుంటే కలదు సుఖం" అని మర్చిపోవద్దు ....!!
ఈ కాలం స్నేహలన్ని స్వార్ధాలే .....

నా మనవి ఏంటంటే ,
అందరితో ప్రేమ గా ఉందాం ...ఆప్యాయత ని మనసు లోంచి అందిద్దాం  ....సమస్య ఏదయినా ప్రశాంతం గా ఆలోచిద్దం ...సాటి వాళ్ళ కి ఎపుడూ,ఎల్లపుడూ సహాయం చేద్దాం .......!!! ఒక మంచి వ్యక్తి తో ఒక హాయ్ అన్న మాట ఎంత తృప్తి నిస్తుందో  నిజం గా....................
అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు ..కాని బయటపడరు.మీరే వెతకండి ...అలాంటి వ్యక్తి ఒక్కరున్నా మీ జీవితానికి అంతకు మించిన అనుభూతి ఉండదు .స్వార్ధాన్ని విడుద్దాం ....ఎవరు స్వార్ధం గా ఉన్నా మనకనవసరం మనం మంచి గా ఉందాం అందరితోటి ....
ఇలా ఉంటే అప్పడు మన ప్రపంచం అనేది అవసరం అనే పేరు మీద కాదు ...ప్రేమ అనే పేరు మీద నడుస్తుంది .....

ప్రేమ తో నిండిన సమాజానికి ఇప్పుడే స్వాగతాన్ని పలుకుతూ .........-- సీత(ఓ తెలుగింటి ఆడపిల్ల )

  

6 comments:

 1. మీరు చెప్పినవన్నీ నిజమే.. ప్రస్తుతం స్నేహాలు అన్నీ ఇలాగే తగలడ్డాయి...

  స్నేహంలో అవసరాలు ఒక భాగం మాత్రమే, అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే స్నేహాన్ని వాడుకోకూడదు అని ఎవ్వరికీ అర్దం కావడం లేదు..

  ఇక LKG పరీక్షలు,అని బంధువులుకు చెప్పడం గురించి నేను మే నెలలో ఒక పోస్టు రాసాను: http://namanasucheppindi.blogspot.com/2011/05/blog-post_20.html

  అందరితో ప్రేమ గా ఉందాం ...ఆప్యాయత ని మనసు లోంచి అందిద్దాం ...బాగుంది.

  ReplyDelete
  Replies
  1. అవును కరెక్ట్ గా చెప్పారు ...అందుకే ఇప్పటి పిల్లలకి కనీసం బంధువుల పేర్లు కుడా తెలేయడం లేదు ....
   బాల్యం అనేది తిరిగి రాదనీ వీళ్ళకి ఎలా తెలిసేలా చేయాలో అర్ధం కావడం లేదు ...ప్రస్తుతానికి ఎం చేయలేం ఇలా పోస్ట్ లు రాసుకోవడం తప్ప......
   and thank u very much..

   Delete
  2. thank u padmarpita gaaru...

   Delete
 2. స్నేహం,ప్రేమ ల ఫై మీ అభిప్రాయాలు అభినందనీయం మీ ఆలోచనా తీరు బాగుంది.స్నేహానికి మీరు ఇచ్చే ప్రాధాన్యత నాకు నచ్చింది.

  ReplyDelete
 3. రవిశేఖర్ గారూ...
  చాలా సంతొషం..!ధన్యవాదాలు అండీ...

  ReplyDelete