Saturday, 4 February 2012

నేను నా కృష్ణుడు ...
పొద్దున్నే లేస్తానా నలుగున్నారకి ఎదురుగా నాకుఇష్ట్తమయిన కృష్ణుడి బొమ్మ లేచావా అంటూ ఒక నవ్వు , లేచాను  అని చెప్పి ,అలా కింద చిమ్మి ముగ్గు వేద్దామని కిందకి వెళతానన్న మాట..నా చేతిలో చీపురు కట్ట .కింద లైట్ వేసుకొని చిమ్మడం  మొదలెట్టాక నా కళ్ళు  పైన కనిపించిన నల్లనయ్య ఈ వెలుతురు లో కనిపించడెం ? అని అడుగుతుంటాయి నా కళ్ళు  . నిన్న గురువుగారు చెప్పిన సీతమ్మ మాయమ్మ ,శ్రీరాముడు మాకు తండ్రి అని పాట పాడుకుంటూ,శ్రీ కృష్ణుడు గురించి ఇలా చెప్పలేదు   అని నవ్వుకొని ఇంక స్టవ్ మీద నీళ్ళు కాచుకుందామని పైకి వచ్చేసి స్టవ్ ఆన్ చేస్తానా తలుపు తీస్తాన చల్ల గా వచ్చే గాలి , పైన చందమామ ఇక టాటా అన్నట్టు గా చూస్తూ ఉంటాడు . అప్పుడు మా స్టవ్ వెనకాల ఉండే కృష్ణుడి క్యాలెండరు పైన టక టక అని ఇటు చూడు చందమామ ఒక పూట  వస్తాడు పోతాడు ,నేను ఇక్కడే నీతో నే ఉంటాను గా  అన్నట్టు గా పిలుస్తుంటాడు .ఏమిటీ అంటే...ఏమీ ఉండదు ....ఒక చిన్న నవ్వు ....!!!సరే అని ఇంకా తయారయ్యి అయిదున్నర కి బండి బయిటికి తీసి ఆ చలి లో బండి తీసుకొని లైట్ వేసుకొని మ్యూజిక్ క్లాసు కి బయలుదేరుతుంటే ......బండి మీద పాయింటర్ల మీద ఉండే కృష్ణుడు నన్ను చూసి పద పద...అని ఒక నిట్టూర్ఫు లా నవ్వుతుంటే , hmmmmm అనుకొని బండి కదిలించి అలా వెళ్తూ ఉంటె , ముందు గా రామాలయం నుండి వచ్చే సుప్రభాతం వింటూ ,అలా శివాలయం రాగానే  శివ శివ అంటూ వచ్చే స్తోత్రాలను దాటుకొని సాయిబాబా గుడి మీద గా సాయి సాయి నమో అని వింటూ అలా చల్ల గాలికి వణుకుతూ హమ్మ!! వచ్చేసాను  అనుకుంటూ  బండి కి లాక్ వేస్తుంటే నా బండి keychain పైన ఉండే కృష్ణుడు ఒక లా వేణువు పట్టుకొని నవ్వుకుంటూ ఉంటె , నీకేమి బాబు అని నేనని లోపలి వెళ్లి సంగీతం లో ప్రార్ధన మొదలు పెడతానా ...నాతొ ఉన్న ముగ్గురి సంగతేమో కాని , వినాయకుణ్ణి ,సరస్వతిని ,భూదేవి ని,త్యాగరాజు ని అందరిని తలుచుకుంటానే  కృష్ణుడి పేరు ఎందుకు లేదబ్బా అనుకుంటూనే క్లాసు మొదలయిపోతుంది .ఇంకా పాటలన్నీ పాడుతూనే చుట్టూ ఉన్న చెట్లు ని చూస్తూ ఉండగా ఒక రోజు ఒక సన్నని పిల్లగాలి మెడ ని తాకి ఇటు చూడు అన్నట్టు గా మొహం అటు తిరిగితే చెట్లన్నీ ఒకే రీతి లో ఊగాయి ....

అప్పుడే ఒక కీర్తన --ఏ రంగో నీ రంగు ఎవరికీ తెలుసు 
                       ఓ రంగ !నీ రంగు నీల వర్ణమనే తెలుసు  ...అని పాడుకుంటూ ఆకాశాన్ని చూస్తే నీలం గా ఉంది ..
ఓహో..!! ఇదే నా ! నా కృష్ణుడి రంగు అనుకుంటూ ఇంతలోనే 
రంగు రంగుల జీవులలో నీవై ఉన్నావు .. 
అని మా గురువుగారు  చెప్తుంటే ..మళ్ళి అదే తికమక ....అసలు క్రిష్ణుడిది ఏ రంగు అబ్బా అనుకుంటూ ఇంకో పుస్తకం 
తీసుకుంటుంటే పుస్తకం పై ఉన్న కృష్ణుడి బొమ్మ ..నా రంగు తెలుసుకోవడం నీ వల్ల కాదు లే పని చూడు అని ఎగతాళి గా నవ్వుతుంటే ...సరేలే పో...అనుకుంటూ అప్పుడు కానిచ్చి మళ్ళి ఇంటికి బయలుదేరుతూ దూరం గా  ఉన్న కృష్ణ మందిరానికి వెళ్దాం అనుకుంటూ గడియారం చూస్తే ఇంటికి పద పద ...కాలేజీ కి టైం అవుతోన్దంతుంటే ..సరే రేపోస్తాను లే కృష్ణయ్య అనుకుంటూ....బండి ని చూడగా దాని పైనున్న కృష్ణుడి బొమ్మ భలే వచ్చావు లే ,రెండు సంవత్సరాల నుండి అని నన్ను చూసి వెక్కిరింత గా నవ్వుతుంటే , తప్పు ఒప్పుకోక తప్పదు లే అని ఇంటికి సాగిపోయి ,టిఫిన్ చేసి రెడీ అయ్యి ,అమ్మ వెళ్ళొస్తా,బామ్మా వెళ్ళొస్తా  అంటూ మూడు మెట్లు దిగేసి  మళ్ళి అయ్యోరామ ..!!అనుకొని మళ్ళి వెనక్కి వచ్చి కృష్ణుడికి టాటా చెప్పి  కాలేజీ కి వెళ్ళిపోయి ,అక్కడ పాఠాలు బుర్రకేక్కించు కొని , 
hushhh హమ్మయ్య !!అనుకుంటూ సాయంత్రం ఇంటికోచేస్తా.

రాగానే జరిగిన సంగతులు,నా గతులు అన్ని కృష్ణుడి కి చెప్దాం అని రోజు ఆయన బొమ్మ దగ్గరికి వెళ్తానా...ఆ లోపే వచ్చావా ..మళ్లీ రా !!వినిపించు ఇంకా నీ మోత అన్నట్టు గా చెవులు చాచి కన్నులు పెద్దవి చేసి చూస్తే సరే వద్దు లే 
కృష్ణయ్య...అని దండం పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోతా.

సరే ఇంకా ఇంట్లో కబుర్లు చెప్పుకొని నాకో చిన్న పెట్ ఉన్నాడు . మా పిన్ని కొడుకు నా బుల్లితమ్ముడు .వాడితో ఆడుకున్నంత సేపూ కృష్ణుడు ఇలానే ఉంటాడా!! అని అనిపింఛి కొని ఏమోలే అనుకోని .మళ్లీ వాడిని నిద్రపుచ్చి ఇంటికి వెళ్ళగానే , మా బామ్మా దేవుడి దీపం పెడితే దణ్ణం పెట్టుకొని హారతి తీసుకొని వెళ్తుంటే మళ్లీ టాకాటాకా మని కృష్ణుడు బొమ్మ చూస్తే ...ఏంటో కృష్ణ !!ఈ జీవితం మళ్లీ కాలేజీ వర్క్స్ చేసుకోవాలి అని చెప్తే సరే కాని చెయ్యి నేను సహాయం చేస్తా లే అని ఒక ధైర్యన్నిచ్చే నవ్వు చూసి కొంచం సేపు చదువుకొని ,మళ్లీ ఈ కంప్యూటర్ ఆన్ చేయగానే desktop మీద మళ్లీ చిన్న వాడయిపోయి వేణువు ఊదుతూ ,కనిపించగానే ...వచ్చావా అని ఆ నవ్వు కి వచ్చాను అని సమాధానం చెప్పి పని చేసుకొని , అన్నం తినడానికి  పిలుస్తుంటే ఇక్కడున్న కృష్ణుడికి టాటా చెప్పేసి అన్నానికి వెళ్లి కూర్చొని ఉంటె  టీవీ పైన ఉండే కృష్ణుడు నాకు పెట్టావు కదా?అని గోము గా నవ్వుతుంటే .....ఇది వెన్న కాదు కృష్ణయ్య ..అన్నం అని నేను చెప్పి ,అక్కడికి ముగించి  వెళ్ళిపోతా.మళ్లీ ఇంకా పడుకోవడానికి కింద  చాపలు వెయ్యమని అమ్మ చెప్తే వేసి పడుకుంటే  పొద్దున్న లేచావా అంటూ పలకరించిన కృష్ణుడు వచ్చి బాగా అలసిపొయావు లే ఇక పడుకో అని ఆ చెయ్యి పైకెత్తి అలా నవ్వితే మళ్లీ జయజనర్ధన కృష్ణ అంటూ పాడుంటూ పడుకుంటే రాత్రి కలలోనయినా వదులుతాడా ? ఈ కృష్ణుడు అంటే ...అబ్బే!!అస్సలు వదలడు. కలలు ఎన్ని వస్తాయో కృష్ణుడి గురించి ....

అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది... 
భగవంతునికి భక్తునికి అనుసంధానమయినది అంబిక దర్బార్బత్తి కాదు ...
ఒక చిన్న నవ్వు అని..ఆ నవ్వే మన జీవితాలని వెలిగించే కొవ్వొత్తి అని 


ఇప్పుడు నాకొక పెద్ద సందేహం .ఎవరయినా తీర్సుస్తారా ??ప్లీజ్............
నేను కృష్ణుడిని వదలట్లేడా లేక కృష్ణుడు నన్ను వదలట్లేడ్డా??
నేను కృష్ణుడిని నాతొ  ఉంచుకున్నానా  లేక తనే నాతొ ఉండిపోయాడా ??


మీరయినా  చెప్పరూ ప్లీజ్.................
--సీత ...


4 comments:

 1. మనసు ఆ కృష్ణయ్య వశం అయిపోయినపుడు అంతే కదా మరి...

  నేను కృష్ణుడిని వదలట్లేడా లేక కృష్ణుడు నన్ను వదలట్లేడ్డా??
  హహ.. బాగుంది మీ ప్రశ్న... తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తారా?

  ReplyDelete
 2. మీ కృష్ణ ప్రేమ బాగుంది సీత గారూ!
  మీ మనసులో కృష్ణుడు ఉన్నపుడు
  మీ సందేహించనవసరం లేదండి సీత గారూ!.......@శ్రీ

  ReplyDelete
 3. సీత కు రాముడు కదా కావలసిందీ ! అంతా కృష్ణ మాయండీ.. సీతగారూ ! నిత్యం కృష్ణానందం ! అయినా పైన సాయి గారు చెప్పారుగా ..."తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తారా?" అని .

  ReplyDelete
 4. హహా బాగున్నాయండీ మీ సమాధానాలు...చాలా సంతొషం ...!
  మీ సీత

  ReplyDelete