Tuesday 10 April 2012

థాంక్ యూ మిత్రమా....నీ మేలు మరచిపోలేను....


మా అన్నయ్య పెళ్లి నేను ఇంకా మా  బంధువులూ,నరసరావు పేట కి వెళ్ళాము పొద్దున్న తొమ్మిది కి  అందరమూ పెళ్ళి నుండీ బయలుదేరి కొటప్ప కొండ కి వెల్తున్నాం. అక్కడ సగం మంది youth అందరమూ నడుద్దాం అనుకున్నాం.బాబాయి,మామయ్య,5 మంది అమ్మయిలమూ ,7 మంది అబ్బాయిలూ సగం కొండ ఎక్కేసాం.అంత లో ముగ్గురు దొంగలు వచి నా బగ్ లాగారు నెను ఇవ్వకపొయేసరికి నన్ను ,ఇంకొక అక్క ని ఒకడు కత్తిపెట్టి లాక్కెల్లాడు.వాళ్ళంతా బాగా తాగేసి ఉన్నారు. ఏవ్వరూ ఏమి చెయలెకపొయారు.నేనేమొ భయం గా అరుస్తూ ,ఏద్చెసాను. ఇంక అందరూ వెనకాల నుండీ వస్తున్నరు గానీ ఆ కత్తి ని చుస్తూ వెనక్కెల్తున్నారు.....పాపం అందరికీ భయమే.మేమేమో ఒకటే ఏడుపు.ధైర్యం చేసి మా అన్నయ్య ఒక అడుగు వెసినా, వాళ్ళు చేతి కి కొద్దిగా ఘాటు పెట్టడం తో గమ్ముగా ఉండిపొయాడు. ఆంతలో పైన చెట్ల మీద నుండీ 3 కోతు లు వాళ్ళ మీద పడి, నన్ను విడిపించాయి.నేను అక్క ని లాక్కొచ్చాను.  వాళ్ళ చేతుల మీద పడి కొరికి నన్ను రక్షించి మా అందరి వెనకాలా గుడి కి వచ్చాయి..చుడండి... 
ఏన్ని ధన్యవాదాలు చెప్పితే  నీ మేలు తీరుతుంది .....
ఏమి కాని కోతులు మాత్రం మనకి సహాయం చేస్తాయి...
మనుష్యులు మాత్రం పక్కగా నాకెందుకు లే అని వెళ్ళిపోతారు....

అందుకే ఇలా ధన్యవాదాలు చెప్తున్నా మీ అందరి సాక్షి గా...



థాంక్ యూ మిత్రమా....నీ మేలు మరచిపోలేను....


--సీత.....*

12 comments:

  1. సీత గారు.. ఇదంతా నిజమా ?

    నిజమే.. ఆ మిత్రులకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేం..

    నమ్మిన వాళ్ళను ఎప్పటికీ కాపాడుతాడని ఆ త్రికూటేశ్వర స్వామి రుజువు చేసాడు........

    ReplyDelete
    Replies
    1. అంతా నిజమే సాయి గారు..!! అలా జరిగిపొయింది ఏం చెస్తాం.ఇప్పుడు అంతా ఓకే.
      థాంక్యూ.ఆ దేవుణ్ణి నమ్మిన వారిని ఎప్పటికీ వదిలేయడు..

      Delete
  2. చాలా సినెమాటిక్ గా ఉందండీ మీ ఈ అనుభవం. అప్పుడప్పుడూ ఇలాంటివి చాలా డ్రమాటిక్ గా జరుగుతుంటాయి. మిమ్మల్ని రక్షించటమే కాక మీకూడా ఆలయానికీ రావటం, నిజంగా అప్పుడప్పుడూ దేవుడు ఇలానే వస్తుంటాడంటారా?

    ReplyDelete
  3. @శేఖర్ గారు

    థాంక్యూ .జై హనుమాన్

    @చిన్నీఅశ గారు

    డ్రమాటిక్ గా జరుగుతాయంటే నేనస్సలు నమ్మేదాన్ని కాదు.కానీ అనుభవానికొచ్చాక తెలిసింది .

    ఇంక అంతే కదండీ.ఎవరో పంపినట్టు అప్పటి దాకా చెట్ల మీద ఉన్నవి పైన పడి రక్షించాయి అంటే ఇంక దేవుడే వాటిలా వచ్చాడు తొడు గా..
    మేము సినిమాలలూ చూసి ఎంటో అనుకునేవాళ్ళము.అనుభవం లొ కొస్తేకానీ తెలియలేదు.
    జై హనుమాన్

    ReplyDelete
  4. exciting .. God is Great..Jai Hanumaan.. Namah sivaayanamah

    ReplyDelete
  5. vanaja gaaru...
    yes god is great...

    ReplyDelete
  6. seeta gaaru...
    inta jarigindaa....!!really excited
    jai hanumaan,

    meere janma lono vaatiki sahaayam chesuntaaru avi mee runam ilaa teerchukunnayemo seeta gaaru,

    maa seeta gaarini kapaadina mitrulaki...maralaa jai jai jai

    ReplyDelete
  7. సీత అని పేరు పెట్టుకున్నారుగా అందుకే సాయం చేసుంటాయి :)

    వ్యాస మహర్షి జన్మ వృత్తాంతం తెలియజేసినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. నాగార్జున గారు
      నా పేరు సీత అని వాటికి తెలియదనుకుంటానండీ...!!

      చాలా ఆనందం మీరు నా బ్లాగ్ కు విచ్చెసినందుకు.
      ధన్యవాదాలు.

      Delete
  8. @ఫోటాన్ గారూ
    welcome to my blog.
    god is great ..
    thank you.

    ReplyDelete