Wednesday 25 January 2012

అబద్దం మొద్దు అది మనకి వద్దు ..అందుకే ఎప్పుడూ నిజమే ముద్దు ....

అబద్దపు ప్రపంచం ......

అబద్దం అనే పేరే వినడానికి ఒక లా ఉంటుంది ...మనం ఒకళ్ళతో ఈజీ గా అనేస్తాం ...అదే ఇంకెవరయినా మనతో ఆడితే సహించలేమే ....!!
అసలు అబద్దాలు ఎందు ఆడాల్సి వస్తోంది ?ఇది మన మనసుతో మనం వేసుకోవాల్సిన ప్రశ్న...? ఒక్క సారి పరీక్షించుకుందాం ...!!
ఈ సందర్భం లో ఒక చిన్న విషయం చెప్పాలి ...
మొన్నా మధ్య నేను మార్కెట్ లో  కూరగాయలు కొంటుంటే ..నా పక్కన ఆంటీ కనిపించారు ...బాగున్నారా అంటూ పలకరించాను ....ఆమె మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ...చూసి చాలా రోజులయ్యింది ఇంటికి రావచ్చు కదా అనింది.
 వస్తాను  అని చెప్పను . ఆ బయటే అంకుల్  బైక్ మీద వెయిట్ చేస్తున్నారు సరే అని ఆంటీ వెళ్ళిపోయారు అప్పటికే వాళ్ళ అమ్మాయి (అదే నా ఫ్రెండ్ ) తో సెల్ ఫోన్ లో చాటింగ్ అప్పుడే హాయ్ చెప్పింది  ...basical గా సెల్ use చేయడమంటేనే విసుగయిన  పని నాకు..!!
సరే అని హాయ్ చెప్పాను...ఎలా ఉన్నావ్ ?ఎం చేస్తున్నావని అడిగాను ...అప్పుడు తను ఏమి చెప్పిందో తెలుసా...?
'
హాస్పిటల్ లో కూర్చొని ఉన్నాను సీత ....మనసంతా చాలా బాధ గా ఉంది ...అమ్మ కి ,నాన్న కి మలేరియా అని ....
నేను షాక్ అయిపోయాను  !!!!..రెండు నిమిషాలు ఏమి అర్ధంకాలేదు ...
అదేంటి ఇప్పుడే గా ఇద్దరు నా ముందు హాయి గా బండి మీద వెళ్ళారు అనుకోని సరే అని ఆ షాప్ ఆయన పిలిచే సరికి అప్పటికి వదిలేసి ఇంటికి వచ్చేసాను . కాని అదే షాక్ లో ఉన్నాను ..ఆ షాక్ లో మైండ్ కుడా పని చెయ్యక ఒక ఆటో ని గుద్దబోయి ఎలాగో తప్పించుకున్నాను....!!!
ఆ రోజంతా అదే ఆలోచన .....తనకి ఏమొస్తుంది అలా అబద్దం ఆడితే ??
ఆనందమా ....?సరే కాసేపు ఆనందమే అనుకుందాం ......ఎంత సేపు ఉంటుంది అది...?ఆ మాత్రం తెలుసుకోలేనంత అమాయకురాలేమి కాదే..!!!ఆనందం కాక...ఎదుటి వారి నుండి జాలి పొందాలనుకున్నదా??
నేను జాలి చూపిస్తే తన కోరిగే దేమిటి?అదీ అర్దంకాలేదు .....చేసేదేమీ లేక గమ్ముగా కూర్చున్నాను ..నా ఫ్రెండ్స్ లో కుడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసుకున్నాను...!!!అయినా ఇంట నీచమా మన వాళ్ళ మీద మనమే అబద్దం చెప్తామా ............ఇదేమి ఖర్మ భగవంతుడా ....అనుకున్నాను .ఇదే విషయం నాకు బాగా తెలిసిన ఒక మంచి ఫ్రెండ్ తో చెప్పాను  కుడా ...కాని నా confusion మాత్రం తీరలేదు .అసలలా చెప్తే ఏమొస్తుంది ??

ఇంకో ఉదాహరణ ఏంటంటే , పాపం మా ఫ్రెండ్స్ కొందరు హాస్టల్ లో ఉంటారు ..వాళ్ళు ఎక్కడికయినా సేమినర్స్ కి పేపర్స్ పంపమంటే  "నాకు ఇంట్లో నెట్ రాదు "అని భలే తప్పించుకుంటారు ...కాని సాయంత్రం ఇంటికి రాగానే నెట్ తప్ప వేరే పని ఉండదు ...ఇక్కడ చెత్త ఆంతా చాటింగ్ లు  చేసుకోవడం పక్క రోజు అవి చెప్పుకొని నవ్వుకోవడం ....!
ఏమొస్తుంది దానికి  వాళ్ళకి  ? 
నేనయితే ఒక్కటే చెప్తాను ...."అబద్దమయిన   ఆనందం " తప్ప .ఇది దేనికి పనికిరాదు ..పాపం వాళ్ళను చూస్తే నాకు అదే అనిపిస్తుంది...ఏంటో మనుష్యులు అని...
ఒక్క అయిదు నిముషాలు స్నేహితుల కోసం కేటాయించకపోతే ఇంకెందుకు మనం ?? ఆలోచించాల్సిన విషయం కదా........(అనవసరమయిన హెల్ప్ అయితే వద్దు ...మంచి హెల్ప్ అయితేనే చేద్దాం )....
ఏమిటో మనుష్యులు అనిపిస్తోంది కదా...!! ఎం చేద్దాం చెప్పండి .........!!!!

కనీసం ఒకరిని మార్చాలి అనే దృక్ఫథాన్ని ఆపుకొని మనం మారడం మంచిదని నా అభిప్రాయం....!! 
అబద్దపు ప్రపంచం లో బ్రతకడం కష్థం అంటారా? ఆలోచించండి ....ఒక్క మాట , మన అనుకునే వాళ్ళకి కుడా అబద్దం చెప్పుకుంటూ పోతే ఇంకెందుకు మన జీవితం ?? 

ఎం ? మనకంటూ మనం కొన్ని నియమాల లాంటి గోడలు కట్టుకోలేమా ??
ఖచ్చితం గా  కట్టుకోగలం ...అసలు అబద్దం ఆడితే ఎలాంటి పరిమాణాలు వస్తాయో తెలుసా....
మనకి పుట్టుక తో వచ్చిన divinity power అనేది ఉంటుందట ఆ లెవెల్స్ తగ్గిపోతాయి ...మనం మన వెనక్కి  తిరిగి చూసుకుంటే అబద్దం తప్ప ఏమి ఉందని స్టేజి కి దిగాజారిపోతాం .....ఆ స్టేజి మనకి వద్దు ....అందుకని ఎవ్వరు అబద్దాలు ఆడకండి ...అలా చేస్తే సత్యమయిన ఆనందాన్ని పొందుతాం అలా చేస్తే సత్యం అనే మార్గం లో నే భగవంతుడిని చేరుకోగలం ...


ఎవరితో అయినా అబద్దం ఆడినా వెంటనే చెప్పేద్దాం ....
maximum అబద్దం అనే మాట ని avoid చేద్దాం ....
నిజాలు ఖటినం గా ఉన్నా అదే చెప్పేద్దాం ....
అప్పుడు నిజమయిన స్వర్గం అంటే ఏంటో స్ప్రుసిద్దాం ....
అప్పుడే ఒక తృప్తి వస్తుంది...ఆ తృప్తి లో నుండి  ఒక ఆనందం ...
ఆ ఆనందమే జీవితానికి ఒక తియ్య దానాన్ని అందిస్తుంది .....
ఆ తియ్య దానమే పువ్వులోని మకరందం అయితే దాని కోసం ఎన్ని పక్షులు వాలతాయో ....అలాగే మన జీవితం లో కి మనల్ని అభిమానించే వ్యక్తులు మన చుట్టూ వచ్చి వాలతారు ......!!మనుష్యులుంటే మనకి ఆనందమే కదా......!!!
ముఖ్యం గా మన అనుకున్న వాళ్ళని జయించడానికి ఉండే ఒకే ఒక ఆయుధం నిజం...సత్యం ...
దానితో మనుష్యులనే కాదు మనసులని కుడా జయించచ్చు ...వారిని మన దరికి చేర్చుకోవచ్చు....మనం మనం గా వారికి దగ్గరయితేనే  కదా మనకి ఆనందం వారికి ఆనందం ...

అందుకనే 

it is better to be silent than telling lies to friends.because the only word that have a power to break friendship is a "LIE".don't play it..with anyone..especially with your dear ones ....

అబద్దం ఒక  మొద్దు ..
అది జీవితానికి ఒక హద్దు ...
ఆ హద్దు దాటేస్తే జీవితం ఏంటో ముద్దు...

మన వారి దగ్గరయినా హద్దులు దాటాక పొతే ఎలా ?
మరి ఆలస్యం ఎందుకు ...?
ముద్దు ముద్దు గా జీవితాన్ని ఆస్వాదిద్దాం ....



ఒక చిన్న మనవి తో ...

--మీ సీత .......

6 comments:

  1. అబద్దం.. అనేది అందరి జీవితాలలో ఒక భాగం అయిపోయింది..

    నిజం చెప్పడం అనేది కూడా చిన్నప్పటి నుండి అలవడవలసిన గుణం.. ఏం చేస్తాం, ప్రస్త్తుతం నిజం చెప్పే వాళ్ళే కరువయ్యారు..

    ఎదుటి వాళ్ళు చెప్తున్నది అబద్దం అని తెలిసినా కానీ అది అబద్దం కదా అని చెప్పగలిగిన ధైర్యం కూడా మనకు లేదు.. దానికి అనేక కారణాలు ఉంటాయి..

    చాలా బాగుంది.. దీనివల్ల కొందరైనా మారితారని ఆశిస్తూ....

    ReplyDelete
    Replies
    1. అవును సాయి గారు...నేను అదే ఆశిస్తున్నాను ...
      thank u....!!

      Delete
  2. సీత పలికే.....
    అబధ్ధం గురించి నిజం!
    Good Post....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు పద్మార్పిత గారు..
      చాలా సంతొషం గా ఉంది ..

      Delete
  3. చాలా చక్కగా రాసారు.
    దీనివల్ల ఒక్కరు మారిన సంతోషమే.

    ReplyDelete
  4. sailabala gaaru,
    ధన్యవాదాలండీ..!!
    మీరు రావడం, చదవడం నాకు చాలా సంతొషం అండీ.!!

    ReplyDelete