Thursday 9 February 2012

గుర్తింపు అవసరమా?

ఒక చిన్న కథ చెప్పుకుందాం


ఒక ఊరిలో ఒక కుక్క ఉండేది .అది యజమాని ఇంట్లో నుండి బయలుదేరి వెళ్లి షాప్ లో యజమాని ఇచ్చిన చీటీ ఇచ్చి వస్తువులు నోటితో పట్టుకొని షాప్ వాడికి డబ్బులు కూడా ఇచ్చేసి,ఎదురుగా ఉన్న బస్సు స్టాప్ లో నిల్చొని అయిదు బస్సులు వచ్చి వెళ్ళాక తనకి కావాల్సిన బస్సు ఎక్కి నిల్చొని స్టాప్ లొచ్చి వెళ్ళాక అది దిగాల్సిన స్టాప్  దగ్గర దిగింది.ఇదంతా ఒక మనిషి గమనిస్తూ ఉనాడు.దానిని అనుసరిస్తూ వెళ్ళాడు. అది వెళ్లి తలుపు తట్టగా యజమాని వచ్చి తలుపు తీసి దానిని బెల్ట్ తో,కాలి తో కొట్ట సాగాడు .ఆ కుక్క ని అనుసరిస్తూ వచ్చిన మనిషి మాత్రం ఆ యజ మానిని ఆపి "మీరేం చేస్తున్నారు ?ఇది ఎంత తెలివయిన కుక్కో మీకు తెలీదు ."అని జరిగిందంతా చెప్పాడు.
దానికి ఆ యజమాని నాకు తెలుసు ఇది మళ్ళి ఇలానే చేస్తుందని ,ఇది పదో సారి వెళ్ళేటప్పుడు తలుపు కి తాళం వేసుకోమని చెప్పాను .కాని ఇది బంగారం లాంటి నా నిద్ర ని పాడు చేసింది అన్నాడు.
దానికి ఆ వ్యక్తి ఖంగు తిన్నాడు .

దీని వల్ల మనమేం తెలుసుకోవాలి అంటే,

నీకెంత తెలివితేటలూ ,టాలెంట్ ఎంత నువ్వు బయిటికి చూపినా నీ పై వాడు అది గుర్తించనప్పుడు అంటా వృథా ....
బూడిద లో పోసిన పన్నేరెఅ....అందుకే కనీస  గుర్తింపు  ఎవరికయినా  అవసరమే
..


సీత ....

3 comments:

  1. మంచి నీతి, కథ బాగుంది. ఎంత కష్టపడ్డా గుర్తింపు లేని మనుషుల మధ్య పాపం ఆ కుక్క అయినా ఏం చేస్తుంది, పనులు చేసీ తన్నులు తినటం తప్ప... ఆ అనుకరిస్తూ వచ్చిన మనిషన్నా ఎత్తుకుపోతే ఆ యజమాని నిద్ర పాడుచేసే వాడే ఉండదు కదా! కానీ తనతో తీసుకుపోతే పాపం తన్నులెవరు తింటారు? :(

    ReplyDelete