Sunday 19 February 2012

నా పూల తోట.. నా పూల తోట..


సన్నజాజి సన్న గా జారుకుంది...
మల్లె మత్తు గా మాయమయింది ... 

రోజా రాను రానంటూ రోదించింది ...
కనకాంబరం కెవ్వు మని కేకేసింది ...

కస్తూరి కావు కావు మని కాదనింది..
తామర చూస్తూనే తేలిపోయింది ...

మందారం ముద్దగా అయిపొయింది...
కలువ కాగితం లా తనని తానె కావలించుకుంది ...

ఏమయిందే అంటే , పలకవే ....
పక్కనే ఉన్న గోరింటాకు నడిగితే ,

"నన్ను నీ చేతికి అతికించినట్టు ,వాటిని నీవు నీ తల లో అలంకరించుకుంటా"వని భయమట అని అంది .
అప్పుడు సీత (నేను) నవ్వి  ,

అయ్యోరామ !! మిమ్మల్ని నా కోసం కాదు లే..
కృష్ణుడి కి అలంకరించడానికి అని అన్నానో లేదో ...
అంతే,

అన్నీ..ముందు నన్ను, ముందు నన్ను  అని  
విచ్చుకొని చుట్టూ ముట్టాయి....!!!!

--సీత ....

6 comments:

  1. భలే భలే...పువ్వులపై కవిత చాలా బాగుంది.. సూపర్.....

    కానీ అయ్యో "రామా" అని అని కృష్ణునికి అలంకరిస్తానంటే ఆయన కోప్పడడా? (just for joke)

    ReplyDelete
  2. @ సాయి

    థాంక్ యు సాయి గారు..
    రామ కృష్ణులు ఒక్కరే కదా....
    కృష్ణుడు సృష్తి చేస్తే ,రాముడు అది ఎలా నడవాలో నిర్దేశించాడు ...
    కృష్ణుడికి ఇస్తే రాముడికి చేరినట్టే అనుకుందాం..!!

    ReplyDelete
  3. భలే చెప్పారు, చదువుతూ ఎందుకా అనుకున్నాము, కృష్ణుని దరిచేరాలని ఎవరికి మాత్రం ఉండదు. :)

    ReplyDelete
  4. @చిన్నీఅశ
    చాలా చాల సంతొషం & చాలా ధన్యవదాలు చిన్నీఅశ గారు...
    అంతే మరి కృష్ణుడు అంటేనే ఆనందం.ఆనందం కొసమే గా ఇంత తపన మనకి.
    కాని ఈ విషయం లో మాత్రం పువ్వులదే పై చెయ్యి సుమండీ...

    ReplyDelete
  5. చాలా బావుంది.

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలండీ ....!!

      Delete