Saturday 3 March 2012

అందమయిన ప్రపంచం .....

అందమయిన ప్రపంచం ......

తెలియలేరు ఈ అందం ఇన్నిరోజులు....
రుచిచూడలేరు తెలిస్తే ఇక "పై" రోజులు....

మనుష్యులు రకరకాలు ...
అందరికి ఉన్నాయి మేకప్పులు..
మేకప్పుకు వేయబడిన సామాగ్రీలు 
ఈర్ష్య ,ద్వేష ,అసూయ స్వార్ధాలు..
కుళ్ళు,కుతంత్రాలు వీటికి సహకారులు..
అన్ని ఒకటేలా ఉండే రకరకాలు..

స్నేహానికి వీళ్ళు వేస్తారు మంటలు..
అనురగాలకీ అందిస్తారు అపనిందలు..
ప్రెమకీ ద్వేషాన్ని నేర్పించగల సమర్ధులు..

నీవే నా ప్రాణం అంటారు మెల్లిగా..
నీతోనే ఉంటామంటారు హాయిగా..

హాయిగా ఆనందన్నిస్తామంటారు 
ఇంకోళ్ళ  సంతోషం తుంచుతూ...
జీవితాన్ని వెలిగిస్తామంటారు 
ఇంకోళ్ళ ని చీకటికి దరికి చేస్తూ..

వదలలేము వాటిని..
బ్రతకలేము వాటితో..

కాలేము వాటికి అన్యం..
పోయలేము వాటికి అర్ఘ్యం..
వాటితో అయిపోయే మన జీవితాలు సూన్యం...!!

ఏమంటారు  .?
4m సీత ...
 

4 comments:

  1. nijam sita garu.. mana chuttoo jarigedantaa kallaki kattinattu gaa 10 line lalo koorchaaru.excellent ante takkuva avutundemo.enno kavitalu chadivanu kaani inta baaga edi gunde ki tagalaledu.
    arbhutam andi...

    ReplyDelete
  2. చాలా బాగుంది సీతగారు....

    చిన్న మనవి.. మీ బ్లాగులో word verification తీసివెయ్యగలరు.. దానివల్ల కామెంట్స్ రాయడానికి వీలుగా ఉంటుంది...

    ReplyDelete
  3. అందమయిన ప్రపంచం... అందం, ఆనందం మాయం చేసే మనుషులతో నిండిపోయింది. నిజమే మీరన్నట్టు వీళ్ళంతా సమర్ధులే... తామనుకున్నది నెగ్గాలని ఇతరులని హరించగలిగిన సమర్ధులు...
    కవిత, దాని భావం బాగుంది.

    ReplyDelete
  4. చాలా ధన్యవదాలు చిన్నీఅశ గారు,సాయి గారు& mahesh gaaru ...

    @సాయి
    సాయి గారు తీసెసాను.థాంక్స్

    ReplyDelete