Thursday 15 March 2012

ఓ నేస్తం ఇదే నా గమ్యం.....

అలసిన క్షణంలో తోడూ కై వెతుకులాట ...
బాధ గా ఉన్నప్పుడు ఓదార్పు కై వెతుకులాట...
ఆనందం గా ఉన్నప్పుడు స్నేహితుల  కై  వెతుకులాట...
పండుగ వస్తే సరదా  కై  వెతుకులాట ...
ఒంటరి గా ఉన్నప్పుడు తోడు  కై  వెతుకులాట ...

జీవితం లో అన్నిటికై వెతుకులాట..



ఓ నేస్తం ....
 నా అలసిన క్షణానికి నీ చిరునవ్వే గమ్యం ..
నా బాధ లో నీవిచ్చే స్పూర్తే నా గమ్యం..
నా ఆనందం లో నీ సాన్నిహిత్యమే నా గమ్యం ..
నా పండుగలో నీ సరదాలే నా గమ్యం ...
నా ఒంటరితనం లో నీ తోడే నా గమ్యం ....

చెప్పాలి అంటే ...
నీ స్నేహమే  నా గమ్యం ....!!



--మీ సీత.. 

13 comments:

  1. నిజమే,
    జీవితం అంతా వెదుకులాటే "స్నేహ గమ్యం" చేరేదాకా...
    బాగుంది భావం...

    ReplyDelete
  2. సీత గారు బాగుందండి గమ్యం.......
    బందాలన్ని అర్ఠిక సంబందాలు గ మరుతున్న సమజం లో ....
    ..యిలంటివి తలచుకుంటె కొంచం భాదగ వుంటుంది..
    .కాని బాగుందండి ..

    ReplyDelete
    Replies
    1. రఘు గారు,
      స్నేహగమ్యం లోని మధుర్యం రుచి చూడాలి అంటే స్వార్ధాన్ని వదిలెయ్యాలి. కాని అలా ఎవరు ఉంటున్నారండీ ఈ రొజుల్లో ,ఎవరు అడగగానే సాయం చెస్తున్నారు ,కుంటి సాకులు చెప్పి వదిలించుకుంటున్నారు.అందుకే మీరన్నట్టు స్నేహం ఒక ఆర్ధిక సంబంధం అయిపొయింది.మనం ఏమీ చెయ్యలేము,మనం అలా ప్రవర్తించకుండా ఉండడం తప్ప...
      ధన్యవాదాలండీ !

      Delete
  3. Wow...... Super gaa rasaru Seeta Garu....

    ReplyDelete
  4. @చిన్ని ఆశ గారు

    నిజం చెప్పారు ,స్నెహితులు లేకపొతే మన గమ్యం ఎప్పుడూ పరిపూర్ణం కాదు కదండీ మరి.

    @సాయి గారు...
    చాలా చాలా చాలసూపర్ హపీ అండీ.థాంక్యు.....

    ReplyDelete
  5. మీ గమ్యం స్నేహం అయితే అది ఒక ఆనంద ప్రయాణం కావాలని ఆశిస్తూ ......

    ReplyDelete
  6. khacchitam ga cheptunnanu seeta gaaru ..aa nestam evaro gaani chaala adrushthavantulu mee laanti nestam dorikinanduku.mee snehagamyaanni twaraga cherukondi.
    happy friendship journey :):)

    ReplyDelete
  7. అన్వేష్March 29, 2012

    సీత గారు,నేను మీకూ, మీ బ్లాగ్ కి ,మీ కవితలకి వీరాభిమానినండీ. అసలు చాలా కొత్త గా ఆలొచింపజెసేలా ఉంటాయి మీ భావాలు.ఒక రోజు అనుకొకుండా మీ బ్లాగ్ సెర్చింగ్ లో దొరికింది.
    అన్నీ చదువుతూ ఉంటాను కానీ ఎలా కామెంట్ పెట్టాలో తెలియక ఇన్ని రోజులు ఆగాను.మీరు చాలా బాగా రాస్తారు.స్నేహానికి మీరిచ్చే గౌరవం చూస్తే ముచ్చట గా ఉంది నాకు.
    సీత గారు చాలా బాగుందండీ.

    ReplyDelete
  8. రవి శేఖర్ గారూ,
    చాలా సంతొషం.ధన్యవాదాలు........

    మహేష్ గారూ,
    థాంక్యూ..!ఆ నేస్తం ది కాదు,నాది అద్రుష్టం.

    శేఖర్ గారూ..
    :))

    ReplyDelete
  9. అన్వేష్ గారూ...
    నాకు కుడా అభిమానులున్నరంటే ఆశ్చర్యం గా ఉంది.
    మీ అభిమానానికి సదా పాత్రురాలిని.

    మీ సీత.

    ReplyDelete
  10. ఓ నేస్తం ....
    నా అలసిన క్షణానికి నీ చిరునవ్వే గమ్యం ..

    చాలా నచ్చింది సీతగారూ..

    ReplyDelete
  11. @వర్మ గారు,
    చాలా సంతోషం అండీ.ధన్యవాదాలు...

    ReplyDelete