Friday 23 March 2012

ఉగాది శూభాకంక్షలు...

మామిడి తొరణాలతొ ముచ్చట గొలిపే ఉగాది...  
మేళవింపచెయాలి మన మనసులని మంచి గా...    

ఫంచాంగాల తో ప్రణవనాదం పలికే  ఉగాది... 
ఫ్రయాణం చెయించాలి జీవిత పడవని  పరిమళం గా ... 

తెలుగు వారికే ప్రత్యెకమయిన  ఉగాది...
తెరిపించాలి తేనెతెలుగు కు తలుపులు తేలిక గా... 

వసంత ఋతువుకు వందనం తెలిపే ఉగాది...
వెన్నంటే ఉండాలి వేకువను వెలిగించే నిజమిత్రుని గా..


ఉదయించిన సుర్యుడి తొ వచ్చె ఉగాది ..
ఉయలలూగించలి చిన్ని ఊహలను ఊరడింపుగా..


మామికొమ్మ  పై కొకిల తో కుహూ కుహూ మనిపించే ఉగాది.... 
కూర్చాలి కొత్తపెళ్ళి కూతుర్ల కలల సౌధాన్ని మధురకావ్యం గా... 

షడ్రుచులతో మనల్ని చెరాలని వచ్చిన ఈ ఉగాది...
అవ్వాలి మనలొని అరిషడ్వర్గాలని తెగనరికే నందనఖడ్గం గా... 

ఆ "ఖర" ను సాగనంపుతూ వచ్చిన ఈ ఉగాది..
కావాలి మన జీవితాలలో నూతనా"నంద"యుగానికిఆది...
ఆరోగ్యమయిన ఆకారమై వెలగాలి మన కలల రూపం గా
ఆనందాల అందమయివెలగాలి జీవితం రంగురంగుల ముగ్గులా  !!!!!!

 అందరికీ నందననామ ఉగాది శుభాకాంక్షలు..!!!

--మీ సీత.... 



9 comments:

  1. ఆమని పిలిచే వేళా...కోయిల పాడే వేళా, వసంతం పల్లవించె వేళా ప్రకృతి ఎంత కమనీయం...రమనీయం...చూసే హృదయం ఆనందమయం ఆ ఆనందమే ఎ సంవత్సరమంత సాగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  2. చాలా బాగా రాసారండీ..మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు..

    ReplyDelete
    Replies
    1. చాలా సంతొషం సుభగారు..మీరు రావడం..!!
      ధన్యవాదాలు..

      Delete
  3. @దేవిడ్ గారు
    దేవిడ్ గారు...చాలా చాలా ఆనందం గా ఉంది అండీ.మీకు మీ కుటుంబసభ్యులకు ఉగాది శుభకాంక్షలు.

    ReplyDelete
  4. సూపర్ సీత గారు.. ఎంత బాగా రాసారండి..

    ప్రస్తుతానికి ఉగాది అయిపోయినా.. నా తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు...

    ReplyDelete
  5. సాయి గారు..
    అంతా మీ అభిమానం అండీ..!!
    థాంక్యూ...
    ఆలస్యం గా అయినా ఉగాది శుభాకంక్షలు చెప్పారు..సంతొషం..!!

    ReplyDelete
  6. సీత గారూ,
    మీకూ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున మీ కవతీ చూడలేకపోయాము.
    చక్కగా "ఖర" కి వీడ్కోలు పలుకుతూ "నందనానికి" ఆనంద నాంది తోబాటు కవితలో ఉగాది అంతా చూపిస్తూ చక్కగా రాశారు.

    ReplyDelete
  7. చిట్టి గారు ,పండు గారు....
    చాలా సంతొషంగా ఉంది అండీ....
    చక్కనయిన ధన్యవాదాలు..!!

    ReplyDelete
  8. ugaadi kavita chaala bagundi seetha gaaru...
    ugaadi antaa mee blog lo ne pettesaaru gaa..!aalasyam gaa chusa.
    ugadi subhakankshalu.(late gaa) :)

    ReplyDelete