Sunday 1 April 2012

సంబరం గా సంగీతమయం గా శ్రీనామనవమి ..

శ్రీ రామ నవమి ఎంత బాగా జరిగింది అంటే అంత  బాగా జరిగింది అసలు.మనసు బాగోలెక వారం  రొజుల నుండీ సంగీతానికి వెళ్ళలేదు.కానీ నిన్న వెళ్ళినా ఎవ్వరూ లెక తిరిగి వచ్చెసాను.కానీ ఈరొజు వెళ్ళాను ఎవ్వరూ లేరు .గురువుగారు మాత్రం ఉన్నారు.ఆయన వచ్చావా అని నవ్వి కుర్చోమన్నారు.కుర్చోని ఓం చెప్పుకొని  స్టార్ట్ చెయబొతుంటే ఒక వింత ప్రశ్న.మా గురువుగారి అబ్బాయి వచ్చారు ఆయన చాల  గొప్ప పండితుడు.నెనంటే అభిమానం .నెనొచ్చానని తెలిస్తె వీలుంటే వచ్చెస్తారు.ఆయన వెసిన ప్రశ్న ఎంటి అంటే ఈవేళ శ్రీరామ నవమి. ముగ్గురం ఉన్నం హాయిగా రామ కీర్తనలు పాడుకుందామా అని. నన్ను అడగడం ఎందుకు అనుకున్నాను .తరువాత అర్దమైంది .మా గురువుగారేమొ violin పట్టుకొచ్చారు. ఇంకోక సార్ ఏంఒ keyboard .కుర్చొని నన్నె మొదలెట్టమన్నారు.  సరే అని ఆ రొజు గుడి లొ పాడిన శ్రీరామచంద్ర పాట మొదలెట్టాను.అక్కడా నెను ,violin  తొ మా గురువు గారు,ఆయన పక్కన ఇంకొక గురువు.మా ముగ్గురికీ ఎదురుగా మా అందరి గురువు త్యాగరాజుల వారు ,ఆయనకి పక్కగా  ఆయన గురువు శ్రీరామ చంద్ర మూర్తి విగ్రహం. మేము అయిదు మంది మే ఉన్నాం .
ఆ కీర్తన చాలా బాగ వచ్చింది.మెము ముగ్గురమూ ఒక తన్మయత్వం లోకి వెల్లిపొయాం. వెంటనే నెను "రామా నాపై దయరాదా" కీర్తన ఎత్తుకొవడం,దానికి వారు వాయిద్యాలతొ కలపడం(ఎన్ని తప్పులు పాడానొ) మేము ముగ్గురం అసలు ఒక రకమైన స్థితి కి చెరుకున్నాం.పక్క ఇంట్ళో నే ఉన్న అమ్మమ్మ వచ్చి కుర్చుంది మా వెనకాల.ఆ అమ్మమ్మ నాతొ ఎప్పుదూ మత్లాడింది లేదు ఇంత వరకు.

తరువాత సీతా కల్యాణ వైభొగమె అంటూ మా గురువు గారు మొదలేత్తారు.నెను violin తొ శ్రుతి ఇస్తూ గొంతు కలిపాను.అప్పటికి ఇంకో పక్కన ఉండే వళ్ళొచ్చారు. 

ఇంక జగదానందకారక ఎత్తమన్నారు అందరు కలిసి.ఆ కీర్తన పాదుతూ నేను ,violin తొ సార్,వీణ తెచుకొని ఇంకొ సార్.ఆహా...ఎంత బాగా జరిగింది అంటే మేము ఆ కీర్తన ని కళ్ళు మూసుకొని పాడుతున్నం(నేను మాత్రం భయానికి ) తెరిచెసరికి మా చుత్తూ మొత్తం పదకొండు మంది మాతొ కలిపి.మా కళ్ళళ్ళో నీరు మనసంతా ఒక రకమయిన ఆనందం.

తరువాత మా గురువు గారు వెళ్ళి పూజ కి అన్ని తీసుకొచ్చారు.ఇంతకంటే పూజ రాముడికి ఘనం గా జరగదు అని హారతి ఇచ్చారు.నేను , పక్కింటీ అమ్మమ్మ,ఇంకో గురువు గారు కలిసి మంగళం  పాడెసాం...నేను  రాముడిని ఒక కొరిక అడిగి వచ్హ..నెరవెరుస్తాడన్న నమ్మకం తో

చివరిలొ అమ్మమ్మ పిలిచి నీ పేరేంటని అడిగి చెప్పాక నా బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి, దగ్గరకు తీసుకుంది......

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు....

--4m సీత.....

3 comments:

  1. ముందుగా, ఆలశ్యంగా అయినా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!
    చక్కని సంగీతంతో గురువు గారి తో కలసి సంగీతమయంగా జరుపుకున్న మీ శ్రీరామ నవమి నిజంగా మీకు మరువలేని అనుభూతి. కళలో లీనం అయితే కలిగే ఆ మధురానుభూతి ని ఊహించవచ్చు ఎవరైనా. మీ ప్రొఫైల్ ఫొటో చూసి సంగీతం వచ్చేమో అనుకున్నాము. ఇప్పుడు నిజం అని తెలిసింది.
    మీకిలా సంగీతంతో మరిన్ని మధురానుభూతులు కలగాలని కోరుకుంటూ....

    ReplyDelete
  2. నాకు కూడా వయోలిన్ అంటే చాలా ఇష్టం ...ఈ రోజుల్లో ఇంకా వయోలిన్ వాయించే వారు
    ఉన్నారు అంటే చాలా సంతోషంగా ఉంది....మంచి పోస్ట్ ...అభినందనలు

    ReplyDelete
  3. చిన్ని ఆశ గారు...
    చాలా ధన్యవాదాలండీ..

    శశి కళ గారు....
    ఇంకా వాయొలిన్ వాయించే వారున్నారండీ....!!
    మన సాంప్రదాయం ఎక్కడికీ పోదు........!

    ReplyDelete