మూగబోయిన గొంతు కి మాట
ఎదురుచూసిన కలకు నిజం
మారుతున్న ఆకాశానికి హరివిల్లు
అలసిన దేహానికి చల్లని గాలి
ఉద్వేగమయిన మనసుకు సంగీతం
అందమయిన చోటుకి పూలరెపరెపలు
అడవికి గలగలమనే జలపాతం
ఒంటరి మనిషి కి కోరుకున్న తోడు
భావుకత ఉండే కవికి కళావస్తువు
తపించే హృదయానికి ప్రేమానురాగాలు
ఎంత అందాన్ని ,ఆనందాన్ని తెస్తాయో ,
ఎంత సాంత్వననీ ,స్వచ్చతనీ ఇస్తాయో
ఓ నేస్తం,
నాకు నీ సంతోషం,చిరునవ్వు కూడా అంతే !!
ఎందుకంటే ,
స్నేహమంట ....!
ప్రపంచం లో అతి విలువయినదీ ,నిస్వార్ధమయినదీ స్నేహమే
ఒక అవసరం కోసం చేయని పని ఒకటి ఉందీ అంటే అది స్నేహమే
ఎంత దూరాన్నయినా దగ్గర చేసి సేద తేర్చెదీ ఒక్క స్నేహమే
ఎంత దూరం అయినా ప్రయాణం చేయించగలిగెదీ ఒక్క స్నేహమే
ప్రతి బంధానికీ ముఖ్యమయిన బీజమై ఆనందాన్నిచ్చేదీ స్నేహమే
ప్రతి బంధం లో ఒదిగిపోయి పూచే పుష్పమూ ఒక్క స్నేహమే
ఎందుకంటే ఇది స్నేహమంట ....!

--
సీత
