మూగబోయిన గొంతు కి మాట
ఎదురుచూసిన కలకు నిజం
మారుతున్న ఆకాశానికి హరివిల్లు
అలసిన దేహానికి చల్లని గాలి
ఉద్వేగమయిన మనసుకు సంగీతం
అందమయిన చోటుకి పూలరెపరెపలు
అడవికి గలగలమనే జలపాతం
ఒంటరి మనిషి కి కోరుకున్న తోడు
భావుకత ఉండే కవికి కళావస్తువు
తపించే హృదయానికి ప్రేమానురాగాలు
ఎంత అందాన్ని ,ఆనందాన్ని తెస్తాయో ,
ఎంత సాంత్వననీ ,స్వచ్చతనీ ఇస్తాయో
ఓ నేస్తం,
నాకు నీ సంతోషం,చిరునవ్వు కూడా అంతే !!
ఎందుకంటే ,
స్నేహమంట ....!
ప్రపంచం లో అతి విలువయినదీ ,నిస్వార్ధమయినదీ స్నేహమే
ఒక అవసరం కోసం చేయని పని ఒకటి ఉందీ అంటే అది స్నేహమే
ఎంత దూరాన్నయినా దగ్గర చేసి సేద తేర్చెదీ ఒక్క స్నేహమే
ఎంత దూరం అయినా ప్రయాణం చేయించగలిగెదీ ఒక్క స్నేహమే
ప్రతి బంధానికీ ముఖ్యమయిన బీజమై ఆనందాన్నిచ్చేదీ స్నేహమే
ప్రతి బంధం లో ఒదిగిపోయి పూచే పుష్పమూ ఒక్క స్నేహమే
ఎందుకంటే ఇది స్నేహమంట ....!

--
సీత

Seeta chaal chaala bagundi...
ReplyDeletethank you very much sruti :)
Deleteenta muddu gaa snehaanni chepparu varnana baavundi sita...nice one
ReplyDeletemanju gaaru,
Deletethank a lot..!
సీత పలికే మరో మారు చక్కని భావాన్ని ఎంతో చక్కగా...
ReplyDeleteచాలా బావుంది.
మార్చిన టెంప్లేట్ బాగుంది, పోస్ట్ కి ఎంచుకున్న ఫొటోలు, కూర్చిన విధానం అన్నీ బాగున్నాయి,
By the by, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మీరు చేసిందేనా?
చిట్టి గారు-పండు గారు,
Deleteచాలా ధన్యవాదాలు మీకు.
అవునండీ ఆ మ్యూజిక్ నేను నా మ్యుసికల్ కీ బోర్డు మీద వాయించినదే...
చాల బాగుంది సీత
ReplyDeleteవినయ్ గారు,
Deleteధన్యవాదాలండి ..
chakkaga raasaarandi,
ReplyDeleteinkoncham clarity perigi unte inka bhvunde demo anipinchindi,
good effort, keep writing.
mee blog kothaga kanipinchindi.
bhaskar gaaru,
Deleteif possible i will try next time. thank you :)
చేతిలోని రేఖలు అసంపూర్తిగా ఉంటే స్నేహితులు ఉండరంటారు...
ReplyDeleteవాస్తవం ఏమిటంటే..
నిజమైన స్నేహితుని చేయి మన చేతిలో ఉంటే ...చేతిలో రేఖలతో పని లేదట.
స్నేహం గురించి మీ వివరణ బాగుంది సీత గారూ!
@శ్రీ
శ్రీ గారు ,
Deleteబాగా చెప్పారు ...నేస్తం చేయి చాలదా??
ధన్యవాదాలండీ :))
సీత గారు.. చాలా బాగా రాసారు.... మీ నేస్తం తప్పక సంతోషిస్తారు ఇది చదివి.....
ReplyDeleteసాయి గారు ,
Deleteఅదే కావాలి నాకు :)
ధన్యవాదాలు..
చాలా చాలా బాగుంది.
ReplyDeleteఅద్భుతం గా , ఆహ్లాదకరం గా చెప్పారు.
ఎన్నో ఎంతో హాయి గొలిపే అంశాలకన్న మిన్నయినది స్నేహమని ఉపమానాలతో సహా వివరించడం బాగుంది సీత గారు.
స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. చివరి ఆరు వాక్యాలు ఇంకా బాగున్నాయి.
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా ! స్నేహమేరా జీవితం - స్నేహమేరా శశ్వతం !!
పల్లాకొండల రావు గారు,
Deleteఅవును స్నేహమే జీవితం,శాస్వతమూనూ...
భలే పాట గుర్తు చేసారండీ.:)
ధన్యవాదాలండీ...
స్వేత గులాబీ యై మా
ReplyDeleteసీత పలికె స్నేహ గీతి , చెమరించె యెదన్ ,
స్వాతి చినుకు కోసమె గద
ఆతృత ముత్యంపు చిప్ప కాకాశముపై .
----- సుజన-సృజన
వెంకట రాజారావు గారు,
Deleteబోలెడు ధన్యవాదాలండీ...
ప్రకృతి అంతా మీరు చెప్పిన పరిపూర్ణ స్నేహాన్ని అనుభవిస్తుంది.మనిషికి అలాంటి స్నేహం దొరికితే అంతకంటే అదృష్టవంతుడు ఉండరు.స్నేహం పట్ల మీకున్న అవగాహనకి అభినందనలు.ఈ రోజు నేను కూడా "స్నేహం మొదలయ్యే క్రమం "అనే పోస్ట్ వ్రాసాను.nice coincidence.చిన్న సవరణ .సాంత్వన అనుకుంటా!
ReplyDeleteరవిశేఖర్ గారు,
Deleteఅవును భలే కలిసింది.సరిచేసాను.
చాలా ధన్యవాదాలండీ
సీత గారూ, మీ స్నేహ కవనం బాగుంది. సున్నిత హ్రిదయం ఎప్పుడూ మంచి స్నేహాన్ని ఆశిస్తుంది, బాగా రాసారు.
ReplyDeleteఫాతిమా గారు,
Deleteధన్యవాదాలండీ...:))
its so lovable,sweet...
ReplyDeleteA boy 'n a girl were playing together. The boy had a collection of marbles. The girl had some sweets with her.
The boy told the girl that he will give her all his marbles in exchange for her sweets. The girl agreed.
The boy kept the biggest 'n the most beautiful marble aside 'n gave the rest to the girl. The girl gave him all her sweets as she had promised.
That night, the girl slept peacefully. But the boy couldn’t sleep as he kept wondering if the girl had hidden some sweets from him the way he had hidden his best marble.
Moral:
If you don’t give your hundred percent in a relationship, you’ll always keep doubting if the other person has given his/her hundred percent
LIFE IS BEAUTIFUL WITH A RELATIONSHIP LIKE FRIENDSHIP ...
HOPE U HAVE THAT FEELING.THATS WHY A BEAUTIFUL POEM CAME FROM U SEETA JI...
ITS SO LOVABLE
wow....thank you anonymous ji...
Deleteso sweet story.thanks :)
ప్రజెంటేషన్ తోనే మార్క్స్ కొట్టేసేవారిలా వున్నారు మీరు :)
ReplyDeleteకేవలం ప్రెజెంటేషన్ మాత్రమే కాదు, కంటెంట్ కూడా బాగుంటుంది..
మనలో మన మాట, ఎగ్జామ్స్ లో కూడా టీచర్స్ ని మీ ప్రెజెంటేషన్ తోనే బోల్తా కొట్టిన్చేవారా :)))
హర్ష గారు....
Deleteమీరు చెప్పినట్టు మొదటిదానితోనే నండీ...
కాకపోతే కాస్త సబ్జెక్ట్ కుడా రాసేదాన్ని.కొంచం ఎక్కువ మార్క్లే వచ్చేవి..((ఏం చేసుకుంటాం??పులుసు కూడా పెట్టుకోలేం కదండీ ;);)
ఎమంటారు?....మనలో మనమాట ఇది)) :))
బోలెడు ధన్యవాదాలు ...:)
సీతగారు మీ కవిథలాగే మీ సంగీతం కూడా చాలాచాల బాగా ఉంది.
ReplyDeleteనిత్య గారు...
Deleteమీకు ధన్యవాదాలు +ధన్యవాదాలండీ...:)