...కోయిలమ్మ పాటలోని స్వరాన్ని నేనందుకోనా......
...కూనలమ్మ పదాలలోని కూర్పుని నేనల్లనా....
...గలగలా మంటూ సాగే నీటిలో తిరిగి తేలిపోనా...
...గవ్వలల్లె గుసగుసలకి గమ్ముగా మురిసిపోనా...
...నెమలి నాట్యం లో నవరసాలని నేనోలకపోయనా....
...నిశీధిని చీల్చే నవ యువమల్లికనై నడకలద్దనా....
...చెట్లు చేసే చిరుగాలి సవ్వడులతో చల్లగా సాగిపోనా...
...చిట్టిచిట్టి మాటలు చెప్పే రామచిలక పలుకునయిపోనా...
...ఊయలూగి కవ్వించే పత్రంలో పచ్చదనమై పరవశించనా...
...ఉదయించే సూర్యుడి కిరణం లో వెచ్చగా ఒదిగిపోనా..
...సప్తవర్ణాల హరివిల్లు లో ఏదోక వర్ణం లో వెలగనా...
...సప్తసముద్రాల అలలో ఆనందం గా అలసిపోనా....
...ప్రేమని రాయబారమంపే పువ్వులోనవ్వునై పుష్పించనా...
...ప్రశాంతత పూయించే ఆలయగంట లో గడచిపోనా...
...అవనికి చల్లదనాన్నిచ్చే మేఘంలో చినుకునై జారనా...
...అల్లరి చేసి నిశ్శబ్దాన్ని చీల్చే మెరుపునై ఆకాశాన్నల్లనా..
...భూమాత బిడ్డనై తల్లి భారాన్ని నే కొంచం మోయనా...
...బంధినయి నేనిలా ప్రకృతి తో పులకరిస్తూ పోనా....
ప్రకృతి లోని అందాలనీ, రాగాలనీ, వర్ణాలనీ, భావాలనీ అందమైన కవితగా అల్లి పలికేశారు.
ReplyDeleteప్రకృతి అంత సొంపు గానూ రాశారు.
అభినందనలు సీత గారూ!
చిట్టి-పండు గార్లు,
Deleteచాలా ఆనందం..
:)
ధన్యవాదాలు మీకు..
enni naa la tho kavitha raasaarandi, mee anni korikalu theeralani aa devudini korukuntu,
ReplyDeletekeep writing seetha garu.
భాస్కర్ గారు,
Deleteథాంక్ యు అండీ...!!:) :)
నా కవిత నచ్చినందుకు.
చూచితివొ లేదొ చిన్నికృష్ణుని సొబంగు?
ReplyDeleteపెదవి చివురు సంజల నరవిచ్చు నవ్వు
వెన్నెల, చలించు తుమ్మెద బెళుకు చూపు,
లోల పవన చాలిత కుటిలాలకమ్ము,
తరళ చూడా కలాపమ్ము, మురళిగూడి
యల్లనల్లన గొంతెత్తి యమృతగాన
శీతల తుషారముల విరజిమ్ము వేళ
చిన్నికృష్ణుని సొబగు చూచితివొ లేదొ?
krisna sasthri garidi, mee krishna prema kosam.
నా కృష్ణ ప్రేమకి మీరిచ్చిన బహుమతి సూపర్...ఎంత ఆనందం గా ఉందో చెప్పలేను...
Deleteచిన్ని కృష్ణుని సొబగు చూసానండి...!!
థాంక్స్ ఎ లాట్....:) :)
'సీత'లా మేము కవితలల్లగలమా?
ReplyDeleteఅందరినీ ఇలా అలరించ గలమా?.....:-)
బాగుంది సీతగారూ!
@శ్రీ
అమ్మో శ్రీ గారు....
Deleteమీరా మాట అనడమే ?!?!!:)
ధన్యవాదాలండి..:)
సీత గారూ... చాలా చాలా బాగా రాసారు అండీ...
ReplyDeleteఇక మాటలు లేవు... సూపర్...
సాయి గారు...
Deleteనాకూ పలుకులు లేవు...!చాలా ధన్యవాదాలండి...:)
ప్రక్రుతి లో కలిసి, మేఘాల పై తేలి,సముద్రాలలో ఈది, మెరుపుల్లో మెరిసి ఎంతగా మురిసి పోయారండి.మీ మనసు ఎన్ని రెక్కల గుర్రాలెక్కి విహరించిందో ఈ కవిత వ్రాస్తున్నప్పుడు,చదువుతున్నప్పుడు మాకు అలాగే అనిపించింది.nice poetry.
ReplyDeleteమీ కామెంట్ చదువుతుంటే నాకూ మళ్లీ అలా విహరించినట్టు అనిపించింది రవిశేఖర్ గారు...
Deleteధన్యవాదాలు మీకు :)
ప్రకృతితో మమేకమ్మయి , పరవశించి ,
ReplyDeleteసీత పలికెను , కోయిల గీతి , తనదు
హృదయ మరుణోదయమ్మయి , ఉదయ రాగ
మధురిమలు - గానమై కలిగె మాకు హాయి.
----- సుజన-సృజన
వెంకటరాజారావు గారు,
Deleteచెప్పలేనంత ఆనందం గా ఉంది...!!
బోలెడు ధన్యవాదాలు మీకు...!
-సీత
మావి చిగురు తినగానే కోయిల పలికేనా!?
ReplyDeleteకోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా!?
ఏమో .... ఏమగునోగాని ........
సీతమ్మ పలుకులతో ప్రకృతి పరవశిస్తోందా!?
ప్రకృతిలోని పారవశ్యాన్ని సీతమ్మ స్వరకల్పన చేసిందా!?
అన్నంత హాయిగా ఉందీ కవిత !!
కీపిటప్ సీత గారు.
పల్లాకొండలరావు గారు,
Deleteసీత సాగిన ప్రకృతి ఇంతమందికి హాయి కలిగించిందీ అంటే ఆనందం+ఆశ్చర్యం..!!
బోలెడు ధన్యవాదాలు మీకు...!:)
-సీత
మీ కవిత బాగుందండి.
ReplyDeleteప్రేరణ గారు,
Deleteస్వాగతం అండీ..!
ధన్యవాదాలు :)
ఆణువణువూ నా ప్ర కృతి సొబగులు అద్దుకున్న మీ అంతరంగం ని అందమైన కవిత్వంలో చూసి.భావ కవిత్వ బరువులో తడిచి పోనా. .నేను అలా ఉండిపోనా.. అనుకున్నాను.
ReplyDeleteవండర్ ఫుల్.!!
వనజ గారు...
Deleteవండర్ఫుల్ అని వండర్ చేసేసారు నన్ను...చాల సంతోషం అండీ...ధన్యవాదాలు..:)
సీత గారూ, మీ కవిత లోని విరహము, వేదన రెండూ చాలా బాగా ఆవిష్కరించారు.
ReplyDeleteఫాతిమా గారు ,
Deleteధన్యవాదాలండి...!!:)
సీత గారు, చాలా బాగుంది అండీ.
ReplyDeleteమీరవన్నీ నింపుకొని ఎలా అయిపోయినా
ఆస్వాదించడానికి మీ అభిరుచులమయిపోమా.?
కవితలోచ్చేస్తున్నాయి సీత గారు మీ బ్లాగ్కొచ్చి.
చాలా చాలా బాగుంది.
అన్వేష్ గారు,
Deleteనా బ్లాగ్ ని ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు..!!చాల సంతోషం
మీకు ధన్యవాదాలు ...:)
త్వరలో కవితల బ్లాగ్ రాబోతోందన్నమాట అన్వేష్ గారి దగ్గరనుండి ....నేను ఎదురుచూస్తూ ఉంటాను మరి...
ఉద్దేశాన్ని చెప్పే మీ కళ చాలా ఆకర్షించేలా ఉంది.
ReplyDeleteఆకట్టుకుంటోంది కుడా.
మీ నేర్పు కి అభినందనలు సీత గారు.
బ్లాగ్ లు చదవడం నాకు బాగా అలవాటు.కాని దేనికీ నాకు ప్రత్యుత్తరం ఇవ్వాలి అని అనుకోలేదు.మీ బ్లాగ్ ని చుసిన రెండో సారికి మాత్రం ఎందుకో కొత్త గా అనిపించింది.ప్రతిరోజు చుస్తునే ఉంటాను.
ఎంతో సున్నితం గా,సభ్యం గా,ఆకట్టుకునేలా మీరు అందరినీ కట్టడి చేస్తునే ఉన్నారు.అలరిస్తున్నారు కూడా..
మీ బ్లాగు,మీ భావాలు మీలో ఉండే సున్నితత్వాన్ని ,ప్రేమతత్వాన్ని ,మంచితనానికీ అద్దం పడుతున్నాయి.
సీత పలుకులు చాలా చక్క గా ఉన్నాయి.
సీత పలుకులెప్పటికీ ఇలా ఉండి పోవాలని మనస్పూర్థిగా అభిలాషిస్తున్నాను.
త్యాగరాజపంచరత్నాలలో మన జీవితం అంటూ మీ మోదటి పోస్ట్ ఎంత చక్కగా చెప్పారండీ ఆయన మీ నుండి పలికినట్టు అనిపించింది.నిజం అదంతా తెలుసుకున్న ఏ మనిషీ తప్పటడుగు వేయడు నిజం .సంగీతాన్ని ఎంతో ఆస్వాదిస్తే అది తెలుస్తుంది.
"నేనే నీవవుతా " అంటూ నిజమయిన ప్రేమ కి నిర్వచనం ఇవ్వడం ఈ రోజుల్లో అరుదు మీ మనసేమిటో చెప్పిందది.
"ఏమిటో ఇదంతా" అంటూ మీ అందమయిన కల, అలా ఒక్క రోజు జరిగినా ఆనందమే కదా.
మీ కృష్ణ ప్రేమ విషయాని కొస్తే ,నన్ను కట్టి పడేసిందదే..
"ఓ మానసనివాసా" అంటూ,"సీతారాధనా" అంటూ మీరు చెసినవి ఎంతో ఆకర్షించాయి నన్ను..
ప్రతి పదమునందూ మీకా కృష్ణుడి పై గల అనురాగాన్నీ,ప్రేమ ని ప్రస్పుటం చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు.
అసలు ఆ కన్నయ్య గురించి ఎవరెంత చెప్పినా ఆయన వర్ణనాతీతుడు.మీ కృష్ణ ప్రేమ కి జంట గా వెంకట రాజరవు గారిచ్చే పదకవితలూ అంతే అర్భుతం.
అభినందనల మాల పంపుతున్నాను సీత గారు మీకు.
"భూమాత బిడ్డ" అంటూ "సీత" నని చెప్పక చెప్పారా?
శ్యామసుందర్ గారు,
Deleteనాకేమి రాయాలో తెలీట్లేదు అండీ..!!
ఓపికగా నా బ్లాగ్ మొత్తం చదివారు.
నాకూ మొదట్లో అసలీ ఆలోచనే లేదు...
నాకు అనిపించినవి ఊహలూ అవన్నీ పేపర్ మీద రాసుకొని పదిలం గా దాచుకునే అలవాటు....
కాని ఒక మిత్రుడు ఇచ్చిన ప్రోత్సాహం తో నేనిది మొదలుపెట్టాను...
నా ఊహలకీ ,భావాలకి ఇంత ఆదరణా?అని ఆశ్చర్యం గా అనిపించింది గడిచే కొద్దీ..!!
మీరు రాసిందంతా చదువుతుంటే ఆనందం గా ఉంది నాకు.కాని, నిజానికి నాదేమీ లేదు ఇందులో.
మీరు పంపిన అభినందనల మాల నిజానికి చేరాల్సింది నాకు కాదు...
అది నన్ను ప్రోత్సహించిన మిత్రునికి చేరాలి.
నాకు చెప్పలేనంత ఆనందం గా ఉంది...
మీ అభిమానానికి సదా పాత్రురాలాయి ఉంటాను. :)
చాలా ధన్యవాదాలు మీకు....!!
మీరు బాగా కనుక్కున్నారు అందుకే భూమాత బిడ్డనన్నాను..!!
ఏ తల్లి బిడ్డ అయినా మొదటి తల్లి భూమాతే అంటారు కదా...!
బాగు బాగు బహు బాగు
Deleteమీ మిత్రునికి కుడా అభినందనలు తెలుపండి సీతగారు.
so lovely,super seetha garu....:)
ReplyDelete123 గారు,
Deleteనాకు మీ పేరు తెలీదు అండీ..!!
ధన్యవాదాలు మీకు...:)
చక్కని వ్యాఖ్యానము ,కడు
ReplyDeleteమక్కువ గల్గించె , సీత మనసున విరిసే
చక్కని పలుకుల కవితలు
చుక్కల తళ తళలు - శ్యామ సుందర్ గారూ !
----- సుజన-సృజన
రాజారావు గారు...
Deleteమీ వ్యాఖ్య కు మరోమారు ఆనందం అండీ...!!
:) :)....ధన్యవాదాలు...
నా మనసు లోని భావాన్ని అచ్చతెలుగు ప్రాస పద్యములో చెప్పేసారు రాజరావు గారు...మీ నేర్పు కు పాదాభివందనములు.
Deleteమీరన్నట్టు సీత గారి ఒక్కొక్క పలుకు ఆకశం లో మెరిసే చుక్కల తళతళలే నండీ.
కల్మషమెరుగని భామామణి ఈ సీతారమణి.
మీరు
ReplyDeleteఈ క్రింద చెప్పబడిన పుష్పగుచ్చం అనే చిట్టి కవితల గ్రూప్ కి ఆహ్వానిన్చబడుతున్నారు...
http://www.facebook.com/groups/295811307177451/
అరుణారుణ ఆకాశమ ....
నాచెలి అధర వర్ణాన్ని అద్దుకుని ...
అరుణ కేతనం ఎగరేశావే..!!
గోధూళి వేళ..నీ లీలా ప్రణయ కేళి లో..
నెచ్చెలి లోగిళ్ళ వాహ్యాళి నా పాలీలో చేరి ..
పూల కౌగిళ్ల కవితల జల్లులు
పుష్ప గుచ్ఛంలో పులకించిపోవా........లక్ష్మన్ స్వామీ
ఆకాశ రాజు చుంబించాడనేమో
తూరుపు దిక్కు సిగ్గుతో ఎరుపెక్కినట్లుంది
ఎండవెన్నెల తలపు తీపితొ పంపుతోందిక
నిండు వెలుగుల మింటి సూరీణ్ణి
నిశికన్యను తరిమేస్తూ నెలరాజును మందలిస్తూ
కమలాలకు కన్నుగీటుతూ విచ్చేసాడుగా కొంటెసూరీడు
నిదుర కనులకు మేలుకొలుపుతూ..
వెలుగు ఒయారి వెంటపడుతూ......పద్మా శ్రీరామ్
అలాగే ప్రాసతో వ్రాయబడు చిన్ని కవితల వేదిక Rhymist's Quest గ్రూప్ కి కూడా ఆహ్వానించ బడుతున్నారు ..
http://www.facebook.com/groups/231263773656888/
నా పైన కోపమెందుకే పుత్తడి బొమ్మ,....
నిన్ను చూడక ఉండలేనే కుందనాల బొమ్మ.....నాని నాగు
కనురెప్పల మాటున నీ రూపం
నిశ్శబ్దంగా ఉలిక్కిపడింది..
కలత పడిన నా హ్రుదయం
ఓ కనీటి చుక్క రాల్చింది.....సాయి కామేష్
భలేగుంటుంది సాంభార్
దీనిముందు చికెన్,మటన్ బలాదూర్...కోదండ రావు
ఇంలాంటివి ఎన్నో ఎన్నెన్నో ... ఇట్లు మీ ఆగమనాభిలాషి...ప్రసాద్ అట్లూరి
ప్రసాద్ గారు,
Deleteచాలా సంతోషం అండీ...!
నాకు FB తెలీదండి...
కాని తప్పకుండా ప్రయత్నిస్తాను...
కాకపోతే కాస్త ఆలస్యం గా...!!
ధన్యవాదాలు మీకు...:)
chaalaa chaalaa baagaa rastunnaru baavuntunnayi mi kavitalu sita
ReplyDeleteమంజు గారు...
Deleteచాలా ధన్యవాదాలండి...!!
chaal bagundi seeta.......
ReplyDeletethank you sruti..
Delete