నాకిష్టమయిన కృష్ణుడు.. |
తెల్లని మల్లెలు అల్లిన గానం
మెల్లగా పలికెను మోహన రాగం
చల్లని చూపుల ఓ నల్లని స్వామీ
జల్లించా నిన్ను విరజాజులతో.....!!
నీ గాన సుధలకు వేణువుల పొదలు
చైతన్యమై మా చే పలికించే నీ కృతులు...
నీ ముద్దుమాటలకు మురిసిన మా మోములు
మహదానందమై మరిపించే ఈ లోకములను....!!
జలకాలాడే గోపికలు ,
నీకై వేచే నీ స్నేహితులు,
నిన్నే స్మరించే హృదయాలు..
విన్నవిన్చుచున్నారు ఓ
మానసచోరా
నీ రాగాసరోవరము లో
మమ్ము ఇలాగే నిలిచిపోనివ్వవా ......"
nice. meeku krishnudu ante istama?
ReplyDeleteశృతి గారు,
Deleteధన్యవాదాలండి ......
నాకు కృష్ణుడంటే చాలా చాలా ఇష్టం..!!
ఛాలా బావుంది. ఎంత శ్రద్ద కనిపించారో! అద్భుతంగా పిక్స్ జత పరచారు.
ReplyDeleteనాకు చాలా నచ్చింది, Thank you very much!!
వనజ గారు ...
Deleteమీ స్పందన కు చాలా ఆనందం గా ఉండండి...!!
బోలెడు ధన్యవాదాలు....
-- సీత.....
చాలా బాగుంది... సీత గారు....
ReplyDeleteసాయి గారు,
Deleteధన్యవాదాలండి...!!
భలే ముద్దొస్తున్నాయి బొమ్మలు....
ReplyDeleteNice presentation...
పద్మార్పిత గారు.....
Deleteచాలా రోజులకి వచ్చారు....
చాలా సంతోషం అండీ మీరు రావడం.
మీకు నచ్చినందుకు ఆనందం.
thanks a lot...:)
Presentation keka.
ReplyDeleteKittappa chust padi pothaaru :)))
హర్ష గారు....
Deleteథాంక్ యూ వెరీ మచ్...
కిట్టప్ప (ఎలా చూస్తారు??) చుస్తే బాగుండు కదా...............;)
చాలా సంతోషం :) :)
mee krishna prema bhagundandi, chinni krishnudi photo entha bavuntondo.
ReplyDeleteభాస్కర్ గారు,
Deleteకృష్ణుడు బొమ్మలన్నింటిలో నాకు చాలా ఇష్టమయినవి ఆ చిన్ని కృష్ణయ్య దీ , నా దగ్గర ఉండేదీ...!!
ఇవి ఎంత ఇష్టమో చెప్పలేను..
ధన్యవాదాలు ..........
మురళీ కృష్ణునిపై సీత పలికిన రవళి....బాగుందండీ!
ReplyDeleteపండు గారు...
Deleteధన్యవాదాలండి... :)
చాలా బాగుంది సీత గారు.,కృష్ణుడెంత బాగున్నాడో మీ కవిత అంతే బాగుంది.చాలా నచింది మీ బ్లాగ్ నాకు.
ReplyDelete123 గారు, స్వాగతం...!!
Deleteమీ రాక ఆనందం.
ధన్యవాదాలు మీకు...... :)
your blog maintainance is very good.
ReplyDeletetemplate is peaceful to see.
your thouhts and imaginations are cute.
your poetry is lovable.
your love towards lordkrishna is appreciable.
congrats miss.seetha.
shyamsundar garu,
Deletewelcome to my blog...!!
thank you so much ....!!
కన్నయ్య చిత్రములు ముద్దొస్తున్నాయండీ...
ReplyDeleteకిష్టుడు
అందరికిష్టుడు
ఆ నల్లని రూపం
ఎప్పటికీ అపురూపం
ఆ మురళీ గానము
మరియెచ్చటనూ గానము.
గోలి హనుమచ్ఛాస్త్రి గారు ,
Deleteచాలా చక్క గా చెప్పారు....:) :)
ధన్యవాదాలండి... !!
చాలా బాగుంది సీత గారూ!
ReplyDeleteమీ మోహనుని కీర్తనం
@శ్రీ
శ్రీ గారు
Deleteధన్యవాదాలండి ....:)
చిలుక నీతో నేమి చెప్పు చున్నది కృష్ణ !
ReplyDeleteహాయిగా చెంపకు చేయి చేరె
మురళిపై వ్రేళులు సరిచేయ గనె కృష్ణ !
చూపులు మా తనువు చుట్టు చేరె
మృదువారగ మురళి పెదవి చేరగ కృష్ణ !
ముల్లోకములు నీదు మ్రోల చేరె
చూపు మరలనీని రూపుతో మము కృష్ణ !
ఏమార్చినావు మమ్మిట్లు చేర
కవితలో మల్లెలు గలిపి కట్టి దండ
ప్రియముగా “ సీత “ కొలిచి అర్పించె కృష్ణ !
నల్ల నయ్య! నీకు ప్రణతు లుల్ల మరసి ,
మురిసి ముద్దియ్యరా ముద్దు మోవి కృష్ణ !
----- సుజన-సృజన
వెంకట రాజారావు గారు,
Deleteచాలా చక్కగా చెప్పారు మీరు ....!!!
చాలా సంతోషం గా ఉంది...ధన్యవాదాలు..!!