పసికందు గా బోసినవ్వులతో నీ ఒడి లో ఊయలలూగుతుంది
నీ గుండెల పై తన పాదాలు తో తంతూ ఆనందాన్నిస్తుంది
బుడిబుడి పాదాలతో తప్పటడుగులేస్తూ నిన్ను మురిపిస్తుంది
తోబుట్టువయి నీ తోడు గా చిన్న-చిన్న గొడవలతో సరదాన్నిస్తుంది
నేస్తమయి ఆడీ-పాడీ నిన్ను నడిపించే ఒక ఆహ్లాదమవుతుంది
ప్రియురాలయి నిత్యం నిన్ను ప్రోత్సహిస్తూ నిన్నల్లే ప్రేమవుతుంది
భార్య గా నీ ఇంట్లో మమతానురాగాలనే దివ్యదీపాన్ని వెలిగిస్తుంది
అనునిత్యం నీ గురించే ఆలోచిస్తూ నీ సగమై సాగి స్పూర్తినిస్తుంది
నీ బంధువులతో ఒదిగి అందరినీ కలుపుకుంటూ నీవే తానవుతుంది
నీ ప్రతిరూపాన్ని తను మోస్తూ భారం అంతామింగి తను మురిసిపోతుంది
అమ్మై నీ పాప ని నీకు చూపి నీ కళ్ళల్లో వెలుగు చూసి అంతా మర్చిపోతుంది
ఆలనా-పాలన లో మునిగి అమ్మై తాను మురిసిపోతూ నిన్ను మరిపిస్తుంది
చదువుల తల్లై బుజ్జాయి కి ఓ -నా-మా లు నేర్పుతూ నీ ప్రశంసవుతుంది
నీ కలలకో రూపాన్నిస్తూ నీ జీవితాన్ని అందం గా దిద్దే ఒక నాయికవుతుంది
బాధ్యతలన్నింటిలో నీ తోడూ-నీడయి ధైర్యాన్నికోల్పోనీక నీ గెలుపవుతుంది
ఇన్నేళ్ళు అలసిపోయారంటూ ఇక సేద తీరమంటూ నీకు ప్రశాంతతనిస్తుంది
నీ కళ్ళల్లోకి చూస్తూ మరలా నీ ఒడి లో నే ఒదిగిపోయి కనుమూస్తానంటుంది ..."మగువ మనసు".....
అన్ని పాత్రలు ఎవరయినా పోషించగలరా ??
ఎవరెంత సాధించినా ఏదో ఒక రూపం లో దానికి పరోక్షంగా కారణం ఒక మహిళే...
అందుకే "మగువ -మకుటం లేని మహారాణి."
కాదనగలరా?
--
సీత
....