రంగురంగుల ప్రపంచం
రాగాలు పలికించె
ఎదనిండా మల్లెలువిరబూసి
నా ఆశలన్నీ పరిమళభరితమాయే ...
పరుగులు తీసింది కదలని అంతరంగం
పసిపాపనిచేసింది ప్రకృతి అందం
ఎగిరిగంతులు వేసిన నా హృదయం
ప్రకృతి ఒడిచేరింది ముద్దుమురిపాలకై ....
అడవినేర్పింది అందమయిన అమాయకత్వం
చల్లదనం చేరింది నా చింతలు తొలగించి
ముద్దుగా చేరువయ్యింది మానసికప్రపంచం
నా ముచ్చట తీర్చి నన్నలరించింది ....
ఏకమయిపోయా స్వేచ్చగా నిశ్సబ్దామృతంలో
ఎక్కడో లేదు అనిపించింది 'స్వర్గం'
ఇక్కడే తల్లి 'భూమి ఒడి' లోనే
ఒడిలో ఒదిగిన పసిపాపనైన నా 'మనసు'లో ......!!
మొన్న ఒక పూలతోట దగ్గరికెళ్ళినప్పుడు ఎందుకో ఇలా అనిపించింది.
--
seetha
..
స్వర్గం నరకం వేరుగా లేవండి, మన మనసులోనే ఉన్నాయి, బాగా చెప్పేరు.
ReplyDeleteశర్మ గారు,
Deleteధన్యవాదాలండీ....:)
ఎక్కడో లేదు అనిపించింది 'స్వర్గం' ఇక్కడే తల్లి 'భూమి ఒడి' లోనే
ReplyDeleteఒడిలో ఒదిగిన పసిపాపనైన నా 'మనసు'లో ......
సూపర్ సీత గారు ఆ లైన్స్ భలే నచ్చాయి అండీ...
కవిత సూపర్..
సాయి గారు,
Deleteఅంతగా నచ్చితే ఆనందమేగా...
ధన్యవాదాలండీ....:)
చాలా బాగా రాసారండి.
ReplyDeleteఆనందం గారూ
Deleteఆనందమండీ...!!
ధన్యవాదాలు :)
మీ ఆశలను పరిమళ భరితం చేస్తూ,పసిపాపను చేస్తూ,
ReplyDeleteస్వర్గభావనలలో విహరించేటట్టు చేసిన పూలవనానికి,
చక్కని కవిత రాసిన మీకు అభినందనలు,
ఆ విహారంలో పడి, ఈ మధ్య మమ్మల్ని మరిచినట్టున్నారండి, మీరు.
హ హా...భాస్కర్ గారూ...
Deleteనేనెవ్వరినీ మరవలేదండీ...
కాకపోతే కాస్త బిజీ అంతే అదే ఆ తోట లో..!!
ధన్యవాదాలండీ :)
బాగుంది మీ పూలవన విహారం...
ReplyDeleteచక్కని భావంతో కవిత బాగుంది..
'ప్రకృతి'లోని వత్తులు తిరగ బడ్డాయి సరి చేసుకోండి...
చిత్రం ఎంపిక కూడా బాగుంది..
@శ్రీ
శ్రీ గారూ
Deleteపొరపాటు జరిగింది.దిద్దినందుకు ధన్యవాదాలండీ...!
కవిత నచ్చినందుకు కూడా ఆనందం ధన్యవాదాలు అండీ...:)
ప్రకృతినీ, మనసునీ స్వఛ్ఛంగా ఉండనిస్తే అవి రెండూ ఎప్పుడూ పసిపాపంత ముద్దుగానూ, స్వర్గమంత ఆనందంగానూ ఉంటాయి. వాటిని ఛిన్నా భిన్నం చేస్తేనే స్వర్గం కాస్తా నరకంగా మారిపోతుంది.
ReplyDeleteమనసు స్వచ్ఛతని ప్రకృతి ఒడిలో చక్కగా పలికించారీ కవితలో...
అభినందనలు!
పండు గారూ...
Deleteమీ విశ్లేషణాత్మక స్పందనకి సంతోషం అండీ...:)
ధన్యవాదాలు :)
చాలా బాగా రాసారండి.
ReplyDeleteశృతి
Deleteధన్యవాదాలండీ :-)
ప్రకృతి-మనసు ఇవి రెండూ మనకు అనుక్షణం ఉపయోగపడుతుంటాయి.
ReplyDeleteఈ రెండింటినీ కాపాడుకుంటే స్వర్గం ఇక్కడే ఉంది అనేది అక్షర సత్యం.
మంచి పోస్టు . అభినందనలు సీత గారు.
పల్లాకొండలరావు గారూ...
Deleteబాగా చెప్పారండీ
ధన్యవాదాలండీ.:-)
High expectation tho vachchaanemo nenu,
ReplyDeleteInkaa baagaa raayali Seethamma :)
ఒహ్ హర్ష గారూ...
Deleteమీరేమో పాపం స్వర్గం అనేసరికి చాలా ఊహించుకొని చదివి ఉంటారు.ఇక్కడ అది లేకపోయే సరికి :(.
ఈ సారి బాగా రాయడానికి ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలండీ:)
సీత గారూ, పూలను, వెన్నెలనూ, పసి పాప నవ్వునూ,
ReplyDeleteకవి హ్రిదయం ఏదో సందర్బంలో తన కలం తో బందిస్తుందట.
కనుక నవీన కవయిత్రి గారూ మీ కవితకు మా అబినందనలు.
ఫాతిమా గారూ
Deleteబోలేడు సంతోషం అండోయి...!!
బోలేడు ధన్యవాదాలు మీకు...మీలాంటి పెద్దల సలహాలు,ప్రోత్సాహమే మరిన్ని రాయిస్తాయి.
ధన్యవాదాలు ఫాతిమా గారూ...:)
ప్రక్రుతి అందాలకు పరవశించని వారెవ్వరు.మీరు మరింత అందమైన కవిత వ్రాసి మమ్మల్ని పరవశింప జేసారు.good poetry.
ReplyDeleteరవిశేఖర్ గారూ
Deleteచాలా సంతోషం అండీ !!
ధన్యవాదాలు మీకు :-)
ఎక్కడో లేదు అనిపించింది 'స్వర్గం'
ReplyDeleteఇక్కడే తల్లి 'భూమి ఒడి' లోనే
ఒడిలో ఒదిగిన పసిపాపనైన నా 'మనసు'లో
రెండూ చాలా గొప్ప భావాలు.చాలా నచ్చింది.
శైలబాల గారూ...
Deleteచాలా సంతోషం అండీ.
మీకు చాలా ధన్యవాదాలు :-)
నిజమేనండీ సీత గారూ ప్రకృతి ఒడిలోనే సేద దీరగలం.. ఆధునిక జీవనశైలి వీటికి దూరం జరుపుతోందికద...గ్రేట్ ఫీల్..అభినందనలు..
ReplyDelete