సాగిపోదామా....?
గలగలమనే సెలయేరు పై,
చల్లగా జాలువారే నీటి ప్రవాహాన్ని ఆపద్దని...!!
ఎగిరిపోదామా ....?
దూసుకుపోయే గాలిపటం లా,
కమ్మగా గాలికి మన ప్రేమ పరిమళాన్నద్దుకోమని..!!
అల్లుకుపోదామా ?
ఎదిగిపోయే తీగల పై,
ఆకునీవై,పూవు నేనై ఇద్దరినీ ఒదిగుండనివ్వమని..!!
కలిసిపోదామా...??
వాగర్ధాలకే అందని అర్ధం లా,
నిన్నూనన్నూ ఏవీ వేరు చేయలేవనే వాక్యాన్ని చెప్పమని...!!
పారిపోదామా...?
ప్రకృతిపై పయనించే ప్రవాహంలా,
అందనంత ఎత్తులో ఉన్న ఆకాశాన్నే మనల్ని చేరతీయమని ..!!
కానీ ,
నే గీసిన చిత్రం.. |
ఆగిపోదాం....... ఇలా చంద్రుడిలో
ఒకరిలోఒకరం ఒదిగిపోతూ
మనల్నేవి కదిలించకుండా వృత్తంలో ఇలా దాచేసుకొమ్మని ..!!
--
చాలా బాగుంది సీత గారూ!
ReplyDeleteసాగుతూ ఆగిపోయే మీ పయనం...
చిత్రం కూడా బాగుంది...
అభినందనలు...
@శ్రీ
శ్రీ గారూ,
Deleteమీకు నచ్చినందుకు ఆనందం .ధన్యవాదాలండీ :-)
వావ్.. సీత గారు..
ReplyDeleteసూపర్ ఫీలింగ్.. సూపర్ కవిత... సూపర్ పిక్చర్....
మెత్తం మీద సూపర్ అంతే...ఇక మాటలు లేవు..
సాయి గారు
Deleteసూపర్ ధన్యవాదాలండీ:-)
అలా సాగిపోతూ వుండండి .చక్కని కవిత
ReplyDeleteరవిశేఖర్ గారు
Deleteఇంక సాగలేకే అలా ఆగిపోయాం అండీ..
చాలా ధన్యవాదాలండీ:-)
"ఆకాశంలో హంసలమై హాయిగ ఎగిరే గువ్వలమై అలా అలా కులాసాగ తేలిపోదామా "...
ReplyDeleteమీ కవిత చదవగానే నాకు ఈ పాట గుర్తొచ్చిందండీ.. కవిత బాగుంది..
సీత గారూ.. మీ బ్లాగ్ కవితలు చిత్రాలు,సాంగ్ అన్నీ బాగున్నాయండీ ...
రాజీ గారు
Deleteనా బ్లాగ్ కు స్వాగతం అండీ.మీ రాక ఆనందం.భలే పాట గుర్తుతెప్పించారు....
చాలా ధన్యవాదాలు మీకు:-)
అక్షరాలను పొందికగా గుచ్చిన మాలలా,మెరిపించారండి, అభినందనలు. చిత్రం బాగుంది...
ReplyDeleteభాస్కర్ గారు...
Deleteచాలా ధన్యవాదాలండీ :)
సీత గారూ , చాలా బాగుంది మీ కవిత. ఈ భావుకతే నేను ఆశించింది మీ నుండి మీరు రాయగలరు నాకు తెలుసు నేను ఎదురు చూస్తుంది ఇలాంటి కవిత కోసమే. చూసారా ఎంత అలవోకగా రాసారో.. మనసును విప్పి చెప్పేదే కవిత్వం. సంకోచం లేకుండా భావప్రకటన చేయగలగాలి. డియర్ చాలా మెచ్చుకోవాలని ఉంది, ఇలాగే ఇంకా రాయాలి. ఓ మంచి కవయత్రిగా ఎదగాలని దీవిస్తున్నా.
ReplyDeleteఫాతిమా గారు...
Deleteచాలా సంతోషం అండీ.మీరు ఆశించింది ఇవ్వగలిగానని తృప్తి గా ఉంది.మీ ఆశిస్సులకి చాలా ఆనందం.
చాలా ధన్యవాదాలండీ మీకు :)
బాగుంది సీతగారూ మీ కవితపయనం.
ReplyDeleteప్రేరణ గారూ,
Deleteధన్యవాదాలండి:-)
భావాన్ని అందంగా కవితలో పొందికగా మాటల కూర్పు...బాగుంది.
ReplyDeleteగుండ్రని చంద్రునిలో ఒద్దికగా ఒదిగిన జంట చిత్రమూ బాగుంది. ఊహా, బొమ్మా బాగున్నాయి. మరిన్ని మీరు గీయబోయే చిత్రాలు చూడాలని ఆశిస్తూ...
పండు గారూ ,
Deleteనా ఊహా ,బొమ్మ మీరు నచ్చినందుకు సంతోషం :-).ఏమో ప్రయత్నిస్తాను బొమ్మలు గీయడానికి...
చాలా ధన్యవాదాలండీ :)
సీత, మీ బ్లాగ్ ని మొదటి సారిగా చూస్తున్న, అచ్చమైన తెలుగింటి ఆడ పిల్ల భావాలు నా మనసు కి ఆహ్లాదాన్ని కలిగించినాయి.
ReplyDelete-- భరత్
భరత్ గారు
Deleteస్వాగతం అండీ...!!
మీకు నచ్చి మెచినందుకు ఆనందం.
ధన్యవాదాలండీ :-)
nice seeta... picture bagundi.
ReplyDeletethank you so much sruti....:-)
Deleteమీరు గీసిన చిత్రం కూడా బాగుంది సీతమ్మా!
ReplyDeleteఫోటాన్ హర్ష గారు....
Deleteచాలా ధన్యవాదాలండీ :-)