Sunday, 15 July 2012

అంధురాలినయిపోయాను..!!


 
ద్వేషపూరిత హృదయాలని
దేశభక్తి తో నింపాలని 
 తెలిపి తెలిపి మార్చలని తపిస్తూ,


ఆశాపాశాన్ని  తెగ నరకాలని 
ఆనందానికి అవధులు కట్టాలని 
 తలచి తలచి తల్లడిల్లుతూ,

హత్యలూ హింసలూ ఆపాలనీ 
వాంచలూ వేధింపులూ ఆగాలనీ
ఇలా కలలని కలిపి కలిపి అలసిపోతూ,


తల్లితండ్రులు బిడ్డల కందించే 
ఆప్యాయత వారు తిరిగివ్వాలనీ
ఆనందామృతంలో వారుండాలనీ ఆశిస్తూ, 

మగువల పై అరాచకాలని ఆపాలనీ
మగువలూ మంచిమనసుతో మారాలనీ
మన జీవితాలలో బంధాలు శాశ్వతమవ్వాలనీ,


స్వార్ధాన్ని వదలాలని
పరమార్ధం కై పరుగులు తీస్తూ 
అర్ధమే లేకుండా పోయిన ఈ,

జీవితమనే లోకం లో
జీవించాలనే తపన తో
వెలుతురికై వెతికి వెతికి...

అంత్యములో   నిశీధి నే చేజిక్కించుకొని 
 అంధకారం తో  అంధురాలినయిపోయాను..!!

--సీత...

29 comments:

 1. సీత గారూ,
  సమాజాంతో పోరాడి జీవితమే కడకు ఓడిపోయి తనను తానే ప్రశ్నించుకుంటున్నట్టుగా ఉంది మీ కవిత. చుట్టూ ఉన్న సమజాన్ని ఎత్తి మరీ చూపారు....
  బాగుందండీ, అన్ని రకాల భావాలనూ పలకించగలనని నిరూపించారు.
  అభినందనలు!

  ReplyDelete
  Replies
  1. పండు గారు,
   ఓటమి పాలయినప్పుడు ప్రశ్న లేకదా అండీ అన్నీ...
   మీ ప్రోత్సాహానికి బోలెడు ధన్యవాదాలండీ...!!

   Delete
 2. Heart Touching గా ఉంది సీత గారు...
  మీ ఆశయాలు చాలా బాగున్నాయి అండీ.. అంధకారం లో ఉన్నంత మాత్రాన అంధులంకాము. ఆ చీకటిని పారద్రోలే భానుకిరణంలా మీ లాంటి వారు మారాలి..
  చాలా బాగా రాసారు.. keep writing...

  ReplyDelete
  Replies
  1. సాయి గారు
   అంధకారంలో ఉన్నంత మాత్రాన అంధులము కాదు.బాగా చెప్పారండీ..
   చాలా ధన్యవాదాలు మీకు :)

   Delete
 3. anni korikalu korukonni, alaa tragedy chesarentandi,
  chaalaa bhaagha raasaaru, good one, keep writing.

  ReplyDelete
  Replies
  1. life is a tragedy
   కదండీ భస్కర్ గారు.
   అందుకె దాన్నలా ముగించాను....
   ధన్యవాదాలండీ

   Delete
 4. స్వార్ధమే ఈ అనర్ధదాయకం! - అది తుంచుకునుటే క్షేమదాయకం !!

  ReplyDelete
  Replies
  1. అరవింద్ గారు
   స్వాగతం అండీ...!
   అంతే కదా మరి ...
   ధన్యవాదాలండీ మీకు

   Delete
 5. AnonymousJuly 15, 2012

  మీరే కాదండీ అందరమూ అంధులమే.
  చక్కగా ప్రశ్నించారు.
  చాలా బాగుంది సీత ..

  ReplyDelete
  Replies
  1. అంతే నంటారా అజ్ఞాత గారు
   సరే అయితే ...ధన్యవాదాలండీ :)

   Delete
 6. మీరనుకున్న వన్నీ సమాజం లో జరగాలని ఆశిస్తూ ఉందాము.అంతే కానీ ఓడిపో కూడదండి.మంచి భావాలు.

  ReplyDelete
  Replies
  1. రవిశేఖర్ గారు ,
   అంతే నండీ ఆసిద్దాం...:)
   ధన్యవాదాలండీ మీకు :)

   Delete
 7. AnonymousJuly 16, 2012

  Be optimistic

  ReplyDelete
  Replies
  1. Sarma gaaru,
   iam always optimistic sir.:)
   but i feel sometimes like this.
   thank you very much sir :)

   Delete
 8. AnonymousJuly 16, 2012

  ఏంటి సీతమ్మా ఇది? ఏమిటీ నిరాశా వాదం సీతమ్మా?
  గీతలో కృష్ణుడు చెప్పినట్టు

  Paritranaya sadhunam vinashaya cha dushkritam.
  Dharma sansthapanarthaya sambhavami yuge yuge.
  (Gita 4:8)
  For the up-liftment of the good and virtuous,
  For the destruction of evil,
  For the re-establishment of the natural law,
  I will come, in every age.


  మీరు ఈ నిరాశావాదం వదిలి, ఆ క్రిష్ణయ్య ని కీర్తిస్తూ, పిలుస్తూ రాయండి, అన్నిటినీ వధించడానికి వస్తారు,
  కనీసం మీ టపాలు చూడటం కోసమైనా తప్పక వస్తారు,. :)

  --
  ħ

  ReplyDelete
  Replies
  1. హర్ష గారు
   అంతే నంటారు మరి....కృష్ణయ్య గీతకి తిరుగేముంది మరి
   ఆయననే పిలుద్దాం అంటారు సరే అలాగే ..:)
   చాలా ధన్యవాదాలండీ :)

   Delete
 9. సీత గారు,
  మీరు చెప్పినట్లు మన దేశం లొ అంధకారం తొలిగిపొవాలని మళ్ళి పాతకాలం రోజులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటునాను

  ReplyDelete
  Replies
  1. నిత్య గారూ
   హమ్మయ్య...మీరు పట్టుకున్నారన్నమాట అసలు విషయం ...బో...లేడు ధన్యవాదాలండీ :)
   మన అందరి కోరికా ఒకటే తీరుతుంది లేండి తప్పక...

   Delete
 10. mito paatu memu andariki manchi rojulu raavaalani korukuntu....baavundi mi kavita

  ReplyDelete
  Replies
  1. manju gaaru,
   let us hope for the best .
   thank you so much :)

   Delete
 11. అందులోని కొన్ని మన చేతులలో ఉండేవి..
  ఆ సమస్యల్ని చేదించాలి...
  కష్టతరమైన వాటిని ఎలా రూపు మాపాలో..అలోచించి...ఆచరణలో పెట్టాలి..
  మంచి ఆలోచన...but think positive...
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారు
   భలే చెప్పారు నిజమే మన చేతిలో లేనిదేముంది అండి..
   i will surely think +ve..చాలా ధన్యవాదాలండీ:)

   Delete
 12. సీత గారూ, అద్భుతంగా రాసారు, భావం ఏది అని కాదు ముఖ్యం, ఎలాంటి బావాన్నయినా మంచి బాషతో ముడివేయటం. చాలా అందంగా భిన్నంగా ఉంది. మీకు ఆ దేవుని ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలి.

  ReplyDelete
  Replies
  1. ఫాతిమా గారూ
   చాలా సంతోషం అండీ...!!
   బో..లెడు ధన్యవాదాలు అండీ :)

   Delete
 13. సీత గారు చాలా బాగా రాసారు picture కవితకి excatly suitable అబినందనలు.

  ReplyDelete
  Replies
  1. రమేష్ గారూ
   ధన్యవాదాలండీ..:)

   Delete
 14. సమాజాన్ని ఎత్తి చూపారు మీతో మీరు.
  చాలా బాగుంది.
  ending is very graceful.

  ReplyDelete