Sunday 29 January 2012

తల పై పించము , పెదవుల పై వేణువు..

నెమలి పించాన్ని చూస్తే మనకి ముందు గుర్తోచేది కృష్ణుడు కదా??????????
అసలు నెమలి పించం ఎందుకు ధరిస్తాడు?


ఈ ప్రపంచం లో ఉన్న అన్ని జీవులలో అత్యంత పవిత్రమయిన జీవి నెమలి .గోపికలు ఎంతమంది తో ఉన్నా అతను అస్కలిత బ్రహ్మచారి గా చెప్పబడ్డాడు.
అందుకే ఆ కోవ కే చెందే ఎంతో పవిత్రమయిన జీవి నెమలి కనుక దానిని తలపైన అన్నిటి కంటే అగ్రస్థానం లో,బ్రహ్మ స్థానం లో ఉంచాడు .

అలాగే ఇంకో చిన్న విషయం !

ఒక సారి ఒక మహర్షి పిల్లల గ్రోవిని అడిగాడట ...నేనింత తపస్సు పూజలు చేసినా నాకు దక్కని భాగ్యం నీకెలా దక్కింది ?కృష్ణుడు నిన్ను ఎందుకు చేత  ధరిస్తాడు?ఆయన పెదవుల పై పలికే 
భాగ్యం నీకెలా దక్కింది ? 

దానికి ఆ పిల్లనగ్రోవి సమాధానం ఏమి ఇచిందంటే ...

ముందు నాలో ఏముందో చోడు అని అడిగిందట.అది ఒక ఖాళి గొట్టం.
నాలో ఏమి ఉండదు.ఏ కల్మషము లేదు .ఏ కోరికలు లేవు .. కామ, క్రోధ,లోభ ,మధ, మొహ,మాత్సర్యాలు అను అరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకుంటే జీవితం ఒక స్వరం లా సాగి పోతుంది ..
తనకంటూ ఏదీ కోరని వారినే దేవుడు తన మధుకలశాల వద్ద ఉంచుకుంటాడని  చెప్పిందట ....

చూసారా ?మనం ఎంత పవిత్రం గా ఉండాలో కృష్ణుడు చెప్పకనే చెప్తున్నాడు ...

--సీత 

4 comments:

  1. baga chepparu nestam.... venuvu gurunchi & nemali pincham gurunchi andi...

    ReplyDelete
  2. chala bagundi manushulandharu pilana grovi la kama krodha loda madhalu anevi lekunda unte yi prapancham sudhamayam avuthundi i hope it happens

    ReplyDelete
  3. yes...i too hope that..thank u :)

    ReplyDelete