Friday 8 June 2012

నిను చేరాలని ఉన్నా.....


కనులు కలవరిస్తున్నా 
కలలు కలవరపరుస్తున్నా 
                                                           


పెదవి పలకరించమన్నా 
పిలుపు పిలవమంటున్నా 

మనసు మనవిచేయమన్నా
మాట మొరపెట్టుకొమన్నా 


చేతులు చేరదీయమంటున్నా 
చెలి నై చెంతచేరమంటున్నా 

అడుగులు నిన్నే చేరమంటున్నా
ఆశ లన్నీ అడగమంటున్నా 


నీడ నీతో నడవమంటున్నా                              
నీ సగమై సాగామంటున్నా

భావం బంధించమంటున్నా
నీ భావానికి బదులివ్వమంటున్నా 


పాదం పరిగెత్తదంటున్నా 
నీ ప్రేమ ని  పంచుకోమంటున్నా 

"నీ పరిచయం" అనే పేజీ ని పెనవేసుకొని 
 నేనిలా నన్ను వదిలేసి సాగిపోతూనే ఉన్నా.....!!!
నిను చేరాలని ఉన్నా,నే చేరలేకున్నా...

--సీత....

26 comments:

  1. సూపర్...
    అసలు పదాలు ఎలా దొరుకుతయండీ మీకు?

    ReplyDelete
    Replies
    1. హర్ష గారూ.....
      చాలా థాంక్స్ అండీ.....
      ఎలా అంటే కృష్ణుణ్ణి అడగాల్సిందే మరి ..;) :)

      Delete
  2. Wow. Super Seetha garu...

    ReplyDelete
  3. హ హా...చక్కని ఫ్లోతో ఈజీ గా రాసేశారు భావాన్ని మాటల్ల్లో
    బాగుందండీ!
    ఎప్పటికైనా చేరాలని కోరుకుంటూ...

    ReplyDelete
    Replies
    1. పండు గారూ...
      చాలా సంతోషం ధన్యవాదాలు అండీ,..!!:)

      Delete
  4. హాయ్! ఇక్కడ నేనొక సర్‌‌ప్రైజ్ కదా మీకు? నా బ్లాగ్ లో మీ స్పందనచదివి ఆ అడుగుల్లో అడుగేసుకుంటూ ఇక్కడిదాకా వచ్చేను. మీ ఆలోచనలన్నింటినీ కాకపోయినా కొన్ని చదివాను. మీలో ఉన్న భావుకత్వానికి అభినందనలు....చిన్న సలహా! ఎఫ్బీలో ఓ గ్రూపుంది "ప్రేమని ప్రేమించు ప్రేమకై" అని..అక్కడ మీ కవిత్వం మీ ఆలోచనలు ఇంకా పదిమందికీ తెలిసే అవకాశమూ అందరూ చదివే అవసరమూ ఉంది..ప్రయత్నించండి.లేదంటే నా మెయిల్ ఐడీకి కాంటాక్ట్ చెయ్యండి. మరోమారు నా కవితలపై మి అభిప్రాయాన్ని రాసినందుకు కృతజ్ఞతలు

    ReplyDelete
    Replies
    1. వాసుదేవ్ గారూ
      నిజం గా మీ రాక ఆస్చర్యమే....నా భావుకత మీకు నచ్చినందుకు ఆనందం గా ఉంది...చాలా సంతోషం.....మీరు నా కవితలు చదివే అవసరమూ ఉందన్నారు.చాల సంతోషం అండీ.
      తప్పకుండా ప్రయత్నిస్తాను .....కాకపోతే కాస్త ఆలస్యం అవుతుందేమో....చాలా సంతోషం మీ రాక+మీ స్పందన ....

      Delete
  5. సీతగారూ , మీ ప్రతి పలుకూ గమనిస్తూనే ఉన్నా ,ఏమైయి ఉంటుందా అనుకుంటూనే ఉన్నా ..... చాలా బాగారాసారూ అంటున్నా ఇక ముందు కూడా ఇలాగే రాయాలని కోరుకుంటున్నా .

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారూ...
      మీరొస్తారని అనుకుంటునే ఉన్నా...
      మీ స్పందనతో మనసు దోచేస్తారని తలుస్తూనే ఉన్నా...!! ;) :))
      అలాగే చేసారు మీరు.......
      చాలా సంతోషం ఫాతిమా గారు ధన్యవాదాలు మీకు....

      Delete
  6. సూపర్ సీతగారూ...

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ శ్రుతిగారూ.....:)

      Delete
  7. చాలా బాగుంది సీతగారు....చిన్న చిన్న పదాలతో గొప్ప భావం పలికించేసారు...

    మనసుంటే మార్గం ఉండకపోదు.. ప్రయత్నిస్తే తప్పక చేరుకుంటారు.... చేరుకోవాలని ఆకాంక్షిస్తూ...

    --సాయి

    ReplyDelete
    Replies
    1. సాయి గారూ
      చాలా సంతోషం .ధన్యవాదాలు మీకు....
      ప్రయత్నించడమే జీవితం కదా.!!;)
      మీ ఆకాంక్ష కి మరోక్క మారు ధన్యవాదాలు

      Delete
  8. వావ్ సీత గారు,చాలా బాగా రాసారు.....
    నిజం గా సూపర్ గా ఉంది...మీలోని భావాలు ఇలా మాకోసం పలుకుతూనే ఉండాలని ఆకంక్షిస్తున్నాను..

    ReplyDelete
    Replies
    1. నిత్య గారూ...
      స్వాగతం అండీ...!!
      చాలా సంతోషం ....ఈ సీత పలుకులు మీకు నచ్చినందుకు సంతోషం.ధన్యవాదాలు అండీ.!

      Delete
  9. chaala bhagha raasarandi,
    cherathaarandi, mee gamyam thappaka,
    best of luck.
    naa kavithalu chdivi spandisthunnanduku, thank you andi.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు
      చాల సంతోషం గా ఉంది .ధన్యవాదాలు. :)
      u r welcome.

      Delete
  10. లవ్లీ అండీ సీతగారూ..అభినందనలు..

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ సో మచ్ వర్మ గారు... చాలా సంతోషం .:)

      Delete
  11. Replies
    1. మంజు గారు చెప్పాలంటే .....
      ఇంకేం ఉంటుంది ధన్యవాదాలు తప్ప...!!;) ;)
      చాలా సంతోషం మంజు గారూ......!!
      :)

      Delete
  12. సీత గారూ!
    చాలా చక్కగా ఉంది...
    చిత్రం కూడా బాగుంది...
    మీ పలుకులు బాగున్నాయండి...:-)
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. ఈ సీత పలుకులు మెచ్చిన శ్రీ గారికి ధన్యవాదములు........!!
      :):)

      Delete