Tuesday 19 June 2012

నీ మురళీ రవళి....


నాకిష్టమయిన కృష్ణుడు..
తెల్లని మల్లెలు అల్లిన గానం 
మెల్లగా పలికెను మోహన  రాగం
చల్లని చూపుల ఓ నల్లని స్వామీ 
జల్లించా నిన్ను  విరజాజులతో.....!!

నీ గాన సుధలకు వేణువుల పొదలు
 చైతన్యమై మా చే  పలికించే నీ కృతులు...
నీ  ముద్దుమాటలకు మురిసిన మా మోములు
మహదానందమై మరిపించే ఈ లోకములను....!! 


జలకాలాడే గోపికలు , 
నీకై వేచే నీ స్నేహితులు,
నిన్నే స్మరించే హృదయాలు..
విన్నవిన్చుచున్నారు ఓ మానసచోరా

 "మురళీ రవళి ని ఆపకు.....
      నీ  రాగాసరోవరము లో 
      మమ్ము ఇలాగే నిలిచిపోనివ్వవా ......"

కృష్ణా.......

       నీ మురళీ గానము చే మాయ  చేసి 
        మమ్ము మహిమ లతో  కాపాడెదవు....
.






మీ   సీత.....

24 comments:

  1. nice. meeku krishnudu ante istama?

    ReplyDelete
    Replies
    1. శృతి గారు,
      ధన్యవాదాలండి ......
      నాకు కృష్ణుడంటే చాలా చాలా ఇష్టం..!!

      Delete
  2. ఛాలా బావుంది. ఎంత శ్రద్ద కనిపించారో! అద్భుతంగా పిక్స్ జత పరచారు.
    నాకు చాలా నచ్చింది, Thank you very much!!

    ReplyDelete
    Replies
    1. వనజ గారు ...
      మీ స్పందన కు చాలా ఆనందం గా ఉండండి...!!
      బోలెడు ధన్యవాదాలు....

      -- సీత.....

      Delete
  3. చాలా బాగుంది... సీత గారు....

    ReplyDelete
    Replies
    1. సాయి గారు,
      ధన్యవాదాలండి...!!

      Delete
  4. భలే ముద్దొస్తున్నాయి బొమ్మలు....
    Nice presentation...

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు.....
      చాలా రోజులకి వచ్చారు....
      చాలా సంతోషం అండీ మీరు రావడం.
      మీకు నచ్చినందుకు ఆనందం.
      thanks a lot...:)

      Delete
  5. Presentation keka.
    Kittappa chust padi pothaaru :)))

    ReplyDelete
    Replies
    1. హర్ష గారు....
      థాంక్ యూ వెరీ మచ్...
      కిట్టప్ప (ఎలా చూస్తారు??) చుస్తే బాగుండు కదా...............;)
      చాలా సంతోషం :) :)

      Delete
  6. mee krishna prema bhagundandi, chinni krishnudi photo entha bavuntondo.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు,
      కృష్ణుడు బొమ్మలన్నింటిలో నాకు చాలా ఇష్టమయినవి ఆ చిన్ని కృష్ణయ్య దీ , నా దగ్గర ఉండేదీ...!!
      ఇవి ఎంత ఇష్టమో చెప్పలేను..
      ధన్యవాదాలు ..........

      Delete
  7. మురళీ కృష్ణునిపై సీత పలికిన రవళి....బాగుందండీ!

    ReplyDelete
    Replies
    1. పండు గారు...
      ధన్యవాదాలండి... :)

      Delete
  8. చాలా బాగుంది సీత గారు.,కృష్ణుడెంత బాగున్నాడో మీ కవిత అంతే బాగుంది.చాలా నచింది మీ బ్లాగ్ నాకు.

    ReplyDelete
    Replies
    1. 123 గారు, స్వాగతం...!!
      మీ రాక ఆనందం.
      ధన్యవాదాలు మీకు...... :)

      Delete
  9. your blog maintainance is very good.
    template is peaceful to see.
    your thouhts and imaginations are cute.
    your poetry is lovable.
    your love towards lordkrishna is appreciable.
    congrats miss.seetha.

    ReplyDelete
    Replies
    1. shyamsundar garu,
      welcome to my blog...!!
      thank you so much ....!!

      Delete
  10. కన్నయ్య చిత్రములు ముద్దొస్తున్నాయండీ...

    కిష్టుడు
    అందరికిష్టుడు
    ఆ నల్లని రూపం
    ఎప్పటికీ అపురూపం
    ఆ మురళీ గానము
    మరియెచ్చటనూ గానము.

    ReplyDelete
    Replies
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారు ,
      చాలా చక్క గా చెప్పారు....:) :)
      ధన్యవాదాలండి... !!

      Delete
  11. చాలా బాగుంది సీత గారూ!
    మీ మోహనుని కీర్తనం
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు
      ధన్యవాదాలండి ....:)

      Delete
  12. చిలుక నీతో నేమి చెప్పు చున్నది కృష్ణ !
    హాయిగా చెంపకు చేయి చేరె
    మురళిపై వ్రేళులు సరిచేయ గనె కృష్ణ !
    చూపులు మా తనువు చుట్టు చేరె
    మృదువారగ మురళి పెదవి చేరగ కృష్ణ !
    ముల్లోకములు నీదు మ్రోల చేరె
    చూపు మరలనీని రూపుతో మము కృష్ణ !
    ఏమార్చినావు మమ్మిట్లు చేర

    కవితలో మల్లెలు గలిపి కట్టి దండ
    ప్రియముగా “ సీత “ కొలిచి అర్పించె కృష్ణ !
    నల్ల నయ్య! నీకు ప్రణతు లుల్ల మరసి ,
    మురిసి ముద్దియ్యరా ముద్దు మోవి కృష్ణ !
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు గారు,
      చాలా చక్కగా చెప్పారు మీరు ....!!!
      చాలా సంతోషం గా ఉంది...ధన్యవాదాలు..!!

      Delete