తరంగమై ఆలపించగలదు అనంత సంగీతాన్ని
తరంగిణియై అభినయించగలదు నాట్యాన్ని
ఎగరగలదు గాలిలో ఆవిరియై
చల్లార్చగలదు అవనిని తుషారమై
వెలిగించగలదు దీపాన్ని మిణుగురుదేహంలో
ఆర్పగలదు మన దేహదీపాన్ని క్షణికంలో
దూరగలదు రాళ్ళసందులో
దాటిపోగలదు శిఖరాలను
పెరగగలదు సముద్రమంత
కాగలదు సూదిమొనంత
పంచభూతాలలో ద్రవం
మన పాలిటి కనకం
స్వల్పంగా అరచేతి లో ఇముడుతుందని చిన్నచూపేలా..?!?!
'ఆడదాని మనసు'లా ఎగసే 'నీటి' గొప్ప తనాన్ని మరిస్తే ఎలా..??!
--సీత ....
చాలా చక్కగా ఉంది సీత గారు...
ReplyDeleteఆడవారి మనసును నీటితో చక్కగా వర్ణించారు...సూపర్..
సాయి గారు...
Deleteచాలా ధన్యవాదాలండీ....:)
నీటిని గురించి భలే చక్కగా చెప్పారండి, ఏదో కొత్త ప్రయోగంలా వుంది, మనసు గురించేమో అనుకున్నా మొదట.
ReplyDeletesave water, save world.
keep writing.
భాస్కర్ గారూ,
Deleteగమనించండి....అది మనసు గురించి కూడా అండీ....
కొత్త ప్రయోగమే ...!!
ధన్యవాదాలండీ:)
నాకెందుకో కడలి బ్లాగ్ సుభ,జలతారువెన్నెల,రసజ్ఞ గార్లు,
ReplyDeleteప్లస్ ఈ సీతపలికే గార్ల బ్లాగులన్నీ ఒకేలా అనిపిస్తాయి!
ఇవన్నీ ఒక్కరే నిర్వహిస్తున్నారా ఏమిటి ఇలా మారు పేర్లతో ??
అన్న సందేహం కూడా కలుగుతున్నది..
అజ్ఞాత గారూ..
Deleteఅదేమీ లేదండీ..!!ఎవరి ఆలోచనలు వారివి ...కానీ మీకలా అనిపించడానికి కారణం నా ఉద్దేస్యం లో ఏమైయ్యుండచ్చంటే అందరం ఆడవాళ్ళం కదా మా మనసులు ఒకేలా ఆలోచించి ఉండచ్చు ఏమో..
చాలా బాగుంది సీతమ్మా!
ReplyDeleteహర్ష గారూ
Deleteధన్యవాదాలండీ :)
నీటి గొప్పదనాన్ని చాలా చక్కగా చెప్పారు సీత గారూ...
ReplyDeleteజ్యోతిర్మయి గారూ...
Deleteధన్యవాదాలండీ :)
Very nice
ReplyDeletekrsna gaaru...
Deletevery very thank you :)
welcome to my blog...
నీటిని , మనసును , పోల్చుతూ చక్కగా రాసారండి.
ReplyDeleteఆనందం గారు..
Deleteఆనందమండీ ..!!
మీకు ధన్యవాదాలు :)
నీటి గొప్పదనాన్ని చాలా చక్కగా చెప్పారు సీత...
ReplyDeleteశృతి
Deleteచాలా ధన్యవాదాలు మీకు :)
బిందువు...బిందువు కలిస్తేనే కదా..
ReplyDeleteసింధువు అయ్యేది...
"ఆర్పివేయగలదు అవనిని తుషారమై."
ఈ వాక్యం అర్థం కాలేదు సీత గారూ!
అవని అంటే...భూమి కదా!
వివరించగలరు..
మగువ మనసు, నీరు రెండూ అమూల్యాలే...
చాలా బాగుంది...
@శ్రీ
శ్రీ గారు ,
Deleteదానికి అర్దం ఏమిటంటే
తుషారము అంటే చల్లని,మంచు అల అనమాట
అవని అంటే భూమాత కదా..
అంటే వేడి కి అల్లాడిపోయిన భూమిని చల్లదనం తో చల్లార్చగలదు అనే దానిని నేనలా ఆర్పివేయగలదు అన్నాను...
అంతే ..!
చాలా ధన్యవాదాలండీ :)
నాకు మీరు ఏమి వ్రాయాలనుకున్నారో కవిత చదువుతుంటే అర్థమౌతోందండి...
Deleteకానీ అర్పివేయటం...చల్లార్చడం వేరే అర్థాలు వస్తాయి...
అందుకే అడిగాను...మీరు పొరపాటున
చల్లర్చగలదు...శాంతింప చేయ గలదు...
ఇలాంటి పదాలకి బదులుగా అర్పి వేయగలదు వాడారని...:-)
@శ్రీ
శ్రీ గారూ...
Deleteనేను ఏ ఉద్దేశ్యం లో అలా అన్నాను అంటే ,
ఎండ తో వేడి కి మండిపడుతున్న భూమి ని చల్లని మంచు లా ఆర్పగలదు అని నా అంతరార్ధం అండీ.అందుకని ఆర్పివేయగలదు అని రాశాను అండీ :-)
మీకు చాలా ధన్యవాదాలండీ :)
ఆలస్యానికి మన్నించగలరు.
సీత గారూ, కవిత బాగుంది చక్కని వర్ణన, అవని స్తానంలో "అనలము" అన్న బాగుండేదేమో, బాష కన్నా బావం బాగుంది. హ్రిదయానికి హత్తుకునేలా.
ReplyDeleteఫాతిమా గారూ,
Deleteచాలా ధన్యవాదాలండీ :)
అనలము అనే ఆలోచన నాకు రాలేదండీ...
ఎందుకో వర్షం కోసం ఎదురుచూపులో కడా అలా అనిపించింది...!!
:)
great mam :)
ReplyDeletethanks mahesh garu :)
Deleteచాలా బాగా వ్రాశారు. లోతైన భావం..చక్కని భావప్రకటన
ReplyDeleteమీ బ్లాగ్ డిజైన్ చాలా బాగుంది.
vanaja gaaruu...
Deletechaalaa santOsham amDI.
bOlEDu dhanyavaadaalu meeku :)
'ఆడువారి మనసు'కీ 'నీరు'కీ అద్భుతమయినపోలిక ...చాలా గొప్ప ఆలోచన.
ReplyDeleteసీత గారు అభినందనలు.
మరోసారి సీతగారు చక్కగా పలికారు..
123 గారూ ,
Deleteధన్యవాదాలు మీకు :)
మంచి పోలిక .కవితా గమనం బాగుంది.
ReplyDeleteరవిశేఖర్ గారూ
Deleteధన్యవాదాలండీ :)
పంచభూతాలలో ఒకటైన నీటిని చక్కగా వర్ణించారు.
ReplyDeleteచివర్న ఆడ పిల్ల మనసుని నీటి బిందువుతో పోల్చి చెప్పిన తీరు బాగా నచ్చింది.
చిన్నీఅశ గారూ
Deleteధన్యవాదాలండీ :) :)
Nice song apt for this post!
ReplyDeletehttp://www.divshare.com/download/12023222-b82
ohh...thank you so much :)
Deleteసీత గారు, మీ కవిత చాలాబాగుంది. చివర్లొ ఆడడవారి మనుసుని నీటి తొ చాలాబాగా పొల్చారు.
ReplyDeleteనిత్య గారూ
Deleteచాలా ధన్యవాదాలండీ :)
బాగుంది ప్రవాహం లా !
ReplyDeleteకొండలరావు గారు..
Deleteసంతోషం అండీ.:)
ధన్యవాదాలు మీకు :)
parledu kaani inka improve avvali .doubts emanna unte nanne adagande naku anni telusu.lol(no pun intended)
ReplyDeletethanooj garu,
Deletewelcome to my blog :)
thank you ...
mimmalne adugutaa eesaari ....;)
Vry nice mam :) grt comparision
ReplyDeletesai garu,
Deletethanku very much :)
Sita garu...chala bavundandi me kavitha...:)
ReplyDeletevalli garu
Deletewelcome to my blog
thanik you so much :)
భాష కన్నా భావం బాగుంది.కాని ఒకరు సూచించినట్లు,'తుషారం అవనిని ఆర్పగలదు 'అన్న వాక్యంలో అన్వయం కుదరదు.మార్చి రాస్తే బాగుంటుంది.
ReplyDeleteకమనీయం గారూ
Deleteస్వాగతం అండీ :)
శ్రీ గారు,మీరు చెప్పినట్టు మార్చాను అండీ:)
ధన్యవాదాలు.