Thursday 26 July 2012

కృష్ణా...!! ఎచట నీ స్థానం??

ముందు గా ఈ పోస్ట్ చదవడానికి వచ్చిన వారందరికీ ఒక చిన్న మనవి ..
నేను నా ఊహలని ఇలా కృష్ణుడి పలికినట్టుగా ,నా అనుభవాలు,నా ఊహలు, నా కవితలతో పాటు చెబ్దాం అని ప్రయత్నం. ఇలా రాయచ్చో లేదో నాకు తెలీదు ...కాని రాసేసా...!!


ఆ'రాధ'నై కృష్ణుణ్ణి అడుగుతున్నా....!!  


  
సీత :కృష్ణ , నాదొక పెద్ద సందేహం తీర్చవూ??

కృష్ణ :: తప్పకుండా అడుగు మరి ...!!

 సీత::  నీ స్థానం ఎచట కృష్ణ...??

కృష్ణ ::అంటే ..??

 సీత ::

"గోపాలుడి గా గోవుల వద్దనా?
  బాలుడి వై యశోద ఒడి లోనా?

  ప్రేమించే రాధ హృదయం లోనా?
  పరిపాలించే అష్ట భార్యల ఆనందం లోనా?

   గోపికలతో బృందావనం లో నా?
   స్నేహాన్ని కోరే మిత్రుల సన్నిహిత్యం లోనా?

   నెమలి నాట్యాన్నానందించడం  లో నా?
   వేణువు వదిలే  మధురమయిన శ్వాస లోనా?

  ప్రేమగా నిన్నల్లె మల్లెల మాలల లోనా?
  కాళింది తలపై నటియించిన బాలతెజస్సులోనా?

     భక్తి గా భజించే హృదయాల లో నా?
     నిన్ను కీర్తనలతో కట్టేసే  మనసులలోనా?

ఇన్ని స్థలాలా నీకు కృష్ణా......
ఎచట ఉంటానంటావ్ శాశ్వతం గా.....??..."

కృష్ణ :: అయ్యో ......మరలా నన్నే అడుగుతున్నావా?
    
 సీత ::     అదేమిటి కృష్ణా?

కృష్ణ:: సరే నువ్వే అడిగావు  కదా అన్ని చోట్ల అని...మరి నీకు నేను ప్రశ్న గానే సమాధానం ఇస్తాను ..!!
         ఎచట లేనంటావ్???
 సీత :: కృష్ణ...అర్ధమయింది నీ తత్త్వం 
          "నిన్ను తలచే ప్రతి చోటా నువ్వుంటావ్ శాశ్వతంగా ......!!"
కృష్ణ:: అంతే గా మరి...!!


కృష్ణా అని ఆర్తి గా పిలిస్తే పలికే నా దైవం.కృష్ణా అని మనసారా తలిస్తే చాలు అన్నీ సమస్యలూ టక్కున మాయమయిపోతాయి...
మహిమలు అనిర్వచనీయం , మాయలు అద్వితీయం...
        తనని స్మరించే  అన్నింటిలో తానుంటాడు.......!!    



ఇంకా ప్రేమ,సమస్యలు,  జీవితం ఇంకా వీటి గురించి కృష్ణుడు ఏం చెప్తారో తరువాత వాటిల్లో ....!!
కృష్ణాష్టమి కోసం అని ఇవి ఎప్పటినుండో తాయారు  చేసిఉంచుకున్నాను.
ఇప్పుడు ఇలా మీతో ఒక్కోటి పంచుకుంటున్నాను :)

19 comments:

  1. Seetha Garu... Super andi...
    Krishna antata untadu ani baga chepparu (ayana Sarvantaryami)

    Waiting for next posts...

    -sai

    ReplyDelete
  2. మీరు అర్జెంటు గా పేరు మార్చుకోవాలండి,
    రామ, రామ అంటూ రామనామ స్మరణలో మునగాల్సిన మీరు, ఇలా,....నో,no, no.......
    మీ పేరు ఇక పై రాధ(ఖాయ చేసుకోండి,సరేనా..హ,హ,హ..)
    చక్కని ప్రయోగం, అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు.. ఆ కృష్ణయ్య మీద భక్తి, ప్రేమ ఉండాలే కానీ రాధ అయితే నేం, సీత అయితే నేం అండీ...

      Delete
    2. భాస్కర్ గారూ
      అంతే నంటారా..??
      తప్పదంటారా...??
      సాయి గారు చెప్పింది కాస్త ఆలోచించండి..;)
      చాలా ధన్యవాదాలండీ :)

      సాయి గారు
      ధన్యవాదాలండీ:)

      Delete
  3. బాగుంది సీత గారూ!
    కృష్ణా- సీతా సంవాదం..:-)
    "ఇందుగలడు అందు లేడు అని సందేహం వలదు...
    ఎందెందు వెదకిన అందందే గలడు.."
    అభినందనలు మీకు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు
      భలే పాయింట్ పట్టేసారు...!!
      చాలా సంతోషం గా ఉంది
      ధన్యవాదాలండీ :)

      Delete
  4. బాగుంది సీతా కృష్ణుల సంవాదం!

    ReplyDelete
    Replies
    1. చిలమకూరు విజయమోహన్ గారూ
      సీత పలుకులకి స్వాగతం అండి..!!
      మీకు నచ్చినందుకు సంతోషం అండీ:)
      ధన్యవాదాలు..!

      Delete
  5. nill knowledge. ok cheppindi seethamma kadaa baagundi

    ReplyDelete
    Replies
    1. daivam anni chotala umtaadu ani andi ...!!
      fathima garu,
      chaalaa happy ga umdi andi..!
      thank you so much :)

      Delete
  6. భక్తిలో తన్మయత్వం చెందుతున్నారు.సంభాషణ బాగుంది.

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారు
      భక్తి అన్నాక తన్మయత్వం చెందాలి కదండీ మరి.....!!
      చాలా ధన్యవాదాలండీ:-)

      Delete
  7. nice seeta. chala bagundi.....

    ReplyDelete
  8. బాగుంది సీత గారూ, కృష్ణుడితో మీ సందేహ సంభాషణ.
    జగమంతా కృష్ణమయం....

    ReplyDelete
    Replies
    1. పండు గారు...
      చాలా ధన్యవాదాలండీ...:-)

      Delete
  9. enni sarlu dari cherara krishna dari cherara ani padatharu lets change this patarap...patarap yaa a new way of dancing

    ReplyDelete
  10. thanooj గారు

    ఎన్ని సార్లు అలా పాడినా బోర్ కొట్టదేమో అండీ..ఇది రెండోసారి కే అనిపిస్తుంది..కాబట్టి అదే బెటర్ లేండి.;-)
    ధన్యవాదాలు:-)

    ReplyDelete