Friday 10 August 2012

లాలి గోపాల కృష్ణా .....లాలి....!!

బంగారుపానుపుపై నీవు పవళించు
ప్రేమభక్తిపూల శయ్య పరచినాను
ఆడిపాడిచిందులు తొక్కి అలసిపోయావు
చల్లగాను జోలపాడి పాదములొత్తెద దరిచేరరా...!!

పాలుమీగడబువ్వను గోరుముద్దతో ఆరగించరా 
ప్రేమను పెరుగులా చేసి అందిస్తున్నానురా  
ముఖారవిందముపై చెమట కప్పియున్నదిరా
చూడలేదు నా హృదయం కనులుమూసుకోరా.....!!

లాలి గోపాల కృష్ణా .....లాలి....!!

--సీత 

7 comments:

  1. ఆడి పాడీ తిరిగి అలసి నావనుచు
    లాల పోసెను 'సీత' కేళీ కలాప!
    పాలు వెన్నలు పెట్టి మురిపాలు తీర్చి
    పూల పానుపు పైన పవళింప జేసె
    లాలనుచు పాడేను లలన సీతమ్మ
    కనులార బజ్జోర ! కృష్ణ పరమాత్మ !
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా చెప్పారండీ .....బోలెడు ధన్యవాదాలు మీకు :-)

      Delete
  2. సీత గారు...
    కృష్ణాష్టమికి ఆ కన్నయ్యను నిద్రలేపే దగ్గరి నుండీ మరలా నిద్రబుచ్చే వరకూ భలే రాసారండీ.... సూపర్....

    ఆ కృష్ణయ్య కృపాకటాక్షాలు మీపై సదా కురుస్తూనే ఉండాలని ఆశిస్తూ..

    --సాయి

    ReplyDelete
    Replies
    1. చాలా చాలా సంతోషం సాయి గారు :-)
      మీపైన ఆ కృష్ణయ్య కృప ఇలానే ఉండాలని నేను మనస్పూర్తి ఆ కోరుకుంటున్నాను ..థాంక్యూ...

      Delete
  3. nice quote
    https://youtu.be/2uZRoa1eziA
    plz watch our channel

    ReplyDelete
  4. హెలో,ఎలా ఉన్నారండి?

    ReplyDelete