Monday 6 August 2012

ఎగసిన కెరటం.......





మనసులోతు లో ఎగసిన కెరటం
అక్షరాలను దిద్దుతోంది అందంగా
నీవు మదికి చేసిన గాయాన్ని 
సున్నితంగా తుడిచేయాలని అప్రయత్నంగా.....!!

ఆ కెరటానికి  తెలుసా పాపం... ??
ఆ అక్షరాల కి రూపమై 
ప్రాణం పోసింది  నీవేనని.....!

కన్నీటిని కన్పించనిస్తే ఎక్కడ జారిపోతావేమో 
అన్న భయం తో  శాస్వతం గా అక్షరాలని చేసానని .......!

అలలై  ఎగసిపడుతున్న కన్నీటిని 
బయటకి రానీక ఇలా అక్షరాలను చేస్తున్నానని .......!

తెలుసుకొని నిన్ను  తప్ప వేరేది ఉంచగలదా?
కనీసం ఊహించగలదా ?

నేనే ఊహించలేను....
 ఇక అదెలా చేస్తుంది 
అందుకే,
నీ విలువ తెలియచెప్పిన నన్ను కుడా 
కాదని నిన్నే అనుభవిస్తోంది ప్రియా....!!

ప్రతి అక్షరాన్ని వాక్యాలుగా కూర్చుకుంటూ  
వాక్యాలన్నీ  కథలుగా మార్చుకుంటూ 
కథలన్నీమన  అనుభూతులై అల్లుకుంటూ 
నీ జ్ఞాపకాల కావ్యం తో మదిని నింపేస్తోందా కెరటం......!!

--సీత 




22 comments:

  1. సీత గారు... చాలా బాగుంది కవిత...

    దూరమైతే కదా మదికి గాయం, జ్ఞాపకాల కావ్యం అనేవి.. అలా జరగదులేండి.. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఫలిస్తుంది....

    (నాకెందుకో ఈ కవిత కలం నుండి కాదు మనసు నుండీ వచ్చినట్లు అనిపిస్తుంది అండీ...నిజమేనా ? )

    ReplyDelete
    Replies
    1. సాయి గారూ
      బాగ చెప్పారు...నిజమయిన ప్రేమకి వైఫల్యమే లేదు...!
      నిజమే ఇది మనసుబాధ లో నుండీ పుట్టిందే..!!
      ధన్యవాదాలండీ :-)

      Delete
  2. ప్రతి అక్షరాన్ని వాక్యాలుగా కూర్చుకుంటూ
    వాక్యాలన్నీ కథలుగా మార్చుకుంటూ
    కథలన్నీమన అనుభూతులై అల్లుకుంటూ
    నీ జ్ఞాపకాల కావ్యం తో మదిని నింపేస్తోందా కెరటం......!!

    wqw.. chaalaa baavundi.

    ReplyDelete
  3. కవిత బాగుంది సీత గారూ!
    చివరి వాక్యాలు మరీ బాగున్నాయి...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ,
      మీకు మరీ మరీ ధన్యవాదాలండీ :-)

      Delete
  4. సీత గారు... చాలా బాగుంది కవిత...

    ReplyDelete
    Replies
    1. శృతి గారు,
      చాలా ధన్యవాదాలండీ :-)

      Delete
  5. వగ రగిలి , యెగసి కెరటము
    ద్వగుణిత మోహాన ' ప్రేమ ' తేజో మయమై
    ధగ ధగ కవితా జ్యోతుల
    నెగడించుచు ' సీత పలికె ' నిజ వేదనలన్ .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారు..
      నా వేదనని అర్దంచేసుకొని చెప్పేసారు అండీ...
      ఇది మీకే సాధ్యం

      చాలా ధన్యవాదాలండీ :-)

      Delete
  6. కవిత చాలా బాగుంది సీత గారు...

    ReplyDelete
    Replies
    1. రాజి గారు
      ఫ్రెండ్షిప్ డే రోజు దొరికిన నేస్తం మీరు ...!!మీ రాక భలే ఆనందం...
      చాలా ధన్యవాదాలండీ...:-)

      Delete
  7. సీత గారూ,"కన్నీటిని కనిపిస్తే ఎక్కడ జారిపోతావో " ఈ భేలతనమే ప్రేమలో ఎదుటివారిని గెలిపించేది.
    మనస్సు చేసే మంత్రమే అది.
    అందమైన భావన. చాలా బాగుంది.
    ఇంకా ఇంకా రాయాలని కోరుకుంటున్నా.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారూ
      మీరన్నట్టు మాయావి(మనసు)కి మంత్రం వేసే విద్య బాగా వచ్చు.
      మీకు బోలెడు ధన్యవాదాలు...!!
      :-)

      Delete
  8. సీత గారు చాలా బాగుంది కవిత..

    ReplyDelete
    Replies
    1. చాలా చాలా థాంక్స్ ప్రిన్స్ గారూ:-)

      Delete
  9. మొత్తం మీద జ్ఞాపకాల కావ్యాన్ని మొదలు పెట్టారు,
    ఆపకండి, మీ ప్రతి భావానికి అక్షరాలు చెక్కండి.
    మరింత బలంగా, ఆర్తిగా, పొందికగా........
    keep writing, good one.

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా ఆపద్దంటారా సరే....!!
      ధన్యవాదాలు భాస్కర్ గారు మీ ప్రోత్సాహానికి :-)

      Delete
  10. ఎక్కడో ఒంటరి నక్షత్రం తన జంట కోసం ఆర్తిగా వెతుకుతున్నట్లు ,కెరటాలు సాగరుని విడిచి వెళ్ళలేక తిరిగితిరిగి మరల వెనక్కి వస్తున్నట్లు,జ్ఞాపకాల కావ్యాన్ని మనసు పొరలపై అందంగా చె క్కుతున్నట్లున్నారు.ఎక్కడో గుండె లోతులలోనుండి వచ్చిన కవిత లాగుంది.చాలా బాగా వ్రాసారు.

    ReplyDelete
  11. సీత గారు...కవిత చాలా బాగుందండీ! మీకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!!

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete