Friday 10 August 2012

అందుకో కృష్ణా...!!



వినసొంపైన వేణుగానామృతునికి
'విరజాజులు' చెస్తున్న  వినమ్రార్చన  

రాధాప్రేమ పాశబంధనుడికి
'రోజాలు' చేస్తున్న రమణీయార్చన


సౌమ్యస్వరూపునికి సుకుమారస్వామికి
''సంపంగెలు' చేస్తున్న  .సుస్వరార్చన.....  


మనసులో నిలచిపోయే మోహనరూపునికి
'మల్లెలు' చేస్తున్న మనోహరార్చన 

ప్రేమనే ధరించిన ప్రేమమూర్తికి
 'పారిజాతాలు' చేస్తోన్న పదార్చన 

కరుణచూపులు జార్చే కమనీయకనులకు 
'కలువలు' చేస్తున్న కళ్యాణార్చన 

చిందులు తొక్కి అలసిపోయిన చిన్నిపాదాలకు
'చేమంతులు'  చేస్తున్న  చెలిమార్చన

ధరణిని ధరియించిన దయాలోలునికి   
'దాసానులు' చేస్తున్న దివ్యఘనార్చన 

కనకన రుచించే కనకధారరూపునికి
'కనకాంబరాలు' చేస్తోన్న కావ్యార్చన


బుడిబుడి అడుగులతో చేరే బాలకృష్ణుడికి  
'బంతిపూలు' చేస్తోన్న భవ్యభోగార్చన

కలవరిస్తే కదిలి వచ్చే నా కృష్ణుడికి
'సీత మనసు' చేస్తోన్న తన్మయార్చన ఇది ...!!

అందుకో కృష్ణా...!

--సీత



17 comments:

  1. సీత గారు awesome...
    ఇది అన్యాయం అండీ.. మీరు అన్నిరకాల పూలతో పూజించేసరికి, మీ భక్తికి వశమై మీతోనే వచ్చేసాడు ఆయన...
    మా కృష్ణయ్యని కాస్త పంపండి..ప్లీజ్...

    ReplyDelete
    Replies
    1. అబ్బా ఆశ మరి....కృష్ణయ్య ని పంపేస్తారేమిటి ..;-)
      అయినా నేనెన్ని పూలతో బంధించినా ఆయన అంతా వ్యాపించేసి
      అన్ని చోటలా ఉనాడు మరి....అక్కడా దగే ఉంటాడు పట్టుకొని పూల తో
      బంధించండి మరి మీరు కూడా ;)
      బోలెడు ధన్యవాదాలు :-)

      Delete
  2. అందుకో ! కృష్ణ ! యంచు కన్నయ్య యెదుట
    తనరు ' సీతమ్మ తన్వయత్వమ్ము ' జూచి
    మల్లెలును , జాజి పువ్వులు 'తెల్ల' బోయె
    కృష్ణుడే వచ్చి సీత ముంగిటను నిల్చె .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారు
      భలే సంతోషమమేసిందండీ....బోలెడు ధన్యవాదాలు :-)

      Delete
  3. మీ టపాలలో అన్నిటికంటే ఈ టపా చాలా చాలా బాగా నచ్చింది సీతమ్మా!

    ReplyDelete
    Replies
    1. హర్ష గారూ
      చాలా చాలా ఆనందం ....థాంక్యూ అండీ :-)

      Delete
  4. Replies
    1. శృతి ,
      థాంక్యూ...

      Delete
  5. హే కృష్ణా....తోందరగా సీత గారి ఇంటికి వేళ్ళి పూజ అందుకోని వేంటనే మన ఇంటికి వచ్చేయి....రోజు మన ఇంట్లో వుంటావు కదా...పర్లేదు ఇలా వేళ్ళి అలా వచ్చెయి....

    ReplyDelete
    Replies
    1. సందీప్ గారూ ,
      స్వాగతం అండీ..:)
      ఇలా వస్తే అలా కట్టేస్తా తప్ప పంపేది లేదు ;-)
      థాంక్యూ...

      Delete
    2. కృష్ణ కృష్ణ.....ఎదో పూజ చేసుకోంటారు కదా అని పంపుదాం అనుకుంటే కట్టేత్తారా........పాపం సిన్న పిల్లాడు అండి ఎం అనకండి....

      Delete
  6. చాలా బాగుంది సీతగారూ!
    మీ పుష్పార్చన చూసి నా పుష్పాల హోలీ గుర్తొచ్చింది.
    http://srikavitalu.blogspot.in/2012_03_08_archive.html
    మీ తన్మయానందనందనునికి...
    మా భక్త్యాంజలి....
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. చిన్నసవరణ...
      సంపెంగలు... లైనులో....సుస్వరార్చన.....
      @శ్రీ

      Delete
    2. శ్రీ గారూ
      భలే ఉంది ఆ పోస్ట్ .ఇక్కడ కూడా అలా చేయచ్చు కదా....!!
      ఆలస్యానికి మన్నించాలి మార్చాను...
      ధన్యవాదాలు :-)

      Delete
  7. సీత గారూ..
    కృష్ణయ్యకు 'సీత మనసు' అందించిన సుమాజలి
    చాలా బాగుంది..

    ReplyDelete
    Replies
    1. రాజీ గారు
      చాలా సంతోషం :-)
      ధన్యవాదాలు

      Delete
  8. చాలా బాగుందండి కాఫి కోడుతున్నా

    ReplyDelete