Friday 3 August 2012

పగలే జాబిలి చేసె. .......


నీటికి అలమటించిన మా ఊరు
పవనాన్ని బతిమాలె పదే పదే
రాయబారంపంపే మేఘాలకు
మన్నించి కరుణించి కురవమని

ఎండ వేడి కి తడి ఆరిన ఆకులు
నీటి ఆవిరుల లేఖలు పంపె
ముచ్చటపడిన మార్తాండుడు 
శాంతిపొంది మబ్బులని పిలిచె

కందిపొయిన పూలరేకులు
కోపగించి ముడుచుకు పోయె 
చూసి కలతచెందిన వరుణుడు
మంచుకరగతీసి చల్లదనం కూర్చె 

కనులు తెరవని మూగజీవులు
మూలుగుతూ రాగాలాలపించె
కరుణ హృ దయుడు కదలిపోయె 
జాలి చూపి పగలే జాబిలి చేసె......!!!!


enjoyed rain...

-- సీత.....

22 comments:

  1. cool....
    nice :)

    ReplyDelete
  2. సీత గారు చాలా బాగుంది...

    మా ఊరిలో ఈ రోజు వాన పడింది.. నేను full Happy... మీ కవితతో ఇంకా హ్యాపీ.. సూపర్....

    ReplyDelete
    Replies
    1. అవునా భలే :-)
      ధన్యవాదాలండీ

      Delete
  3. ఇక్కడ కూడా వానే, మీ కవితామహత్యమేనా.......
    చక్కని కవిత , అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ఏమో మరి వర్షాన్నే అడగాలి :-)
      ధన్యవాదాలండీ :)

      Delete
  4. ప్రతి పలుకు మీదైన శైలి ! చాలా అద్భుతం!!
    జాలి చూపి పగలే జాబిలి చేసే .. చాలా బాగుంది సీత గారు.

    ReplyDelete
    Replies
    1. చాలా ఆనందం అండీ :)
      బోలెడు ధన్యవాదాలు !!

      Delete
  5. పగలే జాబిలై మదిని చల్లపరిచెను మీ కవిత.

    ReplyDelete
    Replies
    1. అంత కన్నా కావలసిందేముంది ...ధన్యవాదాలండీ :-)

      Delete
  6. మీ కవిత కూడా .... జలజల రాలే వాన జల్లులా చక్కగా ఉందండి.

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలండీ :-)

      Delete
  7. 'అమృత వర్షిణి'- రాగం
    ఆల పించె నేమొ ! సీత !
    ఆకాశం చిల్లులు వడి
    అవని తడిసె చిరుజల్లుల ....
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారు...
      నేనేమీ ఆలపించలేదు సుమండీ:-)
      బహు ధన్యవాదములు

      Delete
  8. ఎండ వేడికి తల్లడిల్లిన మూగ జీవుల ఆలాపన విని జాబిలంత చల్లగా కరుణించి వర్షించిన వరుణ దేవుడు...
    ఆ చల్లదనం కవితలో కమ్మగా చిలికించిన "సీత" కవితా రాగాలూ....
    బాగుంది.

    ReplyDelete
    Replies
    1. బోలెడు ధన్యవాదాలు అండీ :-)

      Delete
  9. మీ కవితల్లో పరిపక్వత కనిపిస్తోంది నానాటికీ...
    అభినందనలు మీకు...
    చక్కని కవిత వానపై.....
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. అంతా మీ అందరి ప్రోత్సాహం ,అభిమానం.
      బోలెడు ధన్యవాదాలు :-)

      Delete