Sunday 29 July 2012

ఆగిపోదామా ఇలా....??!!


 సాగిపోదామా....?
 గలగలమనే సెలయేరు పై,
 చల్లగా జాలువారే నీటి ప్రవాహాన్ని ఆపద్దని...!!

ఎగిరిపోదామా ....?
దూసుకుపోయే గాలిపటం లా,
కమ్మగా గాలికి మన ప్రేమ పరిమళాన్నద్దుకోమని..!!


అల్లుకుపోదామా ? 
  ఎదిగిపోయే తీగల పై,
ఆకునీవై,పూవు నేనై ఇద్దరినీ ఒదిగుండనివ్వమని..!!

కలిసిపోదామా...?? 
వాగర్ధాలకే అందని అర్ధం లా,
నిన్నూనన్నూ ఏవీ వేరు చేయలేవనే వాక్యాన్ని చెప్పమని...!!

పారిపోదామా...?
 ప్రకృతిపై పయనించే ప్రవాహంలా,
అందనంత ఎత్తులో ఉన్న ఆకాశాన్నే మనల్ని చేరతీయమని ..!!

కానీ ,
నే గీసిన చిత్రం..
ఆగిపోదాం....... ఇలా చంద్రుడిలో 
 ఒకరిలోఒకరం ఒదిగిపోతూ 
మనల్నేవి కదిలించకుండా వృత్తంలో  ఇలా దాచేసుకొమ్మని ..!! 


-
-సీత..

22 comments:

  1. చాలా బాగుంది సీత గారూ!
    సాగుతూ ఆగిపోయే మీ పయనం...
    చిత్రం కూడా బాగుంది...
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ,
      మీకు నచ్చినందుకు ఆనందం .ధన్యవాదాలండీ :-)

      Delete
  2. వావ్.. సీత గారు..
    సూపర్ ఫీలింగ్.. సూపర్ కవిత... సూపర్ పిక్చర్....
    మెత్తం మీద సూపర్ అంతే...ఇక మాటలు లేవు..

    ReplyDelete
    Replies
    1. సాయి గారు

      సూపర్ ధన్యవాదాలండీ:-)

      Delete
  3. అలా సాగిపోతూ వుండండి .చక్కని కవిత

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారు
      ఇంక సాగలేకే అలా ఆగిపోయాం అండీ..
      చాలా ధన్యవాదాలండీ:-)

      Delete
  4. "ఆకాశంలో హంసలమై హాయిగ ఎగిరే గువ్వలమై అలా అలా కులాసాగ తేలిపోదామా "...
    మీ కవిత చదవగానే నాకు ఈ పాట గుర్తొచ్చిందండీ.. కవిత బాగుంది..

    సీత గారూ.. మీ బ్లాగ్ కవితలు చిత్రాలు,సాంగ్ అన్నీ బాగున్నాయండీ ...

    ReplyDelete
    Replies
    1. రాజీ గారు
      నా బ్లాగ్ కు స్వాగతం అండీ.మీ రాక ఆనందం.భలే పాట గుర్తుతెప్పించారు....
      చాలా ధన్యవాదాలు మీకు:-)

      Delete
  5. అక్షరాలను పొందికగా గుచ్చిన మాలలా,మెరిపించారండి, అభినందనలు. చిత్రం బాగుంది...

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు...
      చాలా ధన్యవాదాలండీ :)

      Delete
  6. సీత గారూ , చాలా బాగుంది మీ కవిత. ఈ భావుకతే నేను ఆశించింది మీ నుండి మీరు రాయగలరు నాకు తెలుసు నేను ఎదురు చూస్తుంది ఇలాంటి కవిత కోసమే. చూసారా ఎంత అలవోకగా రాసారో.. మనసును విప్పి చెప్పేదే కవిత్వం. సంకోచం లేకుండా భావప్రకటన చేయగలగాలి. డియర్ చాలా మెచ్చుకోవాలని ఉంది, ఇలాగే ఇంకా రాయాలి. ఓ మంచి కవయత్రిగా ఎదగాలని దీవిస్తున్నా.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు...
      చాలా సంతోషం అండీ.మీరు ఆశించింది ఇవ్వగలిగానని తృప్తి గా ఉంది.మీ ఆశిస్సులకి చాలా ఆనందం.
      చాలా ధన్యవాదాలండీ మీకు :)

      Delete
  7. బాగుంది సీతగారూ మీ కవితపయనం.

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ,
      ధన్యవాదాలండి:-)

      Delete
  8. భావాన్ని అందంగా కవితలో పొందికగా మాటల కూర్పు...బాగుంది.
    గుండ్రని చంద్రునిలో ఒద్దికగా ఒదిగిన జంట చిత్రమూ బాగుంది. ఊహా, బొమ్మా బాగున్నాయి. మరిన్ని మీరు గీయబోయే చిత్రాలు చూడాలని ఆశిస్తూ...

    ReplyDelete
    Replies
    1. పండు గారూ ,
      నా ఊహా ,బొమ్మ మీరు నచ్చినందుకు సంతోషం :-).ఏమో ప్రయత్నిస్తాను బొమ్మలు గీయడానికి...
      చాలా ధన్యవాదాలండీ :)

      Delete
  9. సీత, మీ బ్లాగ్ ని మొదటి సారిగా చూస్తున్న, అచ్చమైన తెలుగింటి ఆడ పిల్ల భావాలు నా మనసు కి ఆహ్లాదాన్ని కలిగించినాయి.


    -- భరత్

    ReplyDelete
    Replies
    1. భరత్ గారు
      స్వాగతం అండీ...!!
      మీకు నచ్చి మెచినందుకు ఆనందం.
      ధన్యవాదాలండీ :-)

      Delete
  10. nice seeta... picture bagundi.

    ReplyDelete
  11. మీరు గీసిన చిత్రం కూడా బాగుంది సీతమ్మా!

    ReplyDelete
    Replies
    1. ఫోటాన్ హర్ష గారు....
      చాలా ధన్యవాదాలండీ :-)

      Delete