Friday 10 August 2012

మేలుకో కృష్ణా ...


మసకతెరల మాటు రాగాలు మేల్కొలిపె నిన్ను
మంచుకరిగే వేళలో మనోహరమయిన పుష్పాలు 
పరిమళాన్నందిస్తూ లేవయ్యా అంటూ విచ్చుకునె 

భారాన్నంతా మోస్తూ అలసిపోయిన భూమాత కొరె
కరుణించి నన్ను నీ మెత్తని పాదాలతో స్పృసించి 
అన్యాయాన్ని ఖండించడానికి అడుగువేయమని అడిగె 

మనసులో నిన్నే దాచుకున్న ఎందరో భక్తులు నీకోసం
ఎదురుచుసె వేయికన్నులలో వేయికిపై వత్తులువేసుకొని
నీ నడకకోసం ,నీ బాట ననుసరించడానికై కుతూహతతో 


నీ అడుగుల సవ్వడికి అన్యాయం అంతమయిపోవాలి
నీ వేణు గానంతో మా మదిలో వెలయాలి ప్రేమరాగాలు
నీ చిరునవ్వులో వెతుక్కోగలగాలి స్వచ్చమయిన ఆనందాన్ని
నీ తత్వం జగమంతా వెలిగి మాలోని జ్యోతులను వెలిగించాలి  ...!!

లే కృష్ణా .......
 నీ కోసం పరితప్పిస్తున్న మా అందరికీ అందించు నీ ప్రేమానందాన్ని...!!

--సీత...



12 comments:

  1. కృష్ణ ప్రియ...సీత గారికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు....
    మీ మీలుకోలుపు చాలా భక్తి భావంతో ఉంది...
    ఆ నీలమేఘశ్యాముని కరుణా కటాక్షాలు మీ మీద..
    మనందరి మీద ఎల్లవేళలా కురిపించాలని ఆశిస్తూ...
    @శ్రీ (నా బ్లాగ్ లో శ్రీ కృష్ణ సుప్రభాతం వినండి ...)

    ReplyDelete
    Replies
    1. కృష్ణప్రియ అంటూ భలే సంతోష పెట్టారండీ...

      చాలా సంతోషం శ్రీ గారూ..:-)
      నిన్న బిజీ గా ఉండి నేను ముందుగానే పోస్ట్లన్నీ సెట్ చేసేసి వెళ్ళాను.ఈవాళ విన్నాను...చాలా బాగుంది అండీ...:-)

      చాలా ధన్యవాదాలు ...:-)

      Delete
  2. మేలుకొలుపు బావుందండీ ! కృష్ణాష్టమి శుభాకాంక్షలు !

    ReplyDelete
    Replies
    1. వంశీకృష్ణ గారూ
      ధన్యవాదాలండీ...ఆ కన్నయ్య కృప మీపై సదా కురవాలని మనస్పూర్తి గా
      కోరుకుంటూ

      Delete
  3. నీ కోసం పరితప్పిస్తున్న మా అందరికీ అందించు నీ ప్రేమానందాన్ని...!!


    సీత గారు.. చాలా చాలా బాగుంది మేలుకొలుపు... సూపర్...

    ReplyDelete
    Replies
    1. సాయి గారూ...
      చాలా సంతోషం అండీ...ప్రేమ అంటే ఆనందాన్నిచ్చేదవ్వాలి కదా అండీ
      ధన్యవాదాలు :-)
      ఆ కన్నయ్య కృప మీపై సదా కురవాలని మనస్పూర్తి గా
      కోరుకుంటూ

      Delete
  4. Replies
    1. రవిశేఖర్ గారూ..
      థాంక్యూ అండీ :-)
      ఆ కన్నయ్య కృప మీపై సదా కురవాలని మనస్పూర్తి గా
      కోరుకుంటూ

      Delete
  5. చాలా బాగుందండి ఈ "మేలుకొలుపు". కృష్ణాష్టమి శుభాకాంక్షలండి.

    ReplyDelete
    Replies
    1. భారతి గారు
      మీరు రావడం నిజం గా ఆనందదాయకం అండీ :-)
      చాలా ధన్యవాదాలు భారతి గారు :-)
      ఆ కన్నయ్య కృప మీపై సదా కురవాలని మనస్పూర్తి గా
      కోరుకుంటూ...

      Delete
  6. సీత గారు..
    మేలుకొలుపు చాలా బాగుందండి..
    కృష్ణాష్టమి శుభాకాంక్షలు !

    ReplyDelete
    Replies
    1. రాజి గారు
      చాలా సంతోషం అండి:-)
      కృష్ణాష్టమి శుభాకాంక్షలు...ఆ కన్నయ్య కృప మీపై సదా కురవాలని మనస్పూర్తి గా
      కోరుకుంటూ...

      Delete