Thursday, 21 June 2012

అది పగలయినా.......

కనులు మూసి అలసిన వేళ
మనసు రెక్కలు ఆగిన వేళ
మాటలలో మౌనం దూరిన వేళ
చెవులు నీ పిలుపుకు చేరువ్వలేని వేళ
ఏకాంతంలో ఏకాకినై ఎదురుచుసిన వేళ 



నీ కోసం నా కనులు వెతికిన వేళ..
నా కనులకు నీవు అందని వేళ ...
అది పగలయినా , 
                    నాకు చీకటే ఓ ప్రియ....!!

మీ సీత .....

Tuesday, 19 June 2012

నీ మురళీ రవళి....


నాకిష్టమయిన కృష్ణుడు..
తెల్లని మల్లెలు అల్లిన గానం 
మెల్లగా పలికెను మోహన  రాగం
చల్లని చూపుల ఓ నల్లని స్వామీ 
జల్లించా నిన్ను  విరజాజులతో.....!!

నీ గాన సుధలకు వేణువుల పొదలు
 చైతన్యమై మా చే  పలికించే నీ కృతులు...
నీ  ముద్దుమాటలకు మురిసిన మా మోములు
మహదానందమై మరిపించే ఈ లోకములను....!! 


జలకాలాడే గోపికలు , 
నీకై వేచే నీ స్నేహితులు,
నిన్నే స్మరించే హృదయాలు..
విన్నవిన్చుచున్నారు ఓ మానసచోరా

 "మురళీ రవళి ని ఆపకు.....
      నీ  రాగాసరోవరము లో 
      మమ్ము ఇలాగే నిలిచిపోనివ్వవా ......"

కృష్ణా.......

       నీ మురళీ గానము చే మాయ  చేసి 
        మమ్ము మహిమ లతో  కాపాడెదవు....
.






మీ   సీత.....

Saturday, 16 June 2012

ఒంటరి జీవితం......


the most horrible thing in the world is loneliness
-- seetha

ఆలోచనలు రావా నాకు?
కదలని జీవితమాయే 
తప్పకుండా వస్తాయి వద్దని వాదించినా 

అయితే ఏమిటా ఆలోచనలు ??
ఎంతని ఆలోచించగలను  విడువకుండా ??
రూపమివ్వగలనా   వాటికి ??

శూన్యామావరించదా  నిరాశ తో నన్ను ??
విరక్తి ఎత్తి పోడవదా ఏకాకి అయినందుకు ??
 ప్రశ్నించేదా  ఈ జీవితం ఎందుకని ??

దైవాన్ని నిలదీయగాలనా దిక్కు లేని దాని గా చేసినందుకు??
ఆలోచించడం మానివేయగాలనా  నిష్ప్రయోజనమని??
సుఖాన్ని కనీసం  కోరగలనా  మరో జన్మలో అయినా ??

దగ్గరకు పిలిచే వారున్నారా  కథలు చెప్పమని ??
నవ్వించేవారున్నారా  సంతోషం గా ఉంచాలని ??
స్నేహితులున్నారా  గతాన్ని నెమరు వేసుకోవడానికి ??

అబ్బా..."horrible"  అనిపిస్తుందీ జీవితం 
పోషకాహారం లేక బ్రతకగలమేమో 
ఒంటరి జీవితం దుర్భరం కాదా.........??????

--సీత .....

Monday, 11 June 2012

ఏమిటో ఇదంతా.........?????


తెల్లారుతూనే  కుహూ కుహూ అనే పక్షుల రావాలతో  
తొలిమంచు కరిగిందీ , గుడ్ మార్నింగ్ అని లేపెసావు.......

ప్రశాంతం గా తోలిపొద్దు చిన్నగా  వీచే  గాలులతో 
మేడ  పై నడుద్దామంటూ పరుగులు పెట్టించావు....

మెల్లగా వచ్చే ఆకాశసూర్యుడి  పలకరింపులతో  
మేళవింపు గా కాఫీ తో మాటలలో ముంచెత్తావు...

డైనింగ్  టేబుల్ దగ్గర నేనోచ్చేసరికి బ్రేక్ ఫాస్ట్ తో 
వద్దన్నా నాకిష్టమయిన దోశ తో దర్శనమిచ్చావు...

వంటింట్లో వెచ్చగా వెలిగిన పొయ్యి మంటలతో 
వెంటనే పని కానివ్వమంటూ సహాయం చేసావు....

మధ్యాహ్నం ఒంటి గంట కి అల్లరి చేసి ఆకలితో
నా  చేత ముద్దలు తినే చిన్న పాపాయి వయ్యావు...

అలసిపోయి వచ్చి నడుంవాల్చితే  పేపర్ లో కబుర్లతో 
కమ్మనయిన మాటలు చెప్పి  నవ్వించే నేస్తాని వయ్యావు.....

సాయంత్రం నాలుగింటికల్లా చేతిలో రెండు టీ కప్పులతో 
లేస్తున్న  నా కనులకి హాయ్ అంటూ పలకరింపువయ్యావు........

ఆరవుతూనే  అటూ-ఇటూ తిరిగి చేతిలో బైక్ కీస్ తో 
అలా-ఇలా తిరిగొద్దామంటూ నాతో కదిలిన ఆనందమయ్యావు .......

సరే  ఇక ఇంటికి పోదాం అని అంటే సినిమా టికెట్ లతో 
సరదాగా సెకండ్ షో చూద్దాం అంటూ ఐస్ క్రీం తో ఐస్ చేసావు....

అలుపెరిగి కనులు మూత బడుతుంటే కమ్మని మాటతో
గుడ్  నైట్ అంటూ నవ్వి భరోసా గా నా చేతి లో చేతి వయ్యావు......

మరలా ఎవరో లేపుతున్నట్టు ఉంటే, లేచి చూస్తె కనులతో 
నా కనులకందని రూపాని  వై నా కల వయ్యావు....

అలా లేచి  కదిలి నడుస్తూ ఉంటే రకరకాల ఆలోచనలతో
నన్ను నాకే అర్ధం కానీక ఒక ఆశ్చర్యానివయ్యావు......!!!



--సీత

Friday, 8 June 2012

నిను చేరాలని ఉన్నా.....


కనులు కలవరిస్తున్నా 
కలలు కలవరపరుస్తున్నా 
                                                           


పెదవి పలకరించమన్నా 
పిలుపు పిలవమంటున్నా 

మనసు మనవిచేయమన్నా
మాట మొరపెట్టుకొమన్నా 


చేతులు చేరదీయమంటున్నా 
చెలి నై చెంతచేరమంటున్నా 

అడుగులు నిన్నే చేరమంటున్నా
ఆశ లన్నీ అడగమంటున్నా 


నీడ నీతో నడవమంటున్నా                              
నీ సగమై సాగామంటున్నా

భావం బంధించమంటున్నా
నీ భావానికి బదులివ్వమంటున్నా 


పాదం పరిగెత్తదంటున్నా 
నీ ప్రేమ ని  పంచుకోమంటున్నా 

"నీ పరిచయం" అనే పేజీ ని పెనవేసుకొని 
 నేనిలా నన్ను వదిలేసి సాగిపోతూనే ఉన్నా.....!!!
నిను చేరాలని ఉన్నా,నే చేరలేకున్నా...

--సీత....

Tuesday, 5 June 2012

స్నేహం --స్నేహ బంధం


అమ్మ ప్రేమలో ని ఆప్యాయతని పంచిస్తుంది
నాన్న స్ఫూర్తి లో ని నమ్మకాన్ని నిలబెడుతుంది 


నిజమయిన  ఆస్తి ని సంపాదించి పెడుతుంది
అర్భుతమయిన  ఆనందాలతో అల్లుకుపోతుంది

మరచిపోలేని మనసులనేన్నో దగ్గర చేస్తుంది
మరపుకేరాని మమతలనేన్నో అందిస్తుంది

కలతలనన్నీ  కమ్మని కబుర్లతో మరిపిస్తుంది
కష్టాలన్నీ పంచుకొని ప్రేమ గా మురిపిస్తుంది

బాధల్లో ఓదార్పై  బంధాన్నింకా బంధిస్తుంది
నవ్వులో  నేస్తమై నడచి నిత్యం ఉంటుంది 

ఆనందాలన్నీటినీ ఆరోగ్యం గా  ఆస్వాదింపచేస్తుంది 
అనవసరబాధలన్నిటి పై ఆనందాని చల్లేస్తుంది

గెలుపు బాట లో  నడిచే ఆనందం అవుతుంది
ఓటమి పాలయినపుడు నిట్టూర్పు నిచ్చి గెలిపిస్తుంది    

మంచి తో మనలోని మమతా జ్యోతి ని  వెలిగిస్తుంది
చెడుని నాశనం చేసి చీడపురుగుని దూరం చేస్తుంది

ప్రశాంతం గా దగ్గరయ్యి ప్రేమదీపాన్ని వెలిగిస్తుంది
పవిత్రబంధం లా జీవితాంతం ప్రయాణం చేయిస్తుంది 

జీవితం  అనే వనం లో ఉదయించే  ఒక పుష్పం 
జన్మ జన్మలయినా దీనికోసం జన్మించాలని ఆశ రేపే ఒక అనుభవం ...........!!

అదే   స్నేహం 

కష్టమయినా సుఖమయినా నీ తోనే నేననే ఒక భావం
నీ కన్నీరు నాది --నా చిరునవ్వు నీదని చెప్పే ఒక బంధం
అదే          స్నేహ బంధం 



-- మీ సీత.....