నా ఎద లయలో చప్పుడు వయ్యావు ...
నా ఎదమాటు అల్లరి వయ్యావు ..
నా నిదురలో కల వయ్యావు ...
నా మెలకువ ఊహ వయ్యావు ...
నా కనులలో వెలుగు వయ్యావు ...
నా పెదవుల పై చిరునవ్వు వయ్యావు ...
నా మౌనానికి మాట వయ్యావు ...
నా మనసుకి ఆనందం వయ్యావు ...
నా అడుగుల గమ్యం వయ్యావు...
నా ఉనికి శబ్దాని వయ్యావు...
నా పాట కి శ్రుతి వయ్యావు...
నా రాగానికి లయ వయ్యావు...
ఓ కృష్ణ...
మరి,
ఈ "సీతారాధ"నకి రూపానివెప్పుడవుతావు...???
నీ కంటి పాపలో నన్నెప్పుడు నాకు చూపుతావు???
--
సీత 
చాలా బాగుంది.. సీతగారు మీ "సీతారాధన"
ReplyDeleteసూపర్.....
సీతగారు, చాలా బాగుంది..
ReplyDeleteసీతగారూ ! బాగా వ్రాసారు. కృష్ణుడు కూడా భలే ఉన్నాడు.
ReplyDeleteసీత గారూ,
ReplyDeleteమీ కృష్ణుడిని ప్రేమగా అందమైన పూలమాలతో చుట్టేశారు మనసు భావ మాలతో కట్టేశారు. భలే ఉన్నాడండీ.
"సీతారాధనలో" ని ఆ'రాధ'నని ఎలా వీడగలడిక...
మీ కంటిపాపలో ఆరాధనా రూపం ఎపుడూ ఉండాలని ఆశిస్తూ...
చక్కని భావం చాలా చక్కగా రాశారు
ముగ్ధ మోహన రూపు మునుపెన్న డెరుగను
ReplyDeleteకృష్ణయ్య! సీతమ్మ కృపను గంటి
ఘనశ్యామ తనుఛాయ కమనీయ మెరుగను
కృష్ణయ్య! సీతమ్మ కృపను గంటి
మల్లెల సౌరులు – మధుపర్కములు గనను
కృష్ణయ్య! సీతమ్మ కృపను గంటి
మోవిపై పిల్లన క్రోవి ముచ్చటెరుగ
కృష్ణయ్య! సీతమ్మ కృపను గంటి
అమ్మదొంగ ! నిన్ను నందందు వెదికేను
“ సీత పలికె ... “ బ్లాగు జేరినావ !
చిన్నికన్న ! నిన్ను సీతమ్మతో జెప్పి
పాట తోటి కట్టి , పట్ట గలను .
బ్లాగు సుజన-సృజన
"సీతారాధనా కృష్ణ"
ReplyDeleteబాగుందండీ!
కాకపోతే "యద" కి బదులుగా "ఎద" వాడితే బాగుంటుందేమోనండీ!
మీ బ్లాగ్ అభిమానిగా చిన్న సలహా మాత్రమేనందోయ్!
@శ్రీ...
@సాయిగారు,
ReplyDeleteచాలా సంతొషం ధన్యవాదాలు అండీ..!
@శ్రుతి గారు,
చాలా సంతొషం ధన్యవాదాలు అండీ..!
@ రవిశేఖర్ గారు ,
చాలా సంతొషం ధన్యవాదాలు అండీ..!
@ఆనందం గారు...
చాలా సంతొషం ధన్యవాదాలు అండీ..!
@వెంకట రాజారావు . లక్కాకుల
ReplyDeleteసార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు.చాలా ఆనందం గా ఉంది మీరు నా బ్లాగ్ కు విచ్చెయడం.కృష్ణానందం !!
నా కృష్ణయ్య మీకెంత నచ్చాడో మీ పదకూర్పుల్లోనే అర్దమయింది.
మీరు చెప్పినట్టే కృష్ణుణ్ణి పాట లతో త్వరలోనే కట్టేద్దాము..!!
చాలా ధన్యవాదాలు..
--సీత
@చిన్ని ఆశ గారు
ReplyDeleteమీకు బోలెడు ధన్యవాదాలు అండీ...!!ఈ సీతా'రాధా'నలో ఉండిపొవాలని కొరుకున్నందుకు... :) :) :)
@ శ్రీ గారు
మీరు చెప్పింది నిజమే నండోయి...ఇప్పుడే మారుస్తాను.
చాలా సంతొషం అండీ.
"సీతారాధనా కృష్ణ" అని ఇంకా సంతొషానికి గురి చేసారు. :) :)
సీతగారు, చాలా బాగుంది..
ReplyDeleteవినయ్ గారు ధన్యవాదాలు అండీ..!!
ReplyDeleteseeta gaaruu
ReplyDeletesuper ga undi andii.