ప్రేమ కై ఆశ తో....
"ఒక్కటి" గా విహరిస్తూ ఆలయానికోచ్చిందో చిలుక... "రెండై "జతగా ప్రపంచాన్ని చూడాలని ఆశ తో.....
"మూడు" పూల తో ముచ్చట గా మహేశ్వరుణ్ణి పూజించింది
'నాలుగు" కాలాలు నవ్వుతూ జతగా ఎగరాలనే ఆశ తో....
"పంచ"మి నాట పార్వతి ని ప్రేమ గా అడిగింది
"షడ్జ"మ కోకిల లా తన జీవితానల్లె రాగాలనాలపించాలనే ఆశ తో....
"సప్త"వర్ణాల హరివిల్లు ఆకాశం లో విస్తరించిన వేళ
"అష్ట"మి నాడు ఆశ గా ఆరభి రాగం తననల్లుతోన్న వేళ
తన "తొమ్మిది" రోజుల ఎదురు చూపుకు తెరపడి తన " ప్రేమ " తనని చేరిన వేళ....
"పది"కాలాల ప్రేమానందమయిన జీవితాన్ని ప్రేరేపిస్తూ....
"పన్నెండు"చెట్లు దాటి "పదమూడో " చెట్టు చేరి ఊసులాడుకుంటున్నాయి..........!!!!
చూడండి మరి...
--మీ
సీత 
ఈ " పద్నాలుగు " లోకాల్లో మీలా ఇలా కవిత రాయడం ఎవ్వరి వల్లా కాదండీ బాబోయ్........సీత గారు అద్భుతంగా ఉంది..... సూపర్..
ReplyDeleteమీ కవిత లోని ఆ పక్షుల లాగానే మీ జీవితం కూడా అలానే ఆనందమయంగా సాగిపోవాలని ఆశిస్తూ....
సాయి గారు నా అంకెల ప్రేమాట మెచ్చినందుకు ధన్యవాదాలండీ....
DeleteSeeta simply Super...
ReplyDeletevery very happy .thanks sruthi gaaru........
DeleteGOOD POETRY.
ReplyDeleteమీ సంఖ్యా కవిత్వం బాగుందండోయ్!
ReplyDelete@శ్రీ
@రవిశేఖర్ గారు
ReplyDeleteథాంక్యూ అండీ..!!
@శ్రీ గారు...
సంతొషం ధన్యవాదాలండోయి......!!
wow...wow...simply super seeta gaaru
ReplyDelete