కలం కదులుతోంది వెగంగా...
కాలం పరిగెడుతోంది త్వరగా..
గాలి వీస్తోంది చల్లగా..
జాబిలి వస్తొంది తెల్లగా..
చినుకు తాకింది మెత్తగా..
స్వరం వొణికింది గమ్మత్తుగా..
చందమామ పొయె చుస్తుండగా
సుర్యకిరణం తగిలె వెచ్చగా....
మనసు కదిలె వింతగా
చూపె ఒక దిక్కుగా
ఆ దిక్కు నడిపె ఒక దారిగా
ఆ దారి కి 'గమ్యం' నీవెనా ?????
'నీవయిన నా' గమ్యాన్నిచేరి చెప్పాలని చిన్నిఅశ
నీ ఆలొచన కదలక పొయే..""
--
సీత 
చాలా చాలా బాగుందమ్మా సీత......
ReplyDeleteచిన్ని చిన్ని పదాలతోనో గొప్ప అర్దం పలికించావు..
ఇంతకీ నీ గమ్యం చేరాక..నాకు చెప్పు ఒకసారి...
ఓహో ......!!
Deleteసరే తప్పకుండా చెప్తా....!
చాలా సంతోషం మీకు ధన్యవాదాలు సాయి గారు....
తన మనసులోని భావాలు
ReplyDelete"సీత పలికె" చక్కగా... :-)
@శ్రీ
శ్రీ గారు,
Deleteధన్యవాదాలండీ....
:) :)
గమ్యాన్ని తప్పక చేరి చెప్పాలని, మీ చిన్ని ఆశ నెరవేరాలనీ మా చిన్ని ఆశ..
ReplyDeleteకవిత ఎప్పటిలానే "సీత పలికే..." లా ఉంది, అంటే బాగుంది :)
చిన్నీఅశ ని నెరవేర్చుకోవాలన్న నా ప్రయత్నానికి మీ ఆశ+ఆశిస్సులు తోడయ్యాయి గా ....
Deleteచాలా ధన్యవాదాలండీ....:):):):)
సీత గారూ, మొదటి సారి మీ బ్లాగ్ చూసాను , అందమైన భావన ఉంది మీ కవితలో , చక్కటి పదాలు , వెన్నెల కురిసినట్లుంది కన్నులపై
ReplyDeleteకలమందున , గళమందున ,
ReplyDeleteకలలందున , కనుల యందు , కాంక్షల యందున్
పలు పలుకు లేల ? కృష్ణుడు
తలపున గల 'గమ్య 'మందు తానే యుండున్
బ్లాగు సుజన-సృజన
@ఫాతిమా గారు,
ReplyDeleteస్వాగతం అండీ..
మీరు ఏకం గా నా మది పై మల్లెలే కురిపించారు గా..చాలా సంతొషం
అండీ . ధన్యవాదాలు...!
@వెంకటరాజరావు గారు
మరొక్కమారు మీ పద్యముల తో నా గమ్యాన్ని చుపించి మురిపించారు.
చాలా సంతోషం అండీ ధన్యవాదాలు....!!
mee gamya geetham,
ReplyDeletebhagundandi.
thank you bhaskar garu
Deleteచిన్నీఅశ నే కొరి
ReplyDeleteచిరునవ్వు నే అల్లి
నీ గజ్జెల సవ్వడితో ఘల్లు ఘల్లు మని అడుగులిడుతూ గమ్యాన్ని చేరబొయిన ఓ సీతమ్మా..
రామయ్యే వేచె వేయికన్నులతో ఆ గమ్యం గుమ్మమున.
త్వరగా చేరుకో........