నా ఊహల భావాని వి నీవయితే
నీ ఊహలఊయల లో బంధీ ని నేనవుతా
నా అందెల ని సవ్వడి చేసే అల్లరివి నీవయితే
నీ అల్లరి లో అలుపెరగని అలనే నేనవుతా
నా మదిని మురిపించే వేణు గానమే నీవయితే
నీ మది పై చేరి మరిపించే మల్లే ని నెనవుతా
నీ మది పై చేరి మరిపించే మల్లే ని నెనవుతా
నా కోపం లో కసి గా కవ్వించే యుద్దానివి నీవయితే
నీ చే ఓటమి పాలై నీ గెలుపు గర్వాన్నే నేనవుతా
నీ చే ఓటమి పాలై నీ గెలుపు గర్వాన్నే నేనవుతా
నా బాధలో ఓదార్పు నిచే అమ్మ వు నీవయితే
నీ ఒడి లో ఒదిగే పసిపాప నేనవుతా
నీ ఒడి లో ఒదిగే పసిపాప నేనవుతా
నా గుండె గుడికి దీపానివి నీవయితే
నీ గుసగుసల గానం లో గోప్యాన్ని నేనవుతా
నీ గుసగుసల గానం లో గోప్యాన్ని నేనవుతా
నా కన్నీటి ని కట్టడి చేసే వారధి నీవయితే
నీ కై కదలాడే స్నేహాన్ని నేనవుతా
నీ కై కదలాడే స్నేహాన్ని నేనవుతా
నా చెక్కిలి లో చేరే చిరునవ్వు నీవయితే
నీ చనువు లో నీ చేలి నే నేనవుతా
నీ చనువు లో నీ చేలి నే నేనవుతా
నా కనులని కలతపరచే కల వి నీవయితే
నీ కనులలో కదలని కవిత ని నేనవుతా
నీ కనులలో కదలని కవిత ని నేనవుతా
నా పాదాల పై పండిన పారాణి నీవయితే
నీ పెదవుల పిలుపుల కి పులకరింత నేనవుతా
నీ పెదవుల పిలుపుల కి పులకరింత నేనవుతా
నా నోసట కుంకుమ ప్రతీకవే నీవయితే
నీ పాదాల పై నా చే చేరే పుష్పాన్నే నేనవుతా...
నా నగుమొము ను వెలిగించే రాముడు వి నీవయితే
నీ నీడ నై నీ వెంటే నడిచే సీత నే నేనవుతా...
నీ నీడ నై నీ వెంటే నడిచే సీత నే నేనవుతా...
నా ఈ ప్రేమ 'పలుకుల'కి పేరే నీవయితే
నీ ప్రేమ నే కోరే "ప్రశ్న" ని నేనవుతా
నీ ప్రేమ నే కోరే "ప్రశ్న" ని నేనవుతా
నా నుండీ దూరమయ్యే "విరహాని" వి నీవయితే
నీ విరహాన్నే వరించే 'వనిత' నే నేనవుతా..............!!
నీ విరహాన్నే వరించే 'వనిత' నే నేనవుతా..............!!
నీవే నేనవుతా....
-
సీత
..
Nice.....
ReplyDeletevirahaanni varinchi bharincham antha suluvu kadu kadandi..
ReplyDeleteManchi kavitha.. :-)
ఎప్పటిలానే చక్కగా పలికించారు "సీత" భావాలని.
ReplyDeleteఒకరిలో ఒకరవ్వగలిగే అందమైన అనుభూతే "ప్రేమ".
కవితలో కోరుకున్నవన్నీ అవ్వాలని ఆశిస్తూ....
మలయ పవనంలా హాయిగా వుంది మీ కవిత.చాలా బాగా వ్రాసారు.
ReplyDelete"నా చెక్కిలిలో చేరే చిరునవ్వు నీవైతే
ReplyDeleteనీ చనువులో నీ చెలి నే నేనవుతా"....
"నా కోపంలో కసిగా కవ్వించే యుద్ధానివి నీవైతే"...
ఎందుకో ఈ భావాలు నాకు అర్థం కాలేదు సీత గారూ!
మీ మధురమైన భావనలు...
నిజం కావాలని వేయి దీవెనలతో... ;-)@శ్రీ
భామా కలాప మధురిమ
ReplyDeleteప్రేమా-విరహాల మథ్య పెనవేసి మరీ
రామునితో సీత పలికె ...
కోమల కవితా వచ సుథ కోరిక తీరన్
----- సుజన-సృజన
సీత పలికింది అందమైన భావం కనుక నేనూ పులకిస్తా ... అందమైన బావన అలవోకగా పలికిందీ సీత కదా
ReplyDelete@సాయి గారు
ReplyDeleteథాంక్ యు వెరిముచ్
@నేస్తం గారు
విరహాన్ని వరించడం లో నే నిజమయిన ప్రేమానుభూతి ని పొందగలం కదండీ..దానికి చాలా రుజువులు కుడా ఉన్నాయి కదా...!!!
చిన్ని ఆశ గారు
చాల సంతోషం మీరు మంచిమనసుతో జరగాలని కోరుకున్నందుకు.
చాలా ఆనంధన్యవాదాలు...!!
రవిశేఖర్ గారు
చాలా సంతోషం అండీ.ధన్యవాదాలు...
--సీత
@శ్రీ గారు
ReplyDeleteమారు మారు ఆలోచిస్తే మధురమయిన భావాలన్నీ అర్దమవుతాయి.
చాలా ధన్యవాదాలు మీకు .
@వెంకటరాజారావు గారు
"రామునితో సీత పలికె" నని చక్కగా నా మనోభావాన్ని చెప్పి కొరుకున్నందుకు ఆనందం తో కూడిన ధన్యవాదాలు ....!!
@ఫాతిమా గారు
ఈ సీత పలుకులకి మీరు పులకించినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది.
చాలా ధన్య వాదాలు అండీ..!
చాలా బాగా రాశారు
ReplyDeleteధన్యవాదాలు మంజు గారు...!!
Deleteseeta gaaruu
ReplyDeletechaalaa baagundi.super ga undandii..
nijamaina prema ki ardam cheppaaru.
premani kore prasna ayyi mee prema ki samaadhanam kudaa preme avvalani aasistunnaanu.
chaalaa rojula taruvaata mee blog kochanu.
chaala miss ayanu :-(.
thanks andii...చాలా రొజుల కి వచ్చారు...
Deletejalatharu vennala gaarila raayaalante
ReplyDeletemanchi kavithavvu neevithe,
hathukune comment nu nenoutha..........
keep writing.
జలతారువెన్నెల గారు ఎప్పుడూ నా బ్లాగ్ కి రాలేదండీ.....మీరు జలతారువెన్నెల గారు లా చెప్పినందుకు చాలా ఆనందం గా ఉంది...మీ కామెంట్ హత్తుకుంది కాబట్టి నా కవిత మీకు నచ్చింది అనమాట ..థాంక్ యూ bhaskar garu..
Delete