Friday 25 May 2012

ఓ మానసనివాస.....


మనసే నీది నా మానసనివాస
నా మనసంత నీవెగా ఓ 'మాధవా..'..!!!

కలనయినా ఎంచను వేరొక ధ్యాస
'కేశవా' నీవేగా నా ప్రతి ఆశ.!!!

రంగురంగుల లొకము రమ్మని పిలిచినా
'రంగ'రంగ నీ నామమే నాకు లొకము..!!!

పరిమళ పుష్పాలెల్ల ఆకర్షించినా 
'పుండరీక' నా నామమే నాకు పరిమళము..!!!

స్వప్నమున పిలిచి కనిపించకున్నా
సీతా స్మరణ లొ సదాఉండిపొయావయ్యా..!! 



-- సీత..

10 comments:

  1. అంతగా మీ భక్తితో కట్టేసారు ఆయన్ని ఇక ఉండిపోక ఏం చేస్తాడు లేండి....
    చాలా చాలా బాగుంది... సూపర్...

    ReplyDelete
    Replies
    1. పొకూడదండీ సాయి గారు..!!
      చాలా ధన్యవాదాలండీ...

      Delete
  2. మరి "రాముడు" ఫీల్ అవుతారేమో!!! :) just kiddin
    1st line lo "మాధవా" అనుకుంటాను...

    ReplyDelete
    Replies
    1. అవునండీ నేను చూసుకోలేదు చాలా ధన్యవాదాలు తప్పు చెప్పినందుకు.ఇప్పుడు మార్చేసాను.

      ఏమండొయ్ మానస గారు , రాముడు అస్సలు బాధ పడరండీ.... ఎందుకో తెలుసా సీత మనసు స్మరించేదీ కృష్ణుణ్ణే.,
      కానీ ఆ సీత మానసనివాసుడై మాధవుడు సంచరిస్తుంటే ,
      సీత మునిగేది మాత్రం '"రామానందం" లో నే......
      అర్ధమైందనుకుంటానూ.......... :) :)
      ఛాలా ధన్యవాదాలండీ...

      - సీత.....

      Delete
  3. చాలా బాగుంది...

    ReplyDelete
  4. మీ కృష్ణ భక్తి నాకు చాలా నచ్చుతుందండీ!
    మా అమ్మమ్మకి , పిన్నికి కృష్ణుడంటే ఇష్టం.
    మా అమ్మమ్మగారు భాగవతం చదువుతుండగా నేను పుట్టాను..
    అందుకని నన్ను 'వాసుదేవా' అని పిలిచేవారు.
    మా పిన్నిగారు నాక్కూడా చిన్నప్పటినుంచే ఇష్టదైవంగా కృష్ణుడిని చేసేసారు...
    మాపిన్నిగారి ముగ్గురి పిల్లల పేర్లలో కృష్ణ ఉంది...
    అలాగే వాళ్ళ ఐదుగురు పిల్లల పేర్లలో కృష్ణ ఉంది..
    అలా మా పిన్ని తరువాత మీరు కనిపించారు నాకు...
    బ్లాగ్ లో మొదటి మీ కవిత- కృష్ణుడి గురించి చూసినప్పటినుంచి చెప్పాలని అనుకుంటున్నాను ఈ విషయాలు...
    మా అమ్మ పేరు మీద( మా అమ్మ పేరు సీత) మీ బ్లాగ్ ---మాపిన్ని కృష్ణుడి ప్రేమ :-) :-)
    మీ కవితా భక్తి బాగుంది...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు ..చదువుతుంటే భలే ఆనందం వేసింది నాకు .
      మీ అమ్మమ్మ గారికి ,మీ పిన్ని గారికీ నమస్కారాలు అండీ.
      కృష్ణుడు లేని చొటు ఉంటుందా అండీ అసలు....అన్నింటీలో అన్నీ తానయి మనలో మనకై వెలసిన ఒక రూపం.ఆయన పేరు తో పిలవబడే మీరు ఇంకా అద్రుష్టవంతులు.
      నాకు తెలిసి మీ పిన్ని గారి వయసులో సగం కుడా ఉండదేమో నాకు ఇంక పెద్దవాళ్ళ భక్తి ముందు నాది ఏ పాటిదో.మీ అమ్మ గారి పేరు కుడా సీత అన్నారు చాలా సంతోషం అండీ....
      మీకు బొలేడు ధన్యవాదాలు....చాలా ఆనందం గా ఉంది .
      --సీత

      Delete
  5. తనువు సమ్మోహన ధనువురా కృష్ణయ్య !
    వలపు పద్యాల సేవలను గొనుము
    మురళీరవపు గానముల్ మత్తురా కృష్ణ !
    వలపు పద్యాల సేవలను గొనుము
    కొనగంటి చూపులు మణిహారములు కృష్ణ !
    వలపు పద్యాల సేవలను గొనుము
    పాద ముద్రలు దివ్యపథములురా కృష్ణ !
    వలపు పద్యాల సేవలను గొనుము

    సకల సన్మంగళాకార ! చతురులేడ
    నేర్చి నావురా కృష్ణయ్య ! నిన్ను తలచి
    'సీత పలికె...', నేనును మనసిచ్చు కొంటి ,
    మాయ జేసితి వేమిరా ! మమ్ము కృష్ణ !
    -----సుజన-సృజన

    ReplyDelete
  6. స్మరించిన ప్రతి హృదయంలోనూ కొలువయ్యే కన్నయ్య కృష్ణయ్య.
    సీతా స్మరణ లోనూ ఎప్పటికీ ఉంటాడు!
    బాగుంది మీ స్మరణ!

    ReplyDelete
  7. @వెంకట రాజారావు గారు
    మీ పదముల పద్యముల సేవలు కృష్ణయ్య ఎంతో ఇష్టం గా ఆస్వాదిస్తాడు అండీ..అంత మధురం గా ఉంటాయి మరి.
    చాలా ధన్యవాదాలు ..!

    @చిని ఆశ గారు
    ధన్యవాదాలండీ...!

    --సీత

    ReplyDelete